S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/31/2016 - 00:35

రఘునాథపల్లి, మార్చి 30: మండలంలో తాగునీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే భానుడి ప్రతాపానికి చెరువులు, బావులు అడుగంటిపోయాయి. మండలంలో 24గ్రామపంచాయతీలతో పాటు 16శివారు కుగ్రామాలు ఉన్నాయి. ఇందుకుగాను 410 చేతిపంపులు, 5బోరుబావులు, 170 బోరుమోటార్లు, 30 వాటర్‌ట్యాంకులతో పాటు దాదాపు మండలంలో 50వేల జనాభా ఉంది.

03/31/2016 - 00:33

నిజామాబాద్, మార్చి 30: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా తగ్గుతోంది. ఇంగ్లీషు విద్యపై తల్లిదండ్రులకు రోజురోజుకు పెరుగుతున్న ఆకర్షణ వల్ల ప్రైవేటు పాఠశాలలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. విద్యారంగంలో వస్తున్న మార్పుల కారణంగా, ఉన్నత విద్య, ఆ పై చదువులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే చదవాల్సి వస్తోంది.

03/31/2016 - 00:30

చిట్యాల, మార్చి 30: సెల్యూలర్ సంస్థల్లో ఇంటర్‌నెట్ సేవలను వినియోగదారులకు వేగంగా అందించడంలో ఐడియా సంస్థ ముందంజలో ఉన్నదని సంస్థ జోనల్ బ్రాంచి మేనేజర్ రమేష్‌రెడ్డి అన్నారు. ఐడియా సెల్యూలర్ సంస్థ ఇంటర్‌నెట్ సేవల్లో భాగంగా 4జి సేవలను పట్టణ ప్రాంతాల్లో ప్రారంభంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో ప్రారంభించింది.

03/31/2016 - 00:17

కరీంనగర్ టౌన్, మార్చి 30: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా, అనునిత్యం అప్రమత్తతతో ఉండే వారి జీవితాల్లో మాత్రం నిరంతరం అంతరాయాలు కలుగుతూనే ఉన్నాయి. సూర్యాస్తమయం అనంతరం ఏర్పడే చీకట్లను తొలగిస్తూ, ప్రజలకు వెలుగునిస్తున్న వారి కుటుంబాల్లో అధికారులు, గుత్తేదారులు చీకట్లు నింపుతున్నారు.

03/31/2016 - 00:13

ఈమధ్య భావ ప్రకటనా స్వేచ్ఛపై వాదోపవాదాలు చాలా జరుగుతున్నాయ. ప్రభుత్వంలో ఉన్న పార్టీవారు అసహనంతో ఉన్నారంటూ నిందిస్తున్నారు. ఈమధ్య కన్నయ్యకుమార్ సభలో ఒక యువకుడు భారత్ మాతా కీ జై అని నినదించినందుకు ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు. అంటే అసహనం ఎవరికి ఉన్నదో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది తమకుమాత్రమే ఉన్నదని, ఉండాలని సోకాల్డ్ ఉద్యమ కారులు భావించడం సరైనది కాదు.

03/31/2016 - 00:10

భారత్‌లో పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పథకం ఆనాటి ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు మైనార్టీ ప్రభుత్వం మనుగడకోసం అనేక చిన్న పార్టీలను కూడగట్టుకొనే విధానంలో భాగంగా ఎంపీ ల్యాడ్స్ పుట్టుకొచ్చింది. ఈ పథకాన్ని చూసి అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల అభివృద్ధికోసం తమకూ ఇలాంటి నిధి కావాలన్నారు. ఫలితంగా ఎంపీ ల్యాడ్స్ తరహా పథకం రాష్ట్రాలకు కూడా విస్తరించింది.

03/31/2016 - 00:16

బోధన గలగల ప్రవహించే నది మాదిరిగా మారుతూ ఉంటుంది. అట్లా మారే బోధనే నికరంగా, సందర్భోచితంగా ఉంటుంది. పారిశ్రామికయుగం కన్నా ముందు మనం వ్యవసాయ రంగంలో ఉంటాము. కాబట్టి ఆ యుగం లక్షణాలు బోధనపైన కూడా సహజంగానే పడింది. వ్యవసాయంలో నారు పోయటం, నాటేయటం, కలుపులు తీయటం, దుక్కిదున్నటం, పంట నూర్చటం వీటిన్నింటి ప్రభావం తరగతి గదిలో బోధనపైన కూడా పడ్డది. కాబట్టే మనం ఆ యుగంలో అక్షరంనుంచి పదం.

03/31/2016 - 00:03

అమాయకంగా కొందరు, అయోమయం గా కొందరు, అజ్ఞానంతో కొందరు, విద్రోహబుద్ధితో మరికొందరు భరతమాత ధ్యాసను కోల్పోవడం శతాబ్దుల చరిత్ర. ఈ శతాబ్దుల విదేశీయ దురాక్రమణ సాగిన నాటివి, భావదాస్యం వదలని నేటివి...‘‘్భరత్ మాతా కీ జై’’ అని అన్నందుకు ఒక విద్యార్థిని కొందరు చితకబాదడం ప్రతీక మాత్రమే. రోగం దీర్ఘకాలికమైంది.

03/31/2016 - 00:00

ఉత్తరఖండ్ ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం బుధవారం జారీ చేసిన తాత్కాలిక ఆదేశం ఒక అనిశ్చిత స్థితిని తొలగించింది, మరో అనిశ్చిత స్థితిని సృష్టించింది! ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఈ వైచిత్రి కొనసాగనుండడం ఊపిరాడని ఉత్కంఠకు ప్రాతిపదిక...శాసనసభల చరిత్రలో అపూర్వమైన అద్భుతాన్ని ఉత్తరఖండ్ ఉన్నత న్యాయమూర్తి యు.సి.్ధ్యని మంగళవారం నాడు ఆవిష్కరించడం రాజ్యాంగ నిపుణులను సైతం గందరగోళానికి గురి చేసిన విపరిణామం!

03/30/2016 - 23:43

కోరికలు మానవ సహజం. కొన్నిసార్లు మన తాహతుకు మించి కోరికలు మరికొన్నిసార్లు ఇరుగుపొరుగు వారితో పోల్చుకుని పుట్టగొడుగుల్లా పుట్టే కోర్కెలను తీర్చుకోవడానికి ఆరాటపడి ఆయాసపడుతు వుండడం సాధారణం. ఈ సాధనలో చాలామంది జాతకాలు, శాంతులు, దోషాలు నివారణలు అంటూ దేవులాడడం సహజాతి సహజంగా ప్రతిచోటా కనిపిస్తుంది.

Pages