కర్నూల్

గొందిపర్ల నుంచి కర్నూలుకు తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 22:గొందిపర్ల గ్రామం నుంచి కర్నూలు నగరానికి తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగభద్ర బ్రిడ్జి సాధన కమిటీ(టీబీఎస్‌సీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తొలుత నగరంలోని గడియారం ఆసుపత్రి నుంచి రాజ్‌విహార్ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకుని అక్కడ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన టీబీఎస్‌సీ కన్వీనర్ ఎం.తేజోవతి మాట్లాడుతూ గొందిపర్ల చుట్టుపక్కల గ్రామాలైన దేవమడ, దొడ్డిపాడు, పూలతోట, సుందరయ్యనగర్, వసంతనగర్, తాండ్రపాడు, బసాపురం, బైరాపురం, కాశాపురం, ఎస్‌ఆర్‌పీఎం క్వార్టర్స్, అలంపూర్, సింగవరం, తదితర 20 గ్రామాల్లో దాదాపు 60వేల జనాభా ఉందన్నారు. ప్రతిరోజూ ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి, కూలీలు పనులు చేసుకోవడానికి, రైతులు పంట దిగుబడులను అమ్ముకోవడానికి ఇలా రోజుకు 10వేల మందికిపై కర్నూలు నగరానికి రావాలంటే దాదాపు 30 కి.మీ మేర చుట్టూ తిరిగి వస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థులందరూ గ్రామంలో ఉన్న పాఠశాలలో 10వ తరగతి వరకే విద్యను అభ్యసించి పై తరగతులు చదవలేక ఆపేస్తున్నారన్నారు. ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అత్యవసర పరిస్థితుల్లో కర్నూలు నగరం వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నారన్నారు. అదే తుంగభద్ర నదిపై వస్తే కిలోమీటర్ దూరం మాత్రమే అవుతుందన్నారు. ప్రతి రోజూ వందలాది మంది చుట్టూ తిరిగి రాలేక తుంగభద్రనదిపై కాలినడకన మృత్యువుతో పోరాడుతూ అనేక ఇబ్బందులతో కర్నూలు నగరానికి వచ్చి వారి పనులు చూసుకుని వెళ్తున్నారన్నారు. ఇలా వస్తూ పలుమార్లు పడవ ప్రమాదాలకు గురై పలువురుప్రాణాలు కోల్పోయారన్నారు. నాగన్న మాట్లాడుతూ 1993లో నదిలో పుట్టిలో ప్రయాణం చేస్తున్న సమయంలో పుట్టి ప్రమాదవశాత్తూ మునిగి ఒకరు, 1994లో లాంచీ మునిగి ఆరుగురు, 1996లో నదిలో 10 మంది చనిపోయారన్నారు. ఇక 2011 ఆగస్టు 10వ తేదీ 60 మంది ప్రయాణికులు ఉద్ధృతంగా నది ప్రవహిస్తున్న సందర్భంగా నది మధ్యలో చిక్కుకుని 2 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్షించే వారి కోసం ఆర్తనాదాలు చేశారని ఆయన గుర్తుచేశారు. 2015లో ఇంటర్ విద్యార్థి మోహన్ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడన్నారు. కర్నూలు మైనార్టీ సంఘం అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, రాజకీయ వేత్తలు స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మించాలని కోరారు. హరీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మించేంత వరకూ అన్ని గ్రామాల ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.

పూర్తి కాలం పదవిలో కొనసాగుతా..
* మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బమ్మ
నందికొట్కూరు, సెప్టెంబర్ 22:పురపాలికలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు స్వార్థపరులు తాను రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పూర్తి కాలం పదవిలో కొనసాగుతానని మున్సిపల్ చైర్‌పర్సన్ ఓస్పరి సుబ్బమ్మ స్పష్టం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి సహకారంతో మున్సిపాలిటీ అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారన్నారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు.

హంద్రీనీవాకు 7 పంపుల ద్వారా నీరు విడుదల
నందికొట్కూరు, సెప్టెంబర్ 22:మల్యాల హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకం నుంచి శనివారం 7 పంపుల ద్వారా నీరు విడుదల చేశారు. హంద్రీనీవాకు కేటాయించిన 8 ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో రెండు రోజుల పాటు నిర్వహణకు సంబంధించి నీటి విడుదలను బంద్ చేశామని, మళ్లీ 7 పంపుల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నామని ప్రాజెక్టు ఏఈఈ హరిప్రసాద్ తెలిపారు. ఒక్కో పంపు ద్వారా 350 క్యూసెక్కుల చొప్పున 7 పంపుల ద్వారా 2,360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జూలై 23వ తేదీ ప్రారంభమైన నీటి విడుదల ద్వారా ఇప్పటి వరకూ 10.81 టీఎంసీల నీటిని తరలించినట్లు అధికారులు తెలిపారు.