కర్నూల్

సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, సెప్టెంబర్ 19: గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువకు అవుకు రిజర్వాయర్ హెడ్‌రెగ్యులేటర్ నుండి ఈ నెల 22వ తేదీన 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రానున్న నేపధ్యంలో ఏర్పాట్లును పరిశీలించేందుకు కలెక్టర్ సత్యనారాయణ, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, జలవనరులశాఖ చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి, సూపరిటెండెంట్ ఇంజనీరు శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారితో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు అవుకుకు వచ్చారు. హెడ్‌రెగ్యులేటర్, శిలాఫలకం, బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు. మండలంలోని చెర్లోపల్లె వద్ద హెడ్‌రెగ్యులేటర్, రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న సభా ప్రాంగణం, గ్రామ సమీపంలోని హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం కొలిమిగుండ్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సభా స్థలి ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం రాక తేదీ మార్పు: సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 21వ తేదీ అవుకుకు రావాల్సి ఉండగా ఈ నెల 22వ తేదీకి మార్పు జరిగిందని జలవనరులశాఖ చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి బుధువారం తెలిపారు. మొహర్రం పర్వదినం, కర్నూలులో గణేష్ నిమజ్జనం ఉండడంతో సీఎం రాక తేదీ మార్పు జరిగినట్లు ఆయన తెలిపారు.
మధ్యహ్న భోజనం తనిఖీ : మండలంలోని రామాపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిలు తనిఖీ చేసి పరిశీలించారు. రోజువారిగా భోజన సరళిపై విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. మంచి విద్యను అందుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సూక్ష్మంగా విద్యను గ్రహించే విధంగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

టీడీపీలో కార్యకర్తలకే అగ్రతాంబూలం
* ఎంపీ ఎస్పీవైరెడ్డి
నంద్యాల, సెప్టెంబర్ 19: జెండాలు మోసే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని, వారి యోగ క్షేమాలతో పాటు పనిచేసిన వారికి పదవులు కూడా అందజేస్తున్నట్లు నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం సమీపంలో గల తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన బూత్‌కన్వీనర్ల శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డా. ఎస్ ఇంతియాజ్ అహ్మద్, టీడీపీ కార్యదర్శి సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి, గడివేముల మండల టీడీపీ ఇన్‌చార్జి మధుసూధన్‌గుప్తా, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు అభిరుచి మధు, పాణ్యం మండలం టీడీపీ ఇన్‌చార్జి జయరామిరెడ్డి, లాయర్ బాబుతోపాటు పాణ్యం, గడివేముల మండలాలకు సంబందించిన బూత్ కన్వీనర్లు హాజరయ్యారు. బూత్ కన్వీనర్లను ఉద్దేశించి ఎంపీ ఎస్పీవైరెడ్డి, పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి, నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డా. ఎస్ ఇంతియాజ్ అహ్మద్‌లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సేవామిత్ర, బూత్ కన్వీనర్లదే ప్రధాన పాత్ర అని, వారు చిత్తశుద్దితో కృషి చేసినప్పుడే తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని రికార్డు సృష్టించిందని ఎంపీ అన్నారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బ్రాండెడ్ ఓటర్లు ఉంటారని, వారిని ఎవరూ మార్చలేరని, వీరి శాతం 20 నుండి 30 శాతం ఉంటుందన్నారు. ఎన్నికల సమయం సమీపించినప్పుడు 20 నుండి 25 శాతం ఓటర్లు తటస్థంగా ఉంటారని, పాలకులు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతిపక్ష పార్టీ హామీలు బేరీజు వేసుకొని తమ ఓటు ఎవరికి వేయాల్సింది అంతిమ సమయంలో నిర్ణయించుకుంటారని అలాంటి వారినే సాధికార మిత్రలు, బూత్‌కన్వీనర్లు టార్గెట్‌చేసుకొని తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న సంక్షేమపథకాలు, ఇతర పథకాల గురించి వివరించి వారికి టీడీపీ వైపు మొగ్గు చూపేలా కృషి చేయాల్సి ఉందన్నారు. ప్రతి బూత్ పరిధిలో సేవామిత్రలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఒక సేవా మిత్ర 30 కుటుంబాలను తమ పరిధిలో సమీక్షించుకొని అందరి ఓట్లు వేయించేందుకు కృషిచేయాలన్నారు. ఈసమావేశంలో నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డా. ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఒక బూత్ కన్వీనర్ కింద 10 సేవా మిత్ర బృందాలు ఉంటాయని, ఒక బూత్ కన్వీనర్ వెయ్యి ఓటర్లకు బాద్యత వహించాల్సి ఉంటుందని, ఏరియా ఇన్‌చార్జి పది వేల ఓటర్లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ ముగ్గురు కలసి సమీక్షించుకొని తమ కార్యాచరణ ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేసి తెలుగుదేశం పార్టీ గెలుపొందేందుకు కృషి చేయాలన్నారు. అలాగే సేవా మిత్ర, బూత్ కన్వీనర్, ఏరియా ఇన్‌చార్జిలు కలిసి సమీక్షించుకొని తమ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఓటర్ల మనోభావాలను గుర్తించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటరుకు అనుసంధానమై వారి సలహాలు తీసుకొని ముందుకు పోవాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ కన్వీనర్లకు నియోజకవర్గానికి రెండు రోజుల ప్రకారం శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని, శిక్షణ శిబిరానికి ప్రతి కన్వీనర్ హాజరు కావాల్సి ఉంటుందని, తెలుగుదేశం పార్టీకి సేవా మిత్రలు, బూత్‌కన్వీనర్లు, ఏరియా ఇన్‌చార్జిలు చేస్తున్న సేవలను గుర్తించి వారికి రానున్న రోజుల్లో మంచి పదవులతో పాటు వారి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎప్పుడు విస్మరించదని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.