S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 06:24

విశాఖపట్నం, మార్చి 26: జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్టు సిఇఒ జయప్రకాష్ నారాయణ తెలిపారు. ఉదయం 11 గంటలకు చైర్‌పర్సన్ లాలంభవానీ అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సర్వసభ్య సమావేశంలో పాల్గొనాలని ఆయన తెలిపారు.

03/27/2016 - 07:04

హైదరాబాద్, మార్చి 26: హెచ్‌సియు వైస్-్ఛన్సలర్ అప్పారావును రీ-కాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసి పంపిద్దామని అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం అసెంబ్లీ సమావేశంలో హెచ్‌సియు గొడవల అంశంపై పాలక-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.

03/27/2016 - 06:20

విశాఖపట్నం, మార్చి 26: చాలా కాలంగా ఊరిస్తున్న అరకుకు అద్దాల రైలు కల త్వరలో నెరవేరనుంది. అయితే అద్దాల రైలు కాకుండా ముందుగా రెండు బోగీలతో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని విశాఖ ఎంపి కె.హరిబాబు తెలిపారు.

03/27/2016 - 06:19

విశాఖపట్నం, మార్చి 26: విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు మరింతగా ఎయిర్ కనెక్టివిటీ అవసరమని విశాఖ ఎంపి కె.హరిబాబు అన్నారు. విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలన్నారు. సరకు రవాణా రంగంపై కూడా విమానయాన సంస్థలు దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు.

03/27/2016 - 06:18

విశాఖపట్నం, మార్చి 26:రాజకీయాల్లో నిబద్దతకు మారుపేరైన పూసపాటి ఆనంద గజపతి రాజు మృతి తీరని లోటని పలువురు నాయకులు అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచిన ఆనంద్ మృతి పట్ల పలువురు నాయకులు తమ తీవ్ర దిగ్భ్రాంతి, వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

03/27/2016 - 06:17

విశాఖపట్నం, మార్చి 26: దేవాదాయ శాఖకు సంబంధించి ఆక్రమణకు గురైన విలువైన భూముల స్వాధీనానికి దేవాదాయ శాఖ ఉపక్రమించింది. దీనిలో భాగంగా నగరంలోని అల్లిపురం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన టౌన్ సర్వే నెంబర్ 1450లోగల 600 చదరపుగజాల భూమిని చాలాకాలంగా ఆక్రమణదార్ల కబంధహస్తాల్లో చిక్కుకుంది.

03/27/2016 - 06:16

విశాఖపట్నం, మార్చి 26: ఉచిత ఇసుక విధానంలో భాగంగా జిల్లాలో గుర్తించిన రీచ్‌లకు టెక్నికల్ అసిస్టెంట్లను నియమిస్తూ సంయుక్త కలెక్టర్ జె నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఇసుక రీలకు నీటి పారుదల శాఖ ఇంజనీర్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన ప్రభుత్వం వీరికి సహాయకులుగా ఉండేందుకు టెక్నికల్ సహాయకులను నియమించినట్టు జెసి నివాస్ తెలిపారు.

03/27/2016 - 06:14

నెల్లిమర్ల, మార్చి 26: రామతీర్థం పుణ్యక్షేత్రం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు మృతికి సంతాపంగా దేవాలయాన్ని శనివారం మూసివేసారు. ఆలయ సిబ్బంది ఆలయ ముఖ ద్వారం వద్ద వౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆలయ ఇ ఓ పి.బాబూరావు మాట్లాడుతూ ఆనందగజపతిరాజు మృతి తీరని లోటని అన్నారు. ఆయన మృతికి సంతాపంగా దేవాలయాన్ని శనివారం సూర్యాహస్తమయ వరకు మూసి వేస్తామని అన్నారు.

03/27/2016 - 06:13

విజయనగరం (టౌన్), మార్చి 26: మాన్సాస్ విద్యాసంస్థల చైర్మన్, మాజీ మంత్రి పి.ఆనందగజపతిరాజు శనివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూయడంతో విజయనగరం జిల్లా యావత్తు దుఖ-సాగరంలో మునిగిపోయింది. ఆయనను కడసారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కంటోనె్మంట్‌లోని ఆనంద్ నివాసానికి చేరుకున్నారు.

03/27/2016 - 06:12

విజయనగరం, మార్చి 26: దాతృత్వానికి మారుపేరైన మాజీమంత్రి, మాజీ ఎంపి, మాన్సాస్ విద్యా సంస్థల చైర్మన్ పూసపాటి ఆనందగజపతిరాజు(65) కన్నుమూయడంతో జిల్లా ప్రజానీకం మూగబోయింది. రాజకీయాల్లో దాతృత్వాన్ని జొప్పించి, నాయకుడంటే ఇలా ఉండాలని చాటిన ఓ నేతను కోల్పోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Pages