ఎన్‌హెచ్‌పిఎస్ అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘జాతీయ ఆరోగ్య రక్షణ పథకం’ (ఎన్‌హెచ్‌పిఎస్) పై అధ్యయనం చేసి నివేదిక రూపొందించేందుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చైర్మన్‌గా ఉంటారు. మరో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మెంబర్-కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్యం, ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించిన ముఖ్యమైన వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరించి నివేదిక రూపొందించాలని సూచించారు.