S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 06:52

కరీంనగర్, మార్చి 26: రాష్ట్ర పురపాలక, పంచా యతీరాజ్ శాఖల మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎస్‌ఎల్ పథకం (మరుగుదొడ్ల) నిర్మాణాల్లో అవినీతి చీడ పట్టుకుంది. ఆ అక్రమాలపై జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఎట్టకేలకు కొర డా ఝుళిపించారు. బాధ్యులపై చర్యలు చేపట్టారు.

03/27/2016 - 06:52

హైదరాబాద్, మార్చి 26: ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు చల్లదనంకోసం శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌ల వైపు మొగ్గుచూపుతారు. అయితే అనాదిగా ‘అంబలి’కి తెలంగాణలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శనివారం అసెంబ్లీ ఆవరణలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.

03/27/2016 - 06:51

నెల్లూరు కలెక్టరేట్, మార్చి 26: ఉచిత ఇసుక రవాణాలో పరిశ్రమ సంస్థల వారు నిర్ధేశించిన నిబంధనల ప్రకారం అవసరమైన ఇసుకను తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టర్ చాంబర్‌లో పరిశ్రమల సంస్థల యాజమాన్యాలతో ఉచిత ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించారు.

03/27/2016 - 06:51

సంగారెడ్డి, మార్చి 26: మానసికంగా, శారీరకంగా కృంగి, కృశించి పోతున్న మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి కొత్త వెలుగులు ప్రసాదించడానికి మెదక్ పోలీసులు అమలు పరుస్తున్న ‘చేతన’ కార్యక్రమం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.

03/27/2016 - 06:46

శ్రీకాకుళం, మార్చి 26: రాష్ట్ర కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో అచ్చెన్న జన్మదిన వేడుకలకు హాజరైన సిఎం కేక్ కట్‌చేసి తినిపించారు. అలాగే మరింత సమర్ధవంతంగా సేవలందించి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడాలని చంద్రబాబు సూచించారు.

03/27/2016 - 06:46

శ్రీకాకుళం(కల్చరల్), మార్చి 26: కళలకు పుట్టినిల్లు, కళాకారులు ఖిల్లాగా ప్రసిద్ధికెక్కిన జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో సువిశాలమైన కళాప్రదర్శనల వేదిక థియేటర్ లేకపోవడం కళాభిమానులను కలచివేస్తోంది. పట్టణం నడిబొడ్డున ఉన్న బాపూజీ కళామందిరం సాంస్కృతిక కార్యక్రమాలకు ఏకైక కళావేదికగా నిలబడింది.

03/27/2016 - 06:44

శ్రీకాకుళం(టౌన్), మార్చి 26: ఇందిరా విజ్ఞాన్ భవన్‌ను ఆనుకొని ఉన్న తపాలా శాఖ స్థల వివాదం ముదిరిపోతోంది. ఇదివరకు ఇదే స్థలంపై తపాలా శాఖ స్వాధీనం చేసుకునే సమయంలో జిల్లా కాంగ్రెస్ నేతలు అడ్డుకోగా పోలీసులు, రెవెన్యూ అధికారులు కల్పించుకొని రికార్డుల ప్రకారం స్థలాన్ని సర్వేయర్ల ద్వారా కొలతలు వేయించి స్థలాన్ని తపాలా శాఖ అధికారులకు అప్పగించారు.

03/27/2016 - 06:43

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం

03/27/2016 - 06:40

ఆలమూరు, మార్చి 26: మండల పరిధి జొన్నాడ ఇసుక ర్యాంపు రోజుకొక వివాదంతో తవ్వకాలు నిలిచిపోతున్నాయి. ట్రాక్టర్లకు లోడింగ్‌ను జొన్నాడకు చెందిన శాండ్ సొసైటీ నిర్వహిస్తుండగా, కొత్తగా లారీలకు కోరుమిల్లి, కపిలేశ్వరపురం నుండి సుమారు యాభై మంది కూలీలు నిబంధనలు ప్రకారం అంగీకార పత్రం ఇచ్చి ఎగుమతులు సాగిస్తున్నారు.

03/27/2016 - 06:40

కాకినాడ, మార్చి 26: గంగాధరం మ్యూజికల్ పార్టీ వ్యవస్థాపకుడు పెద్దిరెడ్డి గంగాధరం (79) అనారోగ్యంతో మృతిచెందారు. శనివారం రాత్రి ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గంగాధరం మాస్టారుగా పేరుపొందిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంగీత కచేరీలు నిర్వహించారు. స్థానిక జగన్నాధపురంలోని గంగాధరం స్వగృహానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు.

Pages