S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 05:21

కరాచీ, మార్చి 29: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో జట్టు వైఫల్యాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తీవ్ర అసంతృప్తితో ఉంది. కాగా, పిసిబి ఆదేశం ప్రకారం ఈమెగా టోర్నీలో జట్టు ప్రదర్శనపై వివరాలతో కూడిన నివేదికను కోచ్, మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సమర్పించాడు. ఈ విషయాన్ని పిటిఐతో మాట్లాడిన పిసిబి అధికారులు ధ్రువీకరించారు. వకార్ నుంచి నివేదిక అందిందని తెలిపారు.

03/30/2016 - 05:21

వేములవాడ, మార్చి 29: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శివకళాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు మంగళవారం త్రిశూల యాత్ర ఘనంగా జరిగింది. ధర్మగుండంలో త్రిశూలానికి వేదపండితులు ఆగమశాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.

03/30/2016 - 05:19

రాయికల్, మార్చి 29: మండలంలోని ఇటిక్యాల శివారు మొక్కజొన్న చేను లో సోమవారం రాత్రి సురకంటి రఘుపతిరెడ్డి (45)ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా గొడ్డలితో తలనరికి వేసి మృతదేహాన్ని పాక్షికంగా తగులబెట్టిన సంఘటన మండలంలో సంచలనం రేపింది.

03/30/2016 - 05:15

పెద్దపల్లి రూరల్, మార్చి 29: ఎట్టి పరస్థితిలో తాను తెలుగుదేశం పార్టీని విడిచివెళ్లనని పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలలో సరైన నాయకుడు లేకనే తాను ఆ పార్టీలో చేరుతున్నట్టు కొంత మంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

03/30/2016 - 05:14

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో విద్యారంగాన్ని అన్ని రకాలుగా పటిష్ఠపరిచి, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అట్టడుగువర్గాలు, పేదలకు సైతం మెరుగైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి వెల్లడించారు.

03/30/2016 - 05:13

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణలో రూ. 35 వేల కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాకరమైన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. టెండర్ల ప్రక్రియను ఖరారు చేసుకోవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ, మార్గదర్శకాల ఖరారును సవాలు చేస్తూ బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి దాఖలుచేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.

03/30/2016 - 05:13

కరీంనగర్, మార్చి 29: క్షణికావేశంలో చేసిన నేరాల్లో నేరం రుజువై జైలులో శిక్షను అనుభవిస్తూ సత్ప్రవర్తనతో మెదిలిన కొంతమంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాబిక్షను ప్రసాదించింది. వాస్తవానికి జనవరి 26న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ప్రభుత్వం భావించినా..కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

03/30/2016 - 05:12

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి తిరుపతికి ప్రత్యేక ట్రైన్‌లో వెళ్లనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చెప్పారు. శాసనసభలో మంగళవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మొక్కులు చెల్లించుకోవడానికి తాను ఒక్కడినే కాకుండా పది జిల్లాల నుంచి ప్రజలను తీసుకెళ్తానని, అందుకోసం ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అన్నారు.

03/30/2016 - 05:12

హైదరాబాద్, మార్చి 29: హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లయి, సివరేజ్ బోర్డు సర్వీస్‌లోకి డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) తెలిపింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన వారి వివరాలను పొందుపర్చినట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రమణియన్ ఒక ప్రకటనలో తెలిపారు.

03/30/2016 - 05:03

విజయవాడ, మార్చి 29: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం వెలగపూడిలో ఆరు బ్లాకులతో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐదు బ్లాకుల్లో సెక్రటేరియట్, ఒక బ్లాక్‌లో అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు.

Pages