కర్నూల్

అదనపు నిధుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 2 : గ్రామీ ణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 50 కోట్ల నిధులను ఖర్చు చేసి, అవసరమైన అదనపు నిధుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లిఫ్టు ఇరిగేషన్, తాగునీటి పథకాలు, ఉపాధి హామీ పనులు, చేతి పంపులు, సిసి రోడ్లు తదితర అంశాలపై ఆయన శనివారం హైదరాబాద్ నుంచి జిల్లాల వారీగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టక్కర్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికి సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపాలని తెలిపారు. మారుమూల గ్రామాల్లో సోలార్ విధానం, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ లబ్ధిదారుల సమాచారాన్ని గ్రామసభల ద్వారా గుర్తించి ఎంపిక చేయాలన్నారు. జిల్లాలోని 104 గ్రామాల్లో 28వేల మరుగుదొడ్లను నిర్మించి ఓడిఎఫ్ గ్రామాలను 3 నెలల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ సిఎస్‌కి నివేదించారు. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద రూ. 1.71కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్ కింద రూ. 56లక్షలు, రెయిన్‌గన్స్ కింద రూ. 20 కోట్లు, తాగునీటి పథకాలకు రూ. 16.41 కోట్లు ఖర్చు చేశామని కలెక్టర్ వివరించారు. మారుమూల గ్రామాల్లో డ్రైనేజీ, సిసి రోడ్లు, సోలార్ విధానం, డ్రిప్ ఇరిగేషన్ పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, ఉపాధి పనుల స్పెషల్ డిఎస్ దినేష్‌కుమార్, సిపిఓ ఆనంద్‌నాయక్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ హరిబాబు, హౌసింగ్ పిడి రాజశేఖర్ పాల్గొన్నారు.
సీడ్ దుకాణాల తనిఖీ
* మిరప విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం
నందికొట్కూరు, జూలై 2:పట్టణంలోని సీడ్ దుకాణాల్లో శనివారం వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జునరావు తనిఖీలు చేశారు. అందులో భా గంగా ఒక దుకాణంలో అక్రమంగా నిల్వ వుంచిన రూ. 2,72,000 విలువ చేసే 935 మిరప విత్తన ప్యాకెట్లను, మరో దుకాణంలో కూడా 811 మిరప ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీడ్ విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు రైతులు సమాచారం ఇవ్వడంతో ఆయా దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు డిడి మల్లికార్జునరావు తెలిపారు. డిడితో పాటు స్థానిక వ్యవసాయాధికారి శశిధర్‌రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్ ప్రారంభంలో మార్కెట్‌లో నాసిరకం విత్తనాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నా స్థానిక వ్యవసాయాధికారులు పట్టించుకోలేదని, ఆ శాఖ డిడి తనిఖీలతో వారిలో చలనం వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు.
మఠం హుండీ ఆదాయం
రూ. 97.79 లక్షలు
మంత్రాలయం, జూలై 2: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీకి సంబంధించి జూన్ నెలసరి ఆదాయం రూ. 97,79,754 సమకూరినట్లు శనివారం మఠం మేనేర్ శ్రీనివాసరావుతెలిపారు. 39 గ్రాముల బంగారం, 950 గ్రాముల వెండి, 3,393 విదేశీ డాలర్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.
మహానంది ఆలయ హుండీ లెక్కింపు
మహానంది, జూలై 2: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆయలంలో హుండీలకు భక్తుల సమర్పించిన కానుకుల ద్వారా రూ. 24,65,092 ఆదాయం లభించినట్లు ఇఓ డా.శంకర్ వరప్రసాద్ తెలిపారు. శనివారం ఆలయంలోని అభిషేక మండపంలో ఇఓ, చైర్మన్ పాణ్యం ప్రసాదరావుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని హుండీల ద్వారా రూ. 24,27,533 రాగా అన్నదానం హుండీ ద్వారా రూ. 37,559 లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్ర్తి, ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి, గురురాజ బ్యాంకు కోచింగ్, రామకృష్ణ గురుకుల విద్యాలయం విద్యార్థులు, ధ్యానమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.