కర్నూల్

28న దద్దనాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఫిబ్రవరి 26:మండల పరిధిలోని దద్దనాల ప్రాజెక్టు నుంచి ఈ నెల 28వ తేదీ నీటిని విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. పట్టణ శివారులోని ఆర్‌ఆర్ ఫంక్షన్ హాలులో టీడీపీ శ్రేణులు, రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీసీ మాట్లాడుతూ దద్దనాల ప్రాజెక్టుకు గత పదేళ్లకు పైబడి సమృద్ధిగా నీరు చేరకపోవడంతో ఆయకట్టు రైతులకు నీరందడం ఆగిపోయిందని, అలాగే చుట్టుపక్కల చాలా పల్లెల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయని తెలిపారు. తాము ఈ పరిస్థితిని గమనించి ఎస్‌ఆర్‌బీసీ నుంచి దద్దనాలకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ మేరకు దానిని అమలు చేసేందుకు పలుమార్లు సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాలను కలిసి సమస్యను వివరించడంతో వారు అందుకు ఆమోదించి రూ. 22 కోట్లు విడుదల చేశారన్నారు. దీంతో ఆ పనులు వేగవంతంగా పూర్తిచేసి ఎస్‌ఆర్‌బీసీ కాలువ నుంచి పెద్ద మోటార్లు ఏర్పాటు చేయించి నీటిని పంపింగ్ చేయించామని తెలిపారు. దద్దనాలకు ఓ మోస్తరు నీరు చేరిందని గేట్లు కూడా మరమ్మతులు చేయించామని ఈ నెల 28వ తేదీ దద్దనాల నుంచి నీటి విడుదలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు హాజరవనున్నారని తెలిపారు. 28వ తేదీ తొలుత స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుని అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించి, రిమోట్ ద్వారా దద్దనాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారని తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామ. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బీసీ పిలుపునిచ్చారు.