S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/31/2016 - 01:01

ఖైరతాబాద్, మార్చి 30: గత మూడు రోజులుగా మురుగునీరు సెల్లార్‌లో నిండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న చింతల్‌బస్తీలోని మొఘల్ ఇమామి మెన్షన్‌ను బుధవారం రాత్రి మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. రెండు సెల్లార్లు కలిగిన ఈ భవనంలోని మేన్షన్ 1లో సుమారు నాలుగు అడుగుల మేర మురుగునీరు నిండిపోయింది. ఈసమస్యను పరిష్కరించాలంటూ అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు.

03/31/2016 - 00:58

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవించటంతో అనేక మంది పేద రైతులు బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల బాట పడుతున్నారని, అక్కడకు వెళ్లిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలంగాణ శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

03/31/2016 - 00:57

హైదరాబాద్, మార్చి 30: అన్నిరకాలుగా వెనుకబడిన పాతబస్తీ సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) కి రూ. 200 కోట్లను కేటాయించాలని బుధవారం శాసనమండలిలో మజ్లిస్ సభ్యుడు సయ్యద్ అల్తాబ్ హైదర్ రజ్వి కోరారు.

03/31/2016 - 00:56

హైదరాబాద్, మార్చి 30: చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆశించిన స్థాయిలో అమలుకావటం లేదు. ఇందుకు శివార్లలోని పలు చెరువుల్లో కుప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తున్న గుర్రపు డెక్కే నిదర్శనం. నాచారం హెచ్‌ఎంటినగర్‌లోని చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోవటంతో దోమలు విజృంభిస్తున్నాయి.

03/31/2016 - 00:55

గచ్చిబౌలి, మార్చి 30: చేసేది ఐటి ఉద్యోగం... మంచి జీతం... జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. మాదాపూర్ డిఐ శశికాంత్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. మాదాపూర్ అరుణోదయ కాలనీలో నివాసముండే ఐటి ఉద్యోగి నితేష్‌కుమార్ (24) ఈ నెల 4వ తేదీన డ్యూటీకి వెళ్లి వచ్చి నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సెల్‌ఫోన్, పర్సు దొంగిలించుకుపోయాడు.

03/31/2016 - 00:54

హైదరాబాద్, మార్చి 30: జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ఆకస్మిక తనిఖీలతో అధికారులు, సిబ్బందిని హడలెత్తిస్తున్నారు.

03/31/2016 - 00:53

హైదరాబాద్, మార్చి 30: జిహెచ్‌ఎంసి మహానగర వాసులకు పౌరసేవలు, అలాగే అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్ల కోసం అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు వసూళ్లకు గురువారం చివరి రోజు కావటంతో అధికారులు బుధవారం మొండి బకాయిదారులతో ప్రత్యేక చర్చలు కొనసాగించారు.

03/31/2016 - 00:52

శుభకార్యానికి వెళ్తున్నామన్న వారి ఆనందం..క్షణాల్లోనే ఆవిరైపోయింది. చిన్నాపెద్ద తేడాలేకుండా పలువురు ప్రాణాలు గాలిలో కలిసి
పోయాయి. పరిగి సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన ఘటనతో

03/31/2016 - 00:44

కూసుమంచి, మార్చి 30: అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ డబుల్ బెడ్‌రూం అంటూ ప్రజలతో డబల్ గేమ్ ఆడుతోందని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విమర్శించారు. బుధవారం కేశ్వాపురంలో కాంగ్రెస్ నాయకుడు పోటు లెనిన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా సమస్యలను విస్మరించి పని చేస్తున్నారన్నారు.

03/31/2016 - 00:42

కంగ్టి, మార్చి 30: పార్టీ పిరాయింపుల చట్టం కింద ఎంపిపి అధ్యక్ష పదవిని కోల్పోయిన వాసర ఎంపిటిసి సభ్యుడు రామారావుకు జిల్లా కోర్టు స్టే మంజూరు చేయడంతో బుధవారం తిరిగి అధ్యక్ష పదవిని చేపట్టారు. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వాసర ఎంపిటిసి స్థానానికి రామారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

Pages