S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 21:14

దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో అశాంతి నెలకొంది. చాలా రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్థి సంఘాలున్నాయి. ఈ రాజకీయ పార్టీలు తమ భావజాల వ్యాప్తికి, ఆధిపత్యానికి యూనివర్శిటీలను వేదికగా చేసుకున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో అశాంతి, ఆందోళన కలుగుతోంది. ఈ వ్యవహారాలన్నింటిపై కేంద్ర మానవవనరుల శాఖ తక్షణమే నిపుణులతో ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసి అధ్యయనం చేయాలి.

03/30/2016 - 21:13

విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు నెలవు కావద్దు. అక్కడ రాజకీయాలు బోధించాలి, సమాజంపై అవగాహన కలిగించాలి అంతేతప్ప విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా రాజకీయాలు చేయవద్ద. రాజకీయ ప్రయోజనాల కోసం విశ్వవిద్యాలయాను ఉపయోగించుకోవద్దు. తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను సంస్కరించడానికి నడుం బిగించింది. రాష్ట్రంలో 13 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లు లేరు.

03/30/2016 - 21:04

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న విసి అప్పారావును ప్రభుత్వం తిరిగి ఎలా నియమిస్తుంది? ఒకవైపు విచారణ జరుగుతుండగా, నిందితుడిగా ఉన్న విసి అప్పారావుకు మళ్లీ బాధ్యతలు అప్పగించడం విద్యార్థులను రెచ్చగొట్టే ధోరణి తప్ప మరొకటి కాదు.

03/30/2016 - 21:03

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌యుసి) జరిగిన సంఘటనలు కానీ, ఢిల్లీలోని జెఎన్‌యులో జరిగిన సంఘటనలు కానీ దాదాపు ఒకేరకమైనవి. విద్యాసంస్థలలో ఇతర శక్తులు జోరబడటంతో వల్లనే ఈ పరిణామాలకు కారణం. ఈ రెండు యూనివర్సిటీలపై కూడా స్థానిక ప్రభుత్వాల ఆజమాయిషీ లేకపోవడం కూడా అక్కడ జరిగిన పరిణామాలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

03/30/2016 - 21:01

యూనివర్శిటీల్లో విద్యార్థులు ప్రశాంతంగా విద్యను అభ్యసించే వాతావరణం ఉండాలి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ యువనేత, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రాలేదు. విద్యార్థులకు మనోధైర్యం కల్పించేందుకు రెండుసార్లు వచ్చారు.

03/30/2016 - 18:22

హైదరాబాద్: ఎపి బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేదని అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి గానీ, ఆర్‌బిఐ నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేకుండానే పబ్లిక్ డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా వాడుకుంటోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమదే నైతిక విజయం అని ఆయన చెప్పారు.

03/30/2016 - 18:22

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో పదెకరాల స్థలం చేపట్టే అమెజాన్ సంస్థ (ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ) కార్యాలయ భవన నిర్మాణాలకు తెలంగాణ ఐటీ శాఖామంత్రి కెటిఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు.

03/30/2016 - 17:49

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఓ వాహనాన్ని బుధవారం మందుపాతరతో పేల్చివేయడంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. జవాన్లు ఈ వాహనంలో దంతెవాడ నుంచి మైలవరం వెళ్తుండగా మావోలు పసిగట్టి మందుపాతర పేల్చారు.

03/30/2016 - 17:49

విజయవాడ: హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారికి చెందిన బ్యాంకు లాకర్‌ను ఎసిబి అధికారులు బుధవారం తెరిచి భారీగా నగలు కనుగొన్నారు. 19 లక్షల రూపాయల బంగారు నగలు, మూడు కిలోల వెండినగలు లాకర్‌లో లభించాయి.

03/30/2016 - 17:48

నైనిటాల్: ఉత్తరప్రదేశ్‌లో సిఎం హరీష్ రావత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభలో ఈ నెల 31న బలపరీక్ష జరగాల్సి ఉండగా, అది జరగడానికి వీలులేదని హైకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ విషయమై కేసు విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేసింది. వెంటనే అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Pages