నెలాఖరులో తిరుమలకు కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24:తిరుమల శ్రీవారికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కులు చెల్లించుకోనున్నట్టు అధికార వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుపతికి వచ్చి శ్రీవారికి కానుకలు సమర్పించుకోనున్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శ్రీనివాసుడికి వజ్రకిరీటం, తిరుచనూరు పద్మావతి అమ్మవారికి బంగారు హారాన్ని సమర్పించేందుకు రూ. 5కోట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది చెల్లించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఆభరణాలను టిటిడి తయారు చేయించింది. ఆరు నెలల కిందటే నగలు సిద్ధమైన్నప్పటికీ మొక్కుల సమర్పణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. క్యాంపు కార్యాలయానికి గృహ ప్రవేశం కార్యక్రమం గురువారం ముగియడంతో ఇక తిరుపతికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తన మంత్రివర్గ సహచరులు, కుటుంబ సభ్యుల సమ్మేతంగా ప్రత్యేక రైల్లో ముఖ్యమంత్రి తిరుపతికి వెళ్లి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం ఈ నెలాఖరున ఖరారు కానున్నట్టు సమాచారం.