స్పాట్ లైట్

మార్స్‌లో కొలను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగారక గ్రహంపై జరుగుతున్నన్ని పరిశోధనలు ఇప్పటి వరకూ మరే గ్రహంపైనా జరుగలేదేమో..! అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గతంలో క్యూరియోసిటీ రోవర్‌ను పంపినప్పటి నుంచీ ఈ గ్రహానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆసక్తికర వివరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆపర్చునిటీ రోవర్ జరిపిన పరిశోధనల్లో ఏకంగా ఓ ప్రాచీన కొలనే కనిపించింది. ఈ కొలను మార్స్ సొరంగ ప్రాంతం చివర ఉందని కూడా ఈ రోవర్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండీవర్ గొయ్యి ప్రాంతంగా భావిస్తున్న ఇందులో ఈ కొలను సహజసిద్ధంగానే ఏర్పడిందట.దీని ఉపరితలాన్ని సర్వే చేసిన నిపుణులు ఆపర్చునిటీ రోవర్‌ను మరింత లోతుకు దింపి కొలను వివరాలను మరింతగా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2011 నుంచి ఎండీవర్ క్రేటర్ చుట్టుపక్కల విస్తృత స్థాయిలోనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కొలను కోటానుకోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడి ఉండవచ్చునని కూడా శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు.