శ్రీవారి ఆర్జిత సేవ నకిలీ టిక్కెట్లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 17: తిరుమల శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాతం సేవ టికెట్లు ఆన్ లైన్ లక్కీ డిప్ ద్వారా అధికంగా పొంది వాటిని అక్రమంగా అమ్ముకుంటూ నకిలీ టికెట్లు సృష్టిస్తున్న మోసగాడి గుట్టును టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ఎట్టకేలకు ఛేదించారు. డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమంలో ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో కొద్దిమందికి మాత్రమే ఎక్కువ టికెట్లు లభిస్తున్న విషయంపై ఫిర్యాదులు అందాయి. దీనిపై సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ సిబ్బంది నిఘాపెట్టారు. ఆన్‌లైన్ లక్కీడిప్ డేటాను విశే్లషించారు. ఈ నేపథ్యం లో శుక్రవారం సుప్రభాతం సేవ టికెట్లతో వచ్చిన మహారాష్ట్ర, షోలాపూర్‌కు చెందిన నాగేష్ జనార్దన్ ఊడ్తా ఆయన సతీమణి వనితలతో పాటు గా, విజయకుమర్, బసవరాజు రామచంద్ర చౌగులేల సుప్రభాతం సేవా టికెట్లను వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. సుప్రభాతం సేవా టికెట్లలో, వచ్చిన వ్యక్తు ల ఆధార్ కార్డుల్లోని పేర్లు వేర్వేరుగా ఉండటం గుర్తించి ప్రశ్నించారు. దీంతో వారు అసలు విషయం బయటపెట్టారు. షోలాపూర్‌కు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి తమకీ సుప్రభాతం సేవా టికెట్లు అధిక ధరకు ఇచ్చిన తెలిపారు. తమ పేర్లతో నకిలీ ఆధార్‌కార్డులు సృష్టించి దర్శనానికి పంపించాడని వివరించారు. ప్రభాకర్‌పై వారు తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ప్రభాకర్ ప్రతి నెలా 1000 రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఆన్‌లైన్ లక్కీడిప్‌లో ఇతను ఎక్కువ టికెట్లు పొందుతూ ఆర్జిత సేవా టికెట్లకోసం తన వద్దకు వచ్చిన వారికి తన వద్ద ఉన్న టికెట్లను అధిక ధరకు విక్రయిస్తూ, నకిలీ ఆధార్‌కార్డులు సృష్టించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించారు. ఆధార్ కార్డులోని పేర్లు, ఫొటోలను సైతం మార్చి వేస్తున్న విషయాన్ని గుర్తించారు. కాగా ప్రధాన నిందితుడు ప్రభాకర్‌పై తిరుమలలో పోలీస్ కేసు నమోదు కావడంతో అతని కోసం ప్రత్యేకంగా పోలీసులు షోలాపూర్‌కు వెళ్లనున్నట్టు సమాచారం.