S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2015 - 14:19

హైదరాబాద్: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. 2016-17 విద్యా సంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వం, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా కొత్తగా గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

12/19/2015 - 14:18

విశాఖపట్టణం : విశాఖ పట్టణం ఉక్కు కర్మాగారం లో ఓ కార్మికుడు ప్రమాద వశాత్తు మృతిచెందాడు. ఉదయం కార్మాగారంలో పనిచేస్తున్న కేఎస్ఆర్ మూర్తి (48) అనే కార్మికుడు క్రేన్ పై నిలబడి పనిచేస్తున్నాడు. ప్రమాద వశాత్తు పైనించి పడిపోడంతో.. తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. మృతి చెందిన కార్మికుడు.. ఇటీవల జరిగిన బీఎంఎస్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

12/19/2015 - 14:12

మహబూబ్‌నగర్ : జిల్లాలోని తలకొండపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి రూ. 4,000 లంచం తీసుకుంటుండగా వీఆర్‌వో నరసింహ్మారెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

12/19/2015 - 14:10

న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం సోనియా, రాహుల్ గాంధీపై రాజకీయ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్షాలను టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికలకు మందు కాంగ్రెస్ రహిత భారత్ కోసం బీజేపీ ప్రయత్నించింది. అధికారంలోకి వచ్చాక విపక్ష రహిత భారత్ కోసం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/19/2015 - 14:08

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ను మెడికల్‌ హబ్‌గా తయారు చేయాలనేదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ శంకస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... వైద్య సేవలకు అమరావతి కేంద్రంగా తయారుకాబోతుందన్నారు.

12/19/2015 - 14:05

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసును చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఈ కేసును రాజకీయం చేయదల్చుకోలేదని తెలిపారు. న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామని చెప్పారు. రాజకీయాలు కాంగ్రెస్ చేయట్లేదు.. బీజేపీనే చేస్తుందని మండిపడ్డారు. అసహనంపై పార్లమెంట్‌లో ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వలేదు.

12/19/2015 - 14:02

హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 77 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

12/19/2015 - 14:00

ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. 2015లో భారత్ ఆర్థికంగా ఎంతో పురోగమించిందని జైట్లీ తెలిపారు. రాష్ర్టాల అభివృద్ధితోనే కేంద్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పుష్కలంగా ఉంది. జీడీపీలో అత్యధిక శాతం వ్యవసాయరంగానిదేనని వెల్లడించారు.

12/19/2015 - 13:07

హైదరాబాద్‌: వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేయడం బాధాకరమని భాజపా సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఏపీ శాసనసభలో విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ... సస్పెన్షన్‌ను ఈ సమావేశాల వరకే పరిమితం చేస్తే బాగుంటుందని సభాపతికి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సభలో ప్రతిపక్ష సభ్యులు ఉండే అవకాశమే లేదన్నారు.

12/19/2015 - 13:06

హైదరాబాద్: దేశ సమస్యలు పరిష్కరించేలా యువత కొత్త పరిశోధనలు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజీ 88వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ స్నాతకొత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్‌తోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.

Pages