S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 07:06

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం

03/30/2016 - 07:04

కర్నూలు, మార్చి 29: నంద్యాల తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు కొద్ది రోజుల్లోనే తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి శిల్పామోహనరెడ్డి వర్గాలు ఇంత కాలం మాటల యుద్ధం చేసినా తాజాగా శిల్పా వర్గీయుడైన న్యాయవాది తులసిరెడ్డిపై దాడి చేయడం, దీని వెనుక భూమా నాగిరెడ్డి హస్తం ఉందని శిల్పా వర్గం ఆరోపణలు చేయడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

03/30/2016 - 07:02

ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 29: తెలుగువాడి గౌరవాన్ని కాపాడి, జాతి ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య పేర్కొన్నారు. మంగళవారం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా వందనం చేసి, కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకున్నారు.

03/30/2016 - 07:00

గుంటూరు, మార్చి 29: రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన చేస్తూ సంక్షేమ పథకాలకు తిలోదకాలిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ మేరుగ నాగార్జున ఆరోపించారు. మంగళవారం స్థానిక అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/30/2016 - 07:00

రేపల్లె, మార్చి 29: గత రెండు మార్లుగా ఐఆర్‌ఇఎఫ్ హాస్టల్‌లో విద్యార్థినులు ఆకశ్మికంగా మృతి చెందటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని దీనిపై మహిళా కమిషన్ నివేదికను కోరటంతో హాస్టల్లో తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మంగళవారం స్థానిక ఐఆర్‌ఇఎఫ్ హాస్టల్‌లో విద్యార్థినులు, స్థితిగతులపై విచారించారు.

03/30/2016 - 06:59

తెనాలి/తెనాలి రూరల్, మార్చి 29: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే నాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన తనయుడు, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమొరియల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్టస్థ్రాయి ఎడ్లబల, పశుపాల ప్రదర్శనలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

03/30/2016 - 06:59

గుంటూరు, మార్చి 29: ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పైపులైన్ల అనుసంధానపు పనులు మెగా ఇంజనీర్స్ సంస్థ ప్రతినిధులు సక్రమంగా పూర్తి చేయకపోవటాన్ని గుర్తించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని హెచ్‌ఎల్‌ఆర్ రిజర్వాయర్ ప్రాంతంలో కమిషనర్ నాగలక్ష్మి పర్యటించారు.

03/30/2016 - 06:57

మంగళగిరి, మార్చి 29: మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలో ఎన్నారై ఆస్పత్రి ఎదుట కోట్ల రూపాయల విలువైన 2.84 ఎకరాల భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించబోయిన కేసులో నిందితులైన పాల్వాయి గురవయ్య, గడ్డం ప్రసన్నలక్ష్మి, మెలిశెట్టి వెంకటరత్నం, కైతేపల్లి మహేష్ అనే నలుగురిని అరెస్ట్ చేసినట్లు నార్త్‌జోన్ డిఎస్పీ గోగినేని రామాంజనేయులు వెల్లడించారు.

03/30/2016 - 06:55

కాకినాడ సిటీ, మార్చి 29: కోనసీమ ఉత్సవాలను ఏప్రిల్ 6వ తేదీ నుండి ఐ పోలవరం మండలం మురమళ్లలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ప్రకటించారు. కోనసీమ అందాలు ఉట్టిపడేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ కోరు టహాలులో టూరిజం, ఇతర శాఖల అధికారులతో కోనసీమ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.

03/30/2016 - 06:53

కడప,మార్చి 29: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు నిన్నటి వరకు జిల్లాలోని చోటా మోటా నేతలు తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అంతర్‌రాష్ట్ర, అంతర్జాతీయ స్మగ్లర్లు, వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ల ప్రమేయంతో పోలీసు అధికారులు స్మగ్లింగ్ నివారణకు వేగవంతం చేశామని ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తాజాగా విద్యార్థుల ప్రమేయంతో

Pages