గాడ్సే నెంబర్-1 హిందూ ఉగ్రవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: మహాత్మాగాంధీని చంపిన గాడ్సే ‘నెంబర్-1’ హిందూ రత్న ఉగ్రవాది అని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్య చేయడమే కాదు, దీనిపై తనకు నోటీసు జారీచేసే దమ్ము ఎవరికైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. ముస్లింలు ఎన్నడూ భారత్‌ను అమ్మడానికి యత్నించలేదు. కాకపోతే గత 70 ఏళ్లుగా అణచివేతకు గురయ్యారన్నారు. ‘గత 70 ఏళ్లుగా మేం బెదిరింపులకు గురవుతూనే ఉన్నాం. మహా అయితే మీరు మమ్మల్ని చంపేస్తారు. చంపేయండి. కానీ మేం ఇక్కడే జీవిస్తాం, ఇక్కడే మరణిస్తాం’ అన్నారు. ‘్భరతీయ ముస్లింలు సిరియా లేదా పాకిస్తాన్‌కు వెళ్లరు. వెళ్లేవారంతా ఇప్పటికే పాకిస్తాన్ వెళ్లిపోయారు. మా తాత ముత్తాతలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. వారు హిందూస్థాన్ జిందాబాద్ అనే నినాదాలిచ్చారు’ అన్నారు. పూణెలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద తలాక్ బిల్లును కూడా ప్రస్తావించారు. దీనిపై మోదీని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘ మోదీ ఒక్కసారి కళ్లు తెరవండి. మీరు ముస్లిం మహిళల బాగు కోరేవారు కాదు. మీరు మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు’’ అన్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువుశ్రీ శ్రీ రవిశంకర్‌ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రామజన్మభూమి సమస్యపై ఇటీవల ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రవిశంకర్ ముస్లింలను బెదిరించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.
‘‘కేసు కోర్టు విచారణలో ఉన్నప్పుడు రవిశంకర్ ఈవిధంగా వ్యాఖ్యానించడం బెదిరింపు కాక మరేంటి?’’ అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని లేవనెత్తి ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు. ఈవిధంగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో, ఈ కేసును 2019 సాధారణ ఎన్నికల తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు విచారించాలన్నారు. రవిశంకర్ మాటలు చూస్తుంటే ఆయన శాంతి కాముకుడు కాదని, రాజ్యాంగంపై విశ్వాసం లేనివాడిగా భావించాల్సి వస్తోందన్నారు.