S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 21:08

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వెంకటేశ్వర్లు నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఇటీవలే పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

05/03/2016 - 21:07

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది రాశీఖన్నా. ఆ తరువాత నటించిన సినిమాలతో గ్లామర్ హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. సాయిధరమ్‌తేజ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రాశి చెప్పిన విశేషాలు..
కామెడీ ట్రై చేశా

05/03/2016 - 21:04

నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యపాత్రల్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘అ..ఆ’. ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్‌కళ్యాణ్ సీడీలను ఆవిష్కరించారు.

05/03/2016 - 21:02

బాలీవుడ్ అందాల భామ సోనమ్‌కపూర్‌కు ఈమధ్య పెద్దగా సినిమాలు లేవు. చేసిన సినిమాలన్నీ పరాజయాల పాలవడంతో పాపం ఈమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే పలుమార్లు మేగజైన్లకోసం హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లు ఇచ్చినా కూడా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేయడంలేదు. కానీ అప్పుడప్పుడు ఫొటోషూట్‌లతో రెచ్చిపోయి ఛాన్స్‌లు కొట్టేసే ప్రయత్నం మాత్రం మానడంలేదు.

05/03/2016 - 18:11

హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల చేత దాడులు చేయించడం వల్ల తెలంగాణలో విద్యావ్యవస్థకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొందని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎగవేసేందుకే ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందన్నారు.

05/03/2016 - 18:11

దిల్లీ: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సిఫారసు చేసింది. మరో క్రికెటర్ రహానే పేరును అర్జున అవార్డుకు పరిశీలించాలని బిసిసిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

05/03/2016 - 18:06

హైదరాబాద్: తెలంగాణ, రాయలసీమలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో పండ్లతోటలకు భారీ నష్టం జరిగింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో గాలివాన బీభత్సానికి కొంతమేరకు ఆస్తినష్టం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గాలులతో చిరుజల్లులు కురియడంతో ఒక్కసారి వాతావరణం చల్లబడింది.

05/03/2016 - 18:05

కోల్‌కత: పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 1,941 మంది పోటీ చేస్తుండగా, వీరిలో 244 మంది కోటీశ్వరులున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ అధ్యయనం జరిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ఇచ్చిన ఆస్తిపాస్తుల వివరాలను పరిగణనలోకి తీసుకోగా ఎన్నికల బరిలో 244 మంది కోటీశ్వరులున్నట్టు తేలింది.

05/03/2016 - 18:05

విజయవాడ: రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగనందున గతంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఎపి టిడిపి అధ్యక్షుడు కళావెంకట్రావు అన్నారు. ఈ విషయమై మంగళవారం ఇక్కడ జరిగిన పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపైనా సమావేశంలో చర్చించామని తెలిపారు.

05/03/2016 - 18:05

దిల్లీ: గొప్ప నటుడిగా, టిడిపి వ్యవస్థాపకుడిగా జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు ఇకనైనా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని రాజమండ్రి ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఆయన మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు మరణానంతరం భారతరత్న ప్రకటించి తెలుగు ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు.

Pages