కర్నూల్

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 22: మహిళలు ఆర్థికంగా ఎదిగి నెలకు రూ. 10 వేలు సంపాదించగలగాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని స్వగృహంలో శనివారం మెప్మా పీడి నాగరాజునాయుడు ఆధ్వర్యంలో బట్టల తయారీలో శిక్షణ పొందిన 160 మంది మహిళలకు మంత్రి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోదుపు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మానస పుత్రికలు అని అన్నారు. ప్రతి పేద మహిళ స్వయం ఉపాది ద్వారా నెలకు రూ. 10 వేలు సంపాదించగలిగితే ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగమన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు వివిధ ఉపాది రంగాల్లో శిక్షణ ఇప్పిస్తోందన్నారు. బట్టలు కుట్టడమే కాకుండా, ఎంబ్రాయిడరీ, మోహిందీ, తదితర వాటిల్లో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. నంద్యాలకు చెందిన అలీబా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడామని త్వరలో ఆళ్లగడ్డలో కూడా తమ శాఖను ప్రారంభించి వివిద రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తారన్నారు. పొదుపు మహిళలకు పసుపు, కుంకుమ కింద మహిళలకు రూ. 8 వేలు సాయం చేస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం చంద్రన్నభీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పధకాలు ప్రవేశపెట్టి వారికి సాయం అందిస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ఆళ్లగడ్డలో వెయ్యి మందికి కుట్టుమిషన్ శిక్షణ ఇప్పించి మిషన్లు పంపిణీ చేస్తామన్నారు. పొదుపులో వున్న మహిళల పిల్లలకు 8,10, ఇంటర్ చదివే వారికి ఉపకారవేతనాలను అందజేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందాలన్నదే అమ్మ శోభానాగిరెడ్డి ఆశయమన్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల లబ్ధి
* పొదుపు మహిళల రుణం పూర్తిగా మాఫీ
* ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
బేతంచెర్ల, సెప్టెంబర్ 22:రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ నవరత్నాలు పథకం ద్వారా రూ. 5 లక్షల లబ్ధి చేకూరనుందని ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇక రుణమాఫీ విషయంలో చంద్రబాబులా కాకుండా తాము పొదుపు మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ‘కావాలి జగన్-రావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే బుగ్గన పట్టణంలోని పాతబస్టాండ్ సమీప వీధుల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బుగ్గన పార్టీ మండల కన్వీనర్ సీహెచ్ లక్ష్మిరెడ్డి, ఎంపీపీ కిట్టమ్మ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి పోస్ట్ఫాస్, గోడౌన్, తదితర వీధుల్లో ఇంటింటికీ తిరిగి నవరత్నాలు పథకం గురించి వివరించారు. అలాగే పొదుపు మహిళలతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు రుణాలను 4 దఫాలుగా పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. అలాగే ప్రతి రైతుకు వైఎస్‌ఆర్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. లక్ష లబ్ధి చేకూరే లాగా ఉచిత బోర్లు, ఉచిత విద్యుత్, వడ్డీ లేకుండా రుణం, ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రూపంలో అందిస్తామన్నారు. వీటితో పాటు ‘పింఛను మొత్తం పెంపు, పేదలందరికీ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, వైఎస్‌ఆర్ ఆసరా, చేయూత, అమ్మఒడి, మద్యపాన నిషేధం’ అనే నవరత్నాలు ద్వారా ప్రతి కుటుంబానికి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ లబ్ధి చేకూర్చడమే జగనన్న లక్ష్యమని వివరించారు.

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
అవుకు, సెప్టెంబర్ 22:అవుకు జలాశయం నుంచి గండికోటకు నీటిని విడుదల చేసేందకు సీఎం చంద్రబాబు శనివారం మండల పరిధి చెర్లోపల్లెకు రావడంతో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టా రేణుక, జేసీ దివాకర్‌రెడ్డి, కర్నూలు, కడప కలెక్టర్లు సత్యనారాయణ, హరికిరణ్, ఎమ్మెల్యేలు జనార్ధనరెడ్డి, మణిగాంధీ, భూమా బ్రహ్మానందరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. నీటి విడుదల అనంతరం కొలిమిగుండ్ల బహిరంగ సభా స్థలి వరకూ రోడ్డుకు ఇరువైపులా ప్రజలు సీఎం చంద్రబాబు వాహనంపై పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు.