S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 06:39

ఐ పోలవరం, మార్చి 26: యానాం వైపు నుండి బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక యువకుడు మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఐ పోలవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

03/27/2016 - 06:38

మలికిపురం, మార్చి 26: శంకరగుప్తం గ్రామానికి చెందిన ఎడ్ల రాజేష్‌కు చెందిన డాబర్‌మెన్ కుక్క శనివారం పది పిల్లలకు జన్మనిచ్చింది. లక్షా యాభైవేల వ్యయంతో ఈ డాబర్‌మేన్ కుక్కను యుకె నుండి తెప్పించుకున్నామని, గతంలో ఈ కుక్క ఇరు పిల్లలకు జన్మనివ్వగా ఈ సంవత్సరం పది పిల్లలకు జన్మనిచ్చిందని రాజేష్ తెలిపాడు.

ఉన్నత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
క్రికెటర్ వేణుగోపాలరావు పిలుపు

03/27/2016 - 07:33

విజయవాడ, మార్చి 26: అత్యున్నతమైన పార్లమెంట్ భవనాన్ని అందులోనున్న పార్లమెంటు సభ్యులతో మట్టుబెట్టే దురుద్దేశంతో 13 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అఫ్జల్‌గురు, ముంబయి పేలుళ్లలో సూత్రధారి యాకూబ్ మీనన్ వంటి వారికి జేజేలు పలుకుతున్న సంఘ విద్రోహులకు సంఘీభావం పలుకటం సిగ్గుచేటని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు.

03/27/2016 - 06:36

రావులపాలెం, మార్చి 26: ఉచిత ఇసుక విధానం ప్రారంభమయ్యాక రావులపాలెం మండలం ఊబలంక ఇసుక ర్యాంపులో రోజుకో వివాదం తలెత్తుతూనే ఉంది. శుక్రవారం రాత్రి అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్ ఈ ర్యాంపును పరిశీలించి, ర్యాంపులో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల కారణంగా అయిదు యూనిట్ల లారీలకు ఎగుమతులు ఆపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

03/27/2016 - 06:34

హైదరాబాద్, మార్చి 26: అనంతపురంలోని మిస్సమ్మ బంగ్లా కేసులో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు అధికార పార్టీ ప్రస్తావించడంతో ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార, ప్రతిపక్షం మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ఈ సందర్భంగా శాసనసభలో ప్రకటించారు.

03/27/2016 - 06:33

హైదరాబాద్, మార్చి 26: రాజధాని నగర నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూముల్లో చేపట్టే నిర్మాణాలు, పనులన్నీ సిఆర్‌డిఏ చట్ట పరిధికి లోబడే చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు ఇష్టానుసారంగా లీజులుకు ఇస్తున్నారన్న మాట వాస్తవం కాదని అన్నారు.

03/27/2016 - 06:33

ఏలూరు, మార్చి 26 : కళలను ఆరాధించి ప్రోత్సహించే పరిస్థితి రాజులకాలం నుండి కొనసాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు కళారంగానికి పూర్వవైభవం తీసుకువస్తున్నారని మేయర్ షేక్ నూర్జహాన్ చెప్పారు. స్థానిక వై ఎంహెచ్ ఏ 111 వసంతోత్సవ సభలో శనివారం సాయంత్రం పలువురు కళాకారులను మేయర్ ఘనంగా సత్కరించారు.

03/27/2016 - 06:33

భీమవరం, మార్చి 26: ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. స్ధానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో శనివారం జరిగిన ఆక్వా రైతుల సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆక్వా రైతులు మంత్రికి సమస్యలు వివరించారు.

03/27/2016 - 06:33

హైదరాబాద్, మార్చి 26 : రాష్ట్ర ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా పరిపాలనను అందించేందుకు ‘ఇ-ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శాసనసభలో శనివారం ఇ-ప్రగతిపై ఒక ప్రకటన చేస్తూ, ప్రజలకు వివిధ రంగాలకు సంబంధించి 745 సేవలను అందించాలన్నదే ఇ-ప్రగతి లక్ష్యమన్నారు.

03/27/2016 - 06:32

గుంటూరు, మార్చి 26: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులు గుంటూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్న తరుణంలో పార్టీ కార్యాకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగించాలనే తలంపుతో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. శనివారం పార్టీ హైకమాండ్ నుంచి పరిశీలకులుగా నాయకులు సాంబశివరావు, పార్టీ సాంకేతిక విభాగం సభ్యుడు రాజేష్ తదితరులు జిల్లాపార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.

Pages