మిర్చికి దక్కని మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 9: ఆందోళనలు, అరెస్టులు మద్దతు ధరను సాధించలేకపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఘటన ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతును ఆదుకుంటామని ప్రకటించాయి. కేంద్రం క్వింటా మిర్చికి 5వేల రూపాయలు ధరతో పాటు ఖర్చుల కింద మరో 1,250రూపాయలు ఇవ్వాలని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని సూచించింది. ఈ ధరకు కూడా ఈ నెల చివరి వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీంతో రైతుల్లో కొంత ఆశ నెలకొన్నది. ఆ ఆశతోనే తమ పంటను మార్కెట్‌కు తీసుకువస్తే రైతులకు నిరాశే ఎదురవుతోంది. మార్కెట్‌లో పాత పద్ధతిలోనే అతి తక్కువ ధరకు కొనుగోళ్ళు జరుగుతున్నాయి. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నామని చెపుతున్నప్పటికీ వ్యవసాయ మార్కెట్‌లో అది అమలు కావటం లేదు. ఖమ్మం మార్కెట్‌లో మంగళవారం కొంత మంది రైతులు మద్దతు ధరపై వ్యాపారులను ప్రశ్నిస్తే వారు సదరు రైతుల పంటలను కొనుగోలు చేయలేదు. దీంతో ఆందోళనకు గురైన రైతులు ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా మార్కెట్‌లో మాత్రం వ్యాపారులు చెప్పిందే వేదమంటూ తమ కమీషన్ వ్యాపారుల ద్వారా పంటను అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం మార్కెట్‌లో మద్దతు ధర దక్కటం లేదనే ప్రచారం విస్తృతం కావటంతో ఇక్కడకు మిర్చి తీసుకువచ్చే రైతులు కూడా తగ్గారు.
ఎక్కువ ధరకు చైనా ఫ్యాక్టరీకి
ఇదిలా ఉండగా ఖమ్మం మార్కెట్‌లో మార్కెట్ చైర్మన్‌కు సన్నిహితంగా ఉండే కొందరు వ్యాపారులు ఆయా రాజకీయ పార్టీల నేతలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేసి అధిక ధరకు ముదిగొండ సమీపంలోని చైనా ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చైనా ఫ్యాక్టరీకి మిర్చి సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్న కొందరు వ్యాపారులు ఈ తరహ దందాకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం రాజకీయ పార్టీల నేతలతో పాటు మార్కెట్ పాలక వర్గానికి కూడా తెలుసని రైతులు బాహటంగానే చెబుతున్నారు. గతంలో కూడా ఇదే విధమైన పద్ధతి నడిచిందని, గత నెల 28న రైతులు ఆగ్రహంతో మార్కెట్‌పై దాడి చేసిన తరువాత కొద్ది రోజుల పాటు చైనా ఫ్యాక్టరీకి మిర్చి తరలింపు నిలిపివేసి, గత రెండు రోజుల నుండి తిరిగి ప్రారంభించారని తెలుస్తోంది. దీని వెనుక కొంత మంది రాజకీయ నేతలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మార్కెట్‌లో మరోసారి 28నాటి సంఘటనలు పునరావృతం కావని, చైనా కంపెనీకి అనుకున్నట్లుగానే మిర్చి సరఫరా జరగాలని సదరు నేతలు వ్యాపారులకు హమీ ఇచ్చి అండగా ఉంటున్నట్టు సమాచారం.