S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 06:11

బోధన్ రూరల్, మార్చి 26: నిజాంసుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బోధన్ మండలం సాలూరా గ్రామం వద్ద జాతీయ రహదారి పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు.

03/27/2016 - 06:10

నల్లగొండ, మార్చి 26: వడదెబ్బ తీవ్రతతో నల్లగొండ జిల్లాలో ముగ్గురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఒకరు మరణించారు. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన పెద్దబోయిన సైదులు (55) తన వ్యవసాయబావి వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

03/27/2016 - 06:09

హైదరాబాద్, మార్చి 26: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పట్ల వివక్ష కొనసాగుతోందని, దళిత, మైనార్టీ వర్గాల అణచివేతతో విద్యార్థులు అసహనానికి గురవుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, గీతారెడ్డి ఆరోపించారు. శనివారం శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌వద్ద విలేఖరులతో మాట్లాడారు.

03/27/2016 - 06:09

హైదరాబాద్, మార్చి 26: విశ్వవిద్యాలయాల్లో దేశ ద్రోహ చర్యలను కఠినంగా అణిచివేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై శనివారం శాసన సభలో హోంమంత్రి ప్రకటన చేశారు.

03/27/2016 - 06:08

హైదరాబాద్, మార్చి 26: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేసేందుకు కేంద్రంలోని బిజెపి సర్కార్ యోచిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. విశ్వవిద్యాలయాలను కాషారుూకరణ చేసే దిశగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల మధ్య కేంద్రం చిచ్చుపెడుతుందని ఆయన ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు.

03/27/2016 - 06:08

గుంటూరు (కొత్తపేట), మార్చి 26: తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 29వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. 1982 మార్చి 29న స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించిందన్నారు.

03/27/2016 - 06:07

గుంటూరు, మార్చి 26: ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదపడే లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. శనివారం గుంటూరు వైద్య కళాశాల ఆవరణలోని డాక్టర్ కెఆర్‌ఆర్ మోహనరావు సెమినార్ హాలులో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యాన లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం అనే అంశంపై సమావేశం జరిగింది.

03/27/2016 - 06:03

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 26: మహాకవి, నాటకకర్త, నవలా రచయిత, కథా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి కావ్యం ప్రార్థనా గీతాల సమాహారమని ప్రముఖ సాహితీవేత్త డా. మాదిరాజు రామలింగేశ్వరరావు అన్నారు. స్థానిక బచ్చుపేట మహతి గ్రంథాలయంలో నిర్వహిస్తున్న నెలనెలా వెనె్నల కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ‘రవీంద్రనాథ్ ఠాగూర్ - గీతాంజలి’ అనేం అంశంపై ప్రసంగించారు.

03/27/2016 - 06:03

పటమట, మార్చి 26: పునరుత్థానుడైన క్రీస్తుకు జయ హో అంటూ స్వాగతం పలుకుతూ నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాలు, రన్ ఫర్ జీసస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం వేలాది మంది క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

03/27/2016 - 06:02

విజయవాడ, మార్చి 26: రైతులు, వినియోగదారుల ప్రయోజనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని వసతులతో రైతుబజార్ నిర్వహించే విధంగా నమూనాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. స్థానిక గాంధీనగర్‌లోని అంలకార్ థియేటర్ సమీపంలోని రైవస్ కెనాల్ కట్టపై రైతుబజార్‌ను ఏర్పాటు చేసేందుకు శనివారం మధ్యాహ్నం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి స్థలం పరిశీలించారు.

Pages