కర్నూల్

ఏసీబీ దాడులతో కలకలం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, నవంబర్ 8: నంద్యాలలో తరచూ ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో కలకలం రేపుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏసీబీ అధికారుల దృష్టి ఎక్కువ భాగం నంద్యాల వైపే ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఎక్కువగా రావడంతో అధికారులు నంద్యాల వైపు తమ దృష్టిని కేంద్రీకరించారు. దీంతో అవినీతి అధికారులు ఎక్కడికక్కడ తమ ఆస్తులను సర్దుబాటు చేసుకుంటున్నారు. గురువారం రుద్రవరం మండలం పెద్దకంబలూరు వీఆర్వోగా పనిచేస్తున్న జేజిబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టారు. ఉద్యోగం రాకముందు ఎన్ని ఆస్తులు...వచ్చిన తరువాత ఎన్ని ఆస్తులు కూడబెట్టారనే విషయాలపై అధికారులు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టడంతో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ నంద్యాలలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న అవినీతికి పాల్పడుతున్న అధికారులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌లతో పాటు ఇతర శాఖల అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలో డీఎస్పీగా పనిచేసి వెళ్లిపోయిన హరినాథరెడ్డి, ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఏడీఎ నాగరాజు, దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వీరయ్య, వీఆర్వో తిరుపాలు, మహానందిలో పనిచేస్తున్న ధనుంజయ, రుద్రవరం మండలంలో పనిచేస్తున్న మరో ట్రాక్స్‌కో అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనిబట్టి చూస్తుంటే నంద్యాలలోని ఆయా శాఖల్లో అవినీతి ఎంత రాజ్యమేలుతుందో తెలుస్తున్నది. ప్రజల సొమ్ము అంతా లంచాలకు పాల్పడుతున్న అధికారుల వద్దనే ఉంటున్నదనేది ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టిన అనంతరం వారు తెలిపిన ఆస్తుల వివరాలు వెల్లడి చేస్తున్నాయి. ఒక్కొక్క అధికారి రూ.10కోట్ల వరకు కూడబెట్టడం చూస్తుంటే ప్రజలు, ఏసీబీ అధికారులు విస్మయం చెందుతున్నారు. ఇప్పటి వరకు నంద్యాల నియోజకవర్గంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో దాదాపు రూ.50కోట్లకు పైగానే అవినీతికి పాల్పడుతున్న అధికారులు తమ ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఏసీబీ అధికారులు తరచూ తనిఖీలు చేపడితే మరికొంత మంది అవినీతికి పాల్పడుతున్న అధికారులకు భయం ఉండడమే కాకుండా ప్రజలకు న్యాయం చేకూరుతుందని పలువురు భావిస్తున్నారు.

పత్తికొండలో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాం
* కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్య
కోడుమూరు, నవంబర్ 8: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండాను ఎగుర వేస్తామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కసాగరం లక్ష్మిరెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని లద్దగిరిలో కోట్ల స్వగృహంలో పత్తికొండ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తుృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, ఎంపిటీసీలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కోట్ల మాట్లాడుతూ పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు విసుగుచెందారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని, కాంగ్రెస్ పార్టీతోనే రైతులు, ప్రజలు కష్టాలు తీరుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందుగా రైతుల రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు. విభజన వల్ల ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగడం వాస్తవమని, ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో రాగానే విభజన హామీలు మర్చిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలల్లో అభివృద్ధి చెందుతుందని వెళ్లడించారు. వచ్చే ఎన్నికలల్లో పత్తికొండ నియోజకవర్గంపై తమ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఇక్కడ ఈ సారి కాంగ్రెస్ పార్టీ హస్తం గతం చేసుకుంటుందని వివరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ రానున్న కేంద్ర, రాష్ట్రాలకు జరిగే ఎన్నికలకలకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు గ్రామాలల్లో విస్తుృతంగా పర్యటిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయసాధించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.