కర్నూల్

ముద్రణాలయం భవన నిర్మాణం చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూలై 2:ప్రభుత్వ ముద్రణాలయానికి కొత్త భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మనోహర్ మాణిక్యం డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శనివారం కర్నూలు ముద్రణాలయ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించా రు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాత బస్టాండ్ సమీపం లో ఉన్న ముద్రణాలయంలో అన్ని జిల్లాలకు చెందిన ప్రభుత్వ శాఖల ముఖ్య పత్రాలను ముద్రించటమే కా కుండా అసెంబ్లీకి సంబంధించిన పత్రాలను కూడా ఇక్కడే ముద్రిస్తారన్నారు. అయితే ఇక్కడ స్థలం సరిపోకపోవడంతో సీతారామ నగర్‌లోని (రైల్వే స్టేషన్ వెనక) భాగాన 4 ఎకరాల స్థలా న్ని కేటాయించిందన్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముద్రణాలయానికి కొత్త భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. భవన నిర్మాణానికి అవసమయ్యే బడ్జెట్‌ను కూడా మంజూరు చేయించారని, అయితే అనివార్య కారణాల భవన నిర్మాణం ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకుని ముద్రణాలయానికి కొత్త భవనం ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. అలాగే ముద్రణాలయంలో ఖాళీగా ఉన్న మజ్దూర్లు, ఎఎంఎంలు, జూనియర్ మేనేజర్స్ పోస్టులతో పాటు బైండర్స్‌కు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షుడు ప్రభాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, రామకృష్ణారెడ్డి, ముద్రణాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భీసన్న, నాయకులు శశిభూషణ్, కృష్ణ, మద్దయ్య, సుబ్రహ్మణ్యం, బాలస్వామి, నాగరాజ్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి
* జిల్లా జడ్జి శేషుబాబు
డోన్, జూలై 2:డోన్ పట్టణంలో సబ్‌కోర్టు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా జడ్జి వి.శేషుబాబు తెలిపారు. ఆయన శనివారం పట్టణంలోని మున్సిఫ్ కోర్టును సందర్శించి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పెండింగులో వున్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిఇ ఆంజనేయగౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు డోన్‌లో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా జడ్జికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన జడ్జి మాట్లాడుతూ డోన్‌లో సబ్‌కోర్టు ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం నందికొట్కూరులో సబ్‌కోర్టు వుందని, అయితే అక్కడ కేసులేమీ లేవని తెలిపారు. అక్కడ వున్న సబ్‌కోర్టును డోన్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే డోన్ కోర్టులో ఫర్నిచర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. జిల్లా జడ్జి వెంట సిపిల్ జడ్జి సూరిబాబు, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి విశ్వనాథరెడ్డి, సహాయ కార్యదర్శి రాముడు, కోశాధికారి తలారి వెంకటేష్, సీనియర్ న్యాయవాదులు ఆలా శ్రీ్ధర్, ఓబుళాపురం శ్రీనివాసులు, ఎస్టీ హారున్, నారాయణ, కె.శ్రీనివాసులు, హరి మురళీధరరావు, తదితరులు పాల్గొన్నారు.