S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 23:42

తక్కిన రాజులందరినీ రెచ్చగొట్టాడు. ఇరవై ఒక్క అక్షౌహిణుల సైన్యం సమకూర్చున్నాడు. మధురానగరంపైకి దండెత్తి వచ్చాడు. జరాసంధుడి కూతుండ్రైన అస్తి, ప్రాస్తి అనే వారు కంసుడి భార్యలు. వాళ్ళు భర్తృహీనులైనారు. వాళ్ళను ఓదార్చి కృష్ణుడిపై పగ తీర్చుకోవటం కూడా ఉద్దేశించి అశేష సేనావాహినితో వచ్చి యమునానది ఒడ్డున మోహరించాడు జరాసంధుడు.

03/30/2016 - 23:40

‘‘రోజూ బాగానే పాలిచ్చేదండి. ఎందుకో బర్రె ఈవేళ ఫెడీమని తన్నిందండి. పాలన్నీ నేలపాలయ్యాయి’’ అన్నాడా యువకుడు. వాడాయన ఇంట్లో పాలు తీసే పాలేరు.
‘‘ఎలా తన్నిందిరా, ఇలాగా’’ అంటూ వాణ్ణి ఫెడీమని తన్నాడాయన. పాలేరు ఎగిరి అంత దూరాన పడ్డాడు. లేవడానికి చేతులు నేలకానితే- అక్కడ చిల్లపెంకు ముక్కలున్నాయి. అరచేతులు గీరుకున్నాయి.
ఆ దృశ్యం చూడగానే లతికకి గుండె గుబగుబలాడింది.

03/30/2016 - 23:37

ఉ. నిగ్రహ మేది నన్ను ఁ దరణి ప్రభ! కూపము వెల్వరించునాఁ
డుగ్రమయూఖ సాక్ష్యముగా నున్న తదక్షిణ పాణిఁ జేసి భూ
పాగ్రణి; నాదు దక్షిణ రాగ్రము వట్టితి కాన మున్న పా
ణిగ్రహణంబు సేసె : తది నీయెడ విస్తృతిఁబొందఁ బాడియే

03/30/2016 - 23:20

పిల్లలు వేసవిలో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం, తద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటతో వంట్లో నీరు వేగంగా ఆవిరైపోవడం.. ఇవి వడదెబ్బకు దారితీస్తాయి. ఇంట్లో ఉండే చిన్నపిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

03/30/2016 - 23:17

భర్త ఇచ్చిన చేయుత... అత్తింటివారు ఇచ్చిన ప్రోత్సాహం ఐదు పదులు దాటిన ఆ ఇల్లాలిని పర్వాతారోహకురాల్ని చేసింది. వాస్తవానికి నలభై ఏళ్లు దాటిన మహిళలు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. కాని 46 ఏళ్ల వయసులో ఆఫ్రికాలో అతి ఎతె్తైన పర్వతమైన కిలిమంజారో శిఖరాన్ని ముద్దాడింది. ఆ మరుసటి సంవత్సరమే యూరప్‌లోని అత్యంత ఎతె్తైన పర్వతాన్ని అధిరోహించారు. తదనంతరం అంటార్కిటికాలోని ఎత్తయిన పర్వతమైన విన్సన్‌ను అధిరోహించారు.

03/30/2016 - 23:02

‘‘మంచి ఉపాధ్యాయుడు సామాజిక వైద్యుడు’’ అని అంటారు. ఎగిరే గాలిపటానికి ఆధారం దారం ఎలాగో విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే గురువు అలాంటివాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించే గురువుఆదర్శ సమాజ నిర్మాతగా మనగలుగుతాడు. పసి మనసులో గురువునాటే బీజాలే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. దీనిని ఆచరణలో చేసి చూపెట్టారు హానాను అల్ హ్రాబ్.

03/30/2016 - 22:55

అతని వయసు 15 సంవత్సరాలు. వాళ్ళ వూరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. అతని పేరు ప్రయత్న శర్మ. ‘స్కేటింగ్‌లో కింగ్’. అతను ‘రోలర్ స్కేటర్స్’ మీద పరుగు లంకించుకుంటే మోటార్ బైకు కూడా వెంటపడి అందుకోలేదు. బిజీ ట్రాఫిక్‌లో కూడా కిలోమీటరు దూరాన్ని రెండు నిమిషాల ఎనిమిది సెకనులతో వెనక్కి తిరిగి పరిగెడుతూ దాటేస్తాడు! తాజాగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిందీ బాలుడు పేరూ ప్రఖ్యాతి. తండ్రి ఘనశ్యామ్ శర్మ యితనికి గురువు.

03/30/2016 - 22:26

బాబీ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఓ పాటలో పవన్‌కల్యాణ్‌తో తాను నటించిన సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.

03/30/2016 - 22:25

కిరణ్, సుమి ప్రధాన తారాగణంగా కె.ఎస్.ఎల్. ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వజ్రాలవేట’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఒకేసారి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఆ జీవితం ఎలా ఉంటుంది?

03/30/2016 - 22:15

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాక్మే ఫ్యాషన్‌వీక్ ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ వేడుకకోసం ఫ్యాషన్ ప్రపంచం కన్నులు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. విశ్వవిఖ్యాతిగాంచిన 90మంది డిజైనర్లు ఈ షోలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు తరలివచ్చారు. ఇక ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టిన మరో 24మంది డిజైనర్లు, మోడల్స్ ఆతృతగా ఎదురుచూసే ఈ వేడుక బాలీవుడ్ తారల తళుకుబెళుకులతో కళకళలాడింది.

Pages