స్పాట్ లైట్

చైనాను నమ్మొచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోక్లామ్ వివాదానికి ఆజ్యం పోసినట్టే చైనా సీపెక్ ప్రాజెక్టును చేపట్టింది. సిక్కిం, భూటాన్, చైనా సరిహద్దుల్లో చైనా రోడ్డు మార్గ నిర్మాణాన్ని చేపట్టింది. ఆ రోడ్డు పూర్తయితే మన దేశానికి సైనికపరంగా అత్యంత కీలకమైన ప్రదేశం కావడంతో మున్ముందు సిలిగురి కారిడార్‌పై కూడా చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది
చైనా పాక్ ఆర్ధిక నడవా (సీపెక్)కు సంబంధించిన అభిప్రాయబేధాలను పరిష్కరించుకునేందుకు భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా చెబుతోంది. రెండు దేశాల జాతి ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి హువచునియాంగ్ అన్నారు. రెండు దేశాల మధ్య సమస్యలు తలెత్తినపుడు పరస్పరం చర్చించి పరిష్కరించుకోవల్సి ఉంటుందని చైనా వాదన. భారత్‌తో కలిసి చర్చించి ఉత్తమ మార్గాన్ని కనుగొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా ఇప్పటికే ప్రకటించింది. సీపెక్ అనేది కేవలం ఆర్ధిక సహకారానికి ఉద్ధేశించిన ప్రాజెక్టు మాత్రమేనని, ఇందులో ఏ మూడో దేశాన్ని తాము లక్ష్యంగా చేసుకోలేదని చైనా చెబుతోంది. ఇదే స్ఫూర్తితో భారత్‌తో సైతం చర్చలకు తాము సిద్ధం అవుతున్నామని, భారత్ నుండి కూడా సానుకూల స్పందన రావాలని చైనా అంటోంది. చైనాలోని గ్జిన్‌జియాంగ్ ప్రావిన్స్ నుండి పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉన్న గ్వదర్ పోర్టును కలుపుతూ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సుమారు 50 బిలియన్ డాలర్లతో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) గుండా చేపడుతుండటంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనాలోని భారత రాయబారి గౌతమ్ బాంబవాలే సైతం అక్కడి అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పారు. దాంతో ఆ ఇంటర్వ్యూ చూసిన చైనా స్పందించింది. సీపెక్‌పై ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తడం ఇష్టం లేదని చెప్పింది. ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలు సీపెక్ కారణంగా ప్రభావితం అవ్వకుండా ముందే చర్చలు జరపడం మేలని చైనా తెలిపింది.
చైనా స్నేహస్వరంలో చిత్తశుద్ధి ఉందా... చైనాను విశ్వసించగలమా? గత అనుభవాల దృష్ట్యా చైనాను ఎంత వరకూ నమ్మవచ్చు..?? చైనాకు భారత్‌కు మధ్య ఉన్న 3488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖను మాత్రం గుర్తించేందుకు చైనా నిరాకరిస్తోంది. అది తప్ప మిగిలిన విషయాలు మాట్లాడదామనే రీతిలో వ్యవహరిస్తున్న చైనాకు అంతర్జాతీయ వేదికలపై భారత్ మొదటి నుండి బాసటగానే నిలిచింది. ఐక్యరాజ్యసమతిలో చాంగ్ కై షేక్ ఆధ్వర్యంలోని ఫార్మోజా (నేషనలిస్టు చైనా)కు కాకుండా కమ్యూనిస్టు చైనాకు సభ్యత్వం ఇవ్వాలని భారత్ మొదటి నుండి వాదించింది. 1962లో చేదు అనుభవాల తర్వాత కూడా ఈ విషయంలో చైనాకు భారత్ మద్దతగా నిలిచింది. భద్రతా మండలిలో చైనా స్థానంలో సభ్యత్వాన్ని స్వీకరించాలని పాశ్చాత్య అగ్రరాజ్యాలు ప్రతిపాదించినా, భారత్ సున్నితంగా తిరస్కరించింది. సమయం వచ్చినపుడల్లా భారత్, చైనాతో సమాన స్థాయి దేశం కాదన్నదే జిన్‌పింగ్ సందేశం. చైనా అధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నపుడే లడఖ్‌లో చైనా సేనల చొరబాట్లను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇపుడే కాదు, చాలా కాలంగా చైనా భారత్‌ను తన ప్రత్యర్థిగానే పరిగణిస్తోంది. భారత్ ప్రజాస్వామ్యంతో పూర్తిగా విజయవంతం కావడంపై చైనా అసూయ చెప్పకనే తెలుస్తుంది. ఆసియాలో అద్వీతీయ అగ్రగామి ఆర్ధిక శక్తిగా భారత్ ఆవిర్భవించడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య వివాదాలు మాత్రం తప్పడం లేదు. చైనాతో సరిహద్దు వివాదాలే కాదు, జల వివాదాలు కూడా రోజురోజుకూ పెరుగుతునే ఉన్నాయి. డోక్లామ్ వివాదానికి ఆజ్యం పోసినట్టు చైనా సీపెక్ ప్రాజెక్టును చేపట్టింది. సిక్కిం, భూటాన్, చైనా సరిహద్దుల్లో చైనా ఒక రోడ్డు మార్గాన్ని చేపట్టింది. ఆ రోడ్డు నిర్మాణం పూర్తయితే మన దేశానికి సైనిక పరంగా అత్యంత కీలకమైన ప్రదేశం కావడంతో మున్ముందు సిలిగురి కారిడార్‌పై చైనా కూడా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. దీనిని గుర్తించిన సైన్యం భూటాన్ సాయంతో ఆ రోడ్డు నిర్మాణాన్ని ఆపగలిగారు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్,మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయలతో కూడిన ప్రాంతమే సిలిగురి కారిడార్. ఈ కారిడార్‌ను వశం చేసుకుంటే భారత్‌పై పట్టుసాధించవచ్చనేది చైనా వ్యూహం. ఏదో విధంగా ఇండియా- భూటాన్ రక్షణ ఒప్పందాల నుండి భూటాన్‌ని బయటపడేలా చేసి ఆ తర్వాత భూటాన్‌కు అత్యంత కీలకమైన డోక్లామ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని అదే సమయంలో భారత్‌లోని ఈశాన్య ప్రాంతాలకు లింక్‌గా ఉన్న సిలిగురి కారిడార్‌పై ఆధిపత్యం చెలాయించాలని చైనా పావులు కదిపింది. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో కొంత భూమిని ఆక్రమించుకున్న చైనా అక్కడ మన దేశానికి అత్యంత కీలకమైన ప్రాంతం తవాంగ్‌ను కూడా ఆక్రమించుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలోచైనా గతంలో భారత్‌కు ఆఫర్ కూడా ఇచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ను వదిలేస్తే చైనా కాశ్మీర్‌లో ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ వదిలేస్తాం అని చైనా ఆఫర్ చేసినా భారత్ తిరస్కరించింది. బెదిరింపులు, ఆక్రమణలతో ఇప్పటికే టిబెట్‌ను వశపరచుకున్న చైనా భూటాన్‌ను సైతం ఆక్రమించుకుని ఇండియాపై పట్టు సాధించాలనే ఎత్తుగడ అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాతోనూ, ఇటు రష్యాతోనూ భారత్ మిత్రత్వం పెంపొందించుకోవడం చైనాకు మింగుడుపడటం లేదు. అందుకే భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని చైనా అడుగులు వేస్తోంది.

-బి.వి. ప్రసాద్