S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 04:45

హైదరాబాద్, మార్చి 29: నూతన పర్యాటక విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రాంతీయ టూరిజం హబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకుగాను ఒక్కో హబ్‌కు రూ.1.50 కోట్ల చొప్పున మొత్తం రూ.7.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

03/30/2016 - 04:44

హైదరాబాద్, మార్చి 29: శాసన సభ్యుల ప్రోటోకాల్ విషయంలో అధికారులకు స్పష్టత ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించి ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలని అధికారులకు లేఖ రాయనున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. ‘ప్రోటోకాల్‌పై చాలామంది ఎమ్మెల్యేలకు కూడా తెలియకపోవచ్చు, సీనియర్లకు తెలిసి ఉండవచ్చు.

03/30/2016 - 04:43

హైదరాబాద్, మార్చి 29: పాఠశాల, ఉన్నత విద్యను సంస్కరిస్తామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోగా, విద్యారంగంతో చెలగాటం ఆడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

03/30/2016 - 04:42

హైదరాబాద్, మార్చి 29: విజయనగరం, మచిలీపట్నం (బందరు) పట్టణాలను మున్సిపల్ కార్పొరేషన్లుగా గుర్తించినట్టు మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ మంగళవారం నాడు శాసనసభలో చెప్పారు.

03/30/2016 - 04:31

న్యూఢిల్లీ, మార్చి 29: ఆన్‌లైన్ మార్కెట్ సంస్థల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) మార్గదర్శకాల ప్రకారం ఈ-కామర్స్ రిటైలర్లలో 100 శాతం ఎఫ్‌డిఐకి కేంద్రం అనుమతించింది.

03/30/2016 - 04:46

సిడ్నీ, మార్చి 29: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా మదుపరులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆహ్వానించారు. ప్రస్తుతం నాలుగు రోజుల ఆసీస్ పర్యటనలో ఉన్న జైట్లీ.. మంగళవారం ఇక్కడ సిడ్నీ క్యాంపస్ ఆఫ్ ఎస్‌పి జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

03/30/2016 - 04:27

ముంబయి, మార్చి 29: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. ఈ నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న క్రమంలో సూచీలకు ఒడిదుడుకులు తప్పలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య విధానంపై ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ప్రసంగించనున్న క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులపై కొంత ఊగిసలాటకు గురయ్యారు.

03/30/2016 - 04:27

న్యూఢిల్లీ, మార్చి 29: సహారాకు చెందిన పలు ఆస్తులను అమ్మేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి మదుపరుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు భారీగా నిధులను సమీకరించాయన్న కేసులో గత రెండేళ్ల నుంచి సహారా అధినేత సుబ్రతా రాయ్ జైళ్లో ఉంటున్నది తెలిసిందే.

03/30/2016 - 04:26

న్యూఢిల్లీ, మార్చి 29: వాహనదారులపై బీమా భారం మరింత పెరగనుంది. కార్లు, బైక్‌లు తదితర వాహనాల బీమా ప్రీమియంలు వచ్చే నెల 1 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి మరి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) నుంచి వాహన బీమా ప్రీమియంలను పెంచాలని బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ నిర్ణయించడంతో ఏప్రిల్ 1 నుంచి మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలకు రెక్కలు రానున్నాయి.

03/30/2016 - 04:25

న్యూఢిల్లీ, మార్చి 29: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డుకు యుద్ధ నౌకల తయారీ కాంట్రాక్టులు ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు లేఖ రాసారు. యుద్ధ నౌకల తయారీకి సంబంధించిన కమిటీ 10 వేల కోట్ల రూపాయల విలువైన యుద్ధనౌకల తయారీకి సిఫార్సు చేసిందని, ఆ కాంట్రాక్టులు హిందుస్థాన్ షిప్‌యార్డుకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Pages