కర్నూల్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 20:ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరకీ అందించడమే వార్డుదర్శిని లక్ష్యమని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. నగరంలోని 18వ వార్డు పరిధిలోని బుధవారపేటలో గురువారం సాయంత్రం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వార్డుదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీ రేణుక నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పక్కాగృహాలు మంజూరు చేస్తుందన్నారు. అర్హులైన వారందరూ ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. చెత్తసేకరణ, తాగునీటి సరఫరా, రేషన్, పింఛన్ల పంపిణీ ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ సేవలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా తనను సంప్రదించాలన్నారు. స్థానిక సాధికార మిత్రలు కూడా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చెత్త తరలింపు, నీటి సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.

ఆదోని డివిజన్‌లో కరవు.. జలచౌర్యం!
* రైతాంగం విలవిల..
ఆదోని, సెప్టెంబర్ 20: ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలలో కరవు విలయ తాండవం చేస్తోంది. మరోవైపు తుంగభద్ర దిగువ కాలువలో రాష్ట్రాన్ని కేటాయించిన నీరు సరఫరా కాక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వరికి నీరు లేక ఆయకట్టు రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వర్షాభావంతో వేసిన వేరుశెనగ ఎండిపోయింది. పత్తిపంట మొక్క దశలోనే పూత పూసి దిగుబడి లేకుండా పోయింది. ఇక మిగిలిన పచ్చజొన్న, సజ్జ, కూరగాయల పంటలు మొత్తం ఎండిపోవడం జరిగింది. వర్షం కోసం ఎదురు చూస్తున్నా చినుకు జాడ కనిపించడం లేదు. ఇప్పటికే ఆదోని డివిజన్‌లో 13 మండలాలను కరవుగా ప్రకటించారు. కాని కరవు సహాయక చర్యలు, నష్ట పరిహారం ఇవ్వలేదు. అప్పుడే చాలా గ్రామాల్లో ప్రజలు వలసబాట పట్టారు. ఈ నెల చివరి వరకు ఇలాగే కొనసాగితే నల్లరేగడి పంటలు కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాకే జీవనాడిగా ఉన్న తుంగభద్ర దిగువ కాలువకు నీటి సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకుంది. తుంగభద్ర దిగువ కాలువకు రోజు వారిగా 600 క్యూసెక్కుల నీరురాష్ట్ర సరిహద్దు 260 హానవాల్‌కు గేజ్‌పాయింట్‌కు అందించాలి. కాని 300 క్యూసెక్కులకు మించి నీరు రాకపోవడం వల్ల కాలువ డీపీలకు నీరు కూడా ఎక్కని పరిస్థితి ఏర్పడింది. 300 క్యూసెక్కుల నీటిని కూడా పైనున్న డీపీలు మూసి వేసి ఉదయం నీటిని పంపడం వల్ల గేజ్ పాయింట్‌కు 300 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆతరువాత 250 క్యూసెక్కుల మించి నీరు రావడం లేదు. పై భాగంలో ఉన్న కర్నాటక రైతులు కేటాయించిన నీటి కన్నా మన నీటిని కూడా అక్రమంగా వినియోగిస్తున్నారు. ప్రతి కాలువకు తుంగభద్ర డ్యాం నుండి 1800 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. కాని రాష్ట్ర సరిహద్దుకు 300 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్నాయి. రాష్ట్రానికి కేటాయించిన నీటినిలో 300 క్యూసెక్కుల నీటిని కర్నాటక రైతులు చౌర్యం చేస్తున్నారు. దీని ఫలితంగా ఆదోని డివిజన్‌లో 50వేల ఎకరాలకునీరు రాక ఆయకట్టు భూముల్లో వేసిన వరి ఎండిపోతుంది. ఈవిధంగా కరవు ఒకవైపు.. మరోవైపు జలచౌర్యం వల్ల తుంగభద్ర దిగువ కాలువ పంటలు ఎండిపోయి రైతులు ఆహో లక్ష్మణా ఆవేదన చెందుతున్నారు. సీఎం చర్యలు తీసుకుని ఆదోని డివిజన్ రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.