S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 05:29

మహబూబ్‌నగర్, మార్చి 29: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వడగాల్పులు, తాగునీటి పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. వడగాల్పుల వల్ల ప్రజలు ముఖ్యంగా కూలీలు, పాఠశాలల విద్యార్థులు, వివిధ పనులపై బయటకు వెళ్లేవారు ఇబ్బందులకు గురికాకుండా తగు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు.

03/30/2016 - 05:28

మహబూబ్‌నగర్, మార్చి 29: పశువులు వధశాలలకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తాగునీరు, గ్రాసం కొరత కారణంగా పశువులను వధశాలలకు అమ్ముకుంటున్న వాటిని ఆరికట్టాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో పశువుల పరిరక్షణ, వేసవి తీవ్రత, వడగాల్పులు, తదితర అంశాలపై కలెక్టర్ టికె శ్రీదేవి సమీక్ష సమావేశం నిర్వహించారు.

03/30/2016 - 05:27

గెన్ట్ (బ్లెజయం), మార్చి 29: గెంట్ వెవెల్గెమ్ క్లాసిక్ రేస్‌లో పోటీపడిన స్థానిక సైక్లిస్టు ఆంటోనీ డిమోటీ గుండె పోటుతో మృతి చెందాడు. పీటర్ సగాన్ విజయం సాధించిన ఈ రేసు జరుగుతున్నప్పుడు ఒకానొక దశలో కొంత మంది సైక్లిస్టులు ఒకరినొకరు ఢీకొన్నారు. ఈ సంఘటనలో డిమోటీసహా చాలా మంది కిందపడ్డారు. మిగతా వారు చిన్నపాటి గాయాలతో బయటపడగా, 25 ఏళ్ల డిమోటీ గుండె పోటుకు గురయ్యాడు.

03/30/2016 - 05:29

దుబాయ్, మార్చి 29: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా టి-20 ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మెన్ విభాగంలో భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతను 871 పాయింట్లు సంపాదించగా, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ (803 పాయింట్లు), మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ 762 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.

03/30/2016 - 05:25

మియామీ, మార్చి 29: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి సూపర్ స్టార్లు సెరెనా విలియమ్స్, ఆండీ ముర్రే అనూహ్యంగా నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ నాలుగోరౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనాపై స్వెత్లానా కుజ్నెత్సొవా 6-7, 6-1, 6-2 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. మొదటి సెట్‌లో తీవ్రంగా పోరాడి గెలిచిన సెరెనా మిగతా రెండు సెట్లలో అదే స్థాయిలో ఆడలేకపోయింది.

03/30/2016 - 05:24

న్యూఢిల్లీ, మార్చి 29: పురుషుల విభాగంలో జరిగే థామస్ కప్‌లో భారత బాడ్మింటన్ జట్టుకు సులభమైన డ్రా దక్కింది. అయితే, ఉబేర్ కప్ కోసం పోటీపడే మహిళల కోసం జటిలమైన డ్రా ఎదురు చూస్తున్నది. చైనాలోని జియాంగ్‌షూ ప్రావీన్స్ కున్‌షాన్‌లో మే 15 నుంచి 22వ తేదీ వరకు థామస్, ఉబేర్ కప్ పోటీలు జరగనున్నాయ. థామస్ కప్‌లో ఇండోనేషియా, థాయిలాండ్, హాంకాంగ్‌తో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీపడుతున్నది.

03/30/2016 - 05:23

న్యూఢిల్లీ, మార్చి 29: క్రికెట్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను మహిళల విభాగంలోనూ నిర్వహిం చాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఆస్ట్రేలియాలో పేరుప్రతిష్ఠలు సంపాదించిన బిగ్‌బాష్‌తోపాటు ఇంగ్లాండ్‌లో జరిగే సూపర్ లీగ్ పోటీల్లోనూ మ హిళలకు స్థానం దక్కింది.

03/30/2016 - 05:22

న్యూఢిల్లీ, మార్చి 29: లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయభేరి మోగించి, టాపర్‌గా నిలిచిన న్యూజిలాండ్ స్పిన్ విభాగంపైనే ఇంగ్లాండ్ దృష్టి పెట్టింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బుధవారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ స్పిన్ గెలుస్తుందా లేక ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆధిపత్యమే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌కి అన్ని విధాలా సిద్ధమైనట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.

03/30/2016 - 05:22

కోరుట్ల, మార్చి 29: వైద్యులను నారాయణునితో సమానంగా కొలిచే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ కాసుల కోసం కక్కుర్తి పడి అవసరం లేకున్నా పసి పిల్లలకు అపెండెక్స్ ఆపరేషన్లు చేసి వైద్య రంగానికే తలవంపు తీసుకువచ్చిన వైద్యులపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిలింగ్ చైర్మన్ రవీందర్‌రెడ్డి అన్నారు.

03/30/2016 - 05:22

రామగుండం, మార్చి 29: మధ్యతరగతి కుటుంబాల్లో క్షణికావేశంలో పెనవేసుకొనే అక్రమ సంబంధాలు గొడవలను సృష్టించడమే కాకుండా, ఏకంగా ప్రాణాలు బలితీసుకునేలా చేస్తున్నాయి. గుట్టుగా కొనసాగే కుటుంబాలను ఇలాంటి ఘటనలతో రోడ్డున పడేలా చేస్తున్నాయి. రామగుండం- రాఘవపూర్ రైల్వేస్టేషన్ మధ్య రైలు పట్టాలపై వదిన, మరిది ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Pages