తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

నోటుకి అంటని రక్తం మరకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతిపై రాజకీయ పార్టీలు ఉద్యమం చేపట్టడం విచిత్రం. అవినీతికి ఆస్కారమైన నల్లధనం పే రుతో ఇప్పుడో విప్లవం జరుగుతోం ది. ఏభై మూడు రోజులైనా ఆ ఉద్యమం తీరుతెన్నులు, స్వభావం ఎవరికీ తెలియరానంత గుంభనంగా జరుగుతున్నది. ఇప్పటివరకు ‘నల్ల తిమింగలాల’ను పట్టుకోలేదు. ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థాగతంగా నల్లకుబేరులెవరికీ బేడీలు పడలేదు. అకస్మాత్తుగానో, ప్రమాదవశాత్తుగానో మాత్రమే కొద్దిమంది దొరికినట్లు తెలుస్తోంది. వీరిలో రాజకీయ, ఆర్థిక ప్రతికక్షులే ఎక్కువ అనే భావన కూడా ఉంది. ఈ తంతు రోజుకోమాట, రోజుకో ఆటగా సాగుతోంది. అంతిమంగా నోటు పిడిబాకై గుచ్చుకుంది సామాన్యుడినే. కోట్లలో పాత నోట్లున్న వారెవరికీ నష్టం కలిగిన దాఖలాలు లేవు. వారు సురక్షిత క్షేత్రంలోనే ఉన్నారు. నోట్ల రద్దు ప్రభావం ఎవరిపై పడిందంటే, రోజువారి కూలినాలి చేసి సంసారం గడిపే కోట్లాది మందిపైనే. దాని అసరు వారిపై ప్రతిక్షణం చూపుతోంది. ఉన్న ఫళాన ఆన్‌లైన్‌లోకి బుడ్డగోచీగాళ్ళు ఎలా రాగలరు? వాళ్ళు బతికి బట్టకట్టిన తరువాతే కదా ఏ విధానమైనా? వీళ్ళకి కష్టాలు, ధనికులకి కొత్త నోట్ల కట్టాలా? పట్టుబడిన వాళ్ళలో ఎంత మందికి శిక్షలు పడ్డాయో రోజువారి ప్రోగ్రెస్ రిపోర్టు ప్రకటిస్తే బాగుండేది. అలాంటి ఊసు ఏమీ లేదు.
నిజానికి నోట్ల రంగులు మారిస్తే ఏమవుతుంది? రద్దుకి ఎప్పుడూ ఒక హద్దు ఉంటుంది. కొత్త నోట్లకి సైతం అపుడే నకిలీ నోట్లు తయారవుతున్నాయి. కొత్త నోట్లలోకి మారిన నల్ల నోట్లు విదేశాలకు వెళ్ళి మళ్ళీ వ్యాపారాల పేర దేశంలోకి తరలివస్తున్నాయని విదేశీ ఆర్థిక నిపుణుల ఉవాచ. నోట్ల రద్దువల్ల నల్లధనం, రూపాయి నోట్ల రూపంలో స్విస్ బ్యాంకుల్లో ఉన్న సంపద దేశానికి వచ్చినట్లేనా? ఎవరెవరి దగ్గర ఎంతుందనే లెక్క తెలిసినప్పటికీ వారి బండారాన్ని ప్రజాకోర్టులో ఎందుకు బట్టబయలు చేయలేదు? ఆ లిస్టు తెప్పించడంతోనే ఆ సమస్య తిరిగి గడ్డకట్టింది.
2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో, ఇవ్వాళ ప్రభుత్వం నడుపుతున్న పార్టీకి చెందిన రాందేవ్ బాబా- విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పించాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాజీలేని పోరాటం చేశారు. సంతోషం. మరి ఇప్పుడు ఆయనకు అది ఏమాత్రం సమస్యగా ఎందుకు కనుపించడం లేదు. నల్ల కుబేరులతో సయోధ్య కుదిరిందా? లేదా ఆ సమస్య ఆయన దృష్టిలోంచి, మనసులోంచి ఆవిరైపోయిందా? ఏది ఏమైనా ఆనాడు అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశంలో ప్రజాస్వామిక శక్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చిందనడంలో సందేహం లేదు. ఐతే ఆ ఉద్యమం ఎందుకు నీరుగారిందనేది చర్చనీయాంశం. రాజకీయ పార్టీల అండతో (నల్లడబ్బు సహకారంతో) జరిగే ఉద్యమాలకి నిధుల సమస్య ఉండదు. లక్ష్యంతో జరిగే ఉద్యమాలకి కొన్ని ‘సెట్‌బ్యాక్’లుంటాయి. ఆ నాయకులపై వివిధ రాజకీయ పార్టీల ప్రభావం పడుతుంది. ఉద్యమానికి ముందస్తు ప్రణాళిక ఏదీ లేనందున పథకం ప్రకారం నడపలేకపోవడం కూడా జరుగుతుంది. ఐనప్పటికీ ప్రజా జీవితంలో ప్రభు త్వం, పోలీసు, న్యాయవ్యవస్థ, కార్పొరేట్ రంగాలలో పాతుకుపోయిన అవినీతిపై ప్రజలను చైతన్యపరిచింది. రాజకీయ శక్తుల ప్రాబల్యాన్ని, ఎన్నికల ఖర్చుని, విధానాల దగాని, నల్లధనం సమస్యని చర్చలోకి తెచ్చింది. అవినీతి, లంచగొండితనం పట్ల ఏవగింపుని కలిగించింది. ఐతే, విజయాల కన్నా సంచలనాలను ఎక్కువ సృష్టించారు. దేశవ్యాప్త ప్రతిఘటనకి శ్రీకారం చుట్టారు. ప్రదర్శనలు, మార్చింగులు, ధర్నాలు జరిగాయి. సోషల్ మీడియా హల్‌చల్ సృష్టించింది. ఐతే, నోట్ల రద్దుపై ప్రజల స్పందన అలా లేదు. సానుకూల, ప్రతికూల స్పందనలు సైతం లేకపోవడం గమనించాలి. ‘రద్దు’ మంచిదే అని ప్రజలు గొంతెత్తి చెప్పడం లేదు. కష్టాలు పడుతున్నాం అనైనా బాధతో అరిచి చెప్పడం లేదు. ఈ సమస్యని ఎలా చూడాలో మేధావులకి సైతం పాలుపోవడం లేదు. ఇదేదో అవినీతిని అంతమొందించే విషయంగా కొందరు భావించడం వల్ల నిరాసక్తత ఆవరించింది. పరిస్థితి రేపు బాగుపడుతుందని భావించే ప్రజలకు ఎవరేమి చెప్పినా వినరావడం లేదు. నిజంగా ఈ రద్దువల్ల ప్రజలకు మంచి జరుగుతుందని భావించడం కష్టం. ఎందుకంటే ప్రభుత్వం ఇతర విషయాలలో ప్రజాపక్షం వహిస్తుందన్న గ్యారంటీ లేదు.
తెలంగాణ ప్రభుత్వం గతంలో కేంద్రం తెచ్చిన ‘్భనిర్వాసిత 2013 చట్టా’న్ని తుంగలో తొక్కి తమకు అనువైన, ప్రజావ్యతిరేకమైన కొత్త చట్టాన్ని చేసింది. ఇందుకు కేంద్రం అనుమతి ఉందని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సిఎం చెప్పడం దేనికి సంకేతం? ప్రజలపై వత్తిడి తెచ్చి నయానోభయానో భూముల్ని అమ్ముతామని వారితో చెప్పించి కొనడానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం పేద ప్రజలకు, రైతాంగానికి సముఖంగా ఉన్నట్లు కాదు. అది రైతు వ్యతిరేకమే కాదు, ప్రజల జీవించే హక్కుని కాలరాయడమే. కోర్టులు తప్పుపట్టినా, ప్రజలు తమ నిరసనలను వినిపించినా కేంద్రం బలంతో రాష్ట్రం బిల్లు పెట్టడం ఆలోచించాలి. ప్రధానమంత్రిని ఓ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కలిసి, అభివృద్ధి పేరు చెప్పి, పొగిడి అంగీకరింపచేసుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. రేపటి రాజకీయ సమీకరణలకు తలొగ్గి ఇలాంటి చర్యలకు వత్తాసు ప్రకటించడం వెనుక దాగిన స్వభావాన్ని అర్థం చేసుకుంటే నోట్ల రద్దువల్ల మామూలు ప్రజల చెమటకి రేపు ఏ గతి పట్టబోతుందో విజ్ఞులకి అర్థం కాకపోదు.
అవినీతి, దోపిడీ, పై వర్గాల వ్యాపారస్తుల కోసం, కాంట్రాక్టర్ల బాగుకోసం తహతహలాట చూస్తుంటే విస్తుపోక తప్పదు. సివిల్ పనులకి అల్ప, స్వల్ప జాప్యం కారణం చూపి కోట్లాది రూపాయలు వ్యయం పెంచేసే ధోరణి పెరిగింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో మినహాయింపు లేదు. దొందూ దొందే. ఐతే ఒకే తాను గుడ్డలైన ఇద్దరు ‘చంద్రుల’ గురించి ప్రజలకు ఒక అంచనా ఉంది. మిస్టర్ క్లీన్ అని తనకుతాను చెప్పుకునే అధినేత ఎవరి చెప్పుచేతల్లో మిగిలిపోతాడో అర్థం చేసుకోక ఆశలు పెంచుకుంటున్నారు జనం.
1947 నుండి సామ్యవాద ప్రేరేపిత ఆర్ధిక విధానం పేరుతో 1990 వరకు కాంగ్రెస్ ప్రజలకు ఏమి చేసిందో, ఏమి ఇచ్చిందో గ్రామీణ భారతాన్ని చూస్తే అర్థం అవుతుంది. సరళీకరణ ఆర్థిక విధానాన్ని అమలుపరిచే తొందరలో ప్రభుత్వరంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి ఆ ఆస్తులను ప్రైవేటు రంగం చేతుల్లోకి పెట్టేశారు. ఇప్పుడూ అదే ధోరణి. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం జన్ లోక్‌పాల్ నినాదంతో వెల్లువెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆదర్శ హౌసింగ్ సొసైటీ స్కాం, రాడియా టేపుల కేసుల వంటి అనేక స్కాంలు దేశాన్ని కుదిపివేశాయి. 2జి స్కాం, బొగ్గు గనుల కుంభకోణం, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పి.జె.్థమస్ గొటాలా కేసులు ఎన్నో కారణాలయ్యాయి. జాతీయ రహదారుల సంస్థలో కుంభకోణాన్ని అందులో పనిచేసే ముప్పై ఏళ్ళ సత్యేంద్ర దూబే బయటపెట్టగా కాంట్రాక్టర్లు అతడిని హత్యచేశారు. 2012లో మైనింగ్ మా ఫియా దురాగతాలని అడ్డుకున్నందుకు యువ ఐపిఎస్ ఆఫీసర్ నరేంద్రకుమార్‌ని మధ్యప్రదేశ్‌లో అంతమొందించారు. ఈ సంఘటనలన్నీ ఏం తెలుపుతున్నాయి? స్వార్థ, నీచ రాజకీయ నాయకులు అధికారంలో అడుగుపెట్టడం వల్ల దేశం కొల్లగొట్టబడుతున్నది. ఇప్పుడు అలాంటి నేతలు లేరని ఎవరైనా అనగలరా? రోజుకొక్క కేసు బయటపడుతూనే ఉంది. కాకపోతే అది పాలకపక్ష అధినేతల నీడల మాటున జరగడం, పాలసీల పేరుతో, చట్టం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పేరుతో జరగడం సరికొత్త విషయం.
నోట్ల రద్దు వల్ల సంభవించిన మరణాల పట్ల ఏమాత్రం స్పందన లేని మనుషులు ‘పెద్దలు’గా మసలే అర్హతను కోల్పోతారు. అవినీతిని ఆపకుండా, పారదర్శకత లేకుండా మేం చెప్పిందే వేదం అన్న ధోరణి ఎవరికీ మంచిది కాదు. రాందేవ్ బాబాలు, అన్నా హజారేల వంటివారు పాటిస్తున్న నిశ్శబ్దం భళ్లుమనక తప్పదు. ఇప్పుడు యువతరం ఆలోచిస్తున్నది, తమ పరిధిలో సంఘర్షిస్తున్నది. తాము ఏమిచేయాలో ఆచరణలో చేసి చూపిస్తున్నది. లాభసాటి వ్యాపారాల కోసం కాకుండా, దీక్షాదక్షతలను ఉద్యమం మధ్యలో తుంచేయని తరం ఇప్పుడున్నది. అదొక్కటే భవిష్యత్తుకు ఆశాజనకమైన నమ్మకం. నోటుకి అంటుకున్న రక్తం మరకల్ని చూడగలిగేవాళ్ళు తప్పక వస్తారు. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242