కర్నూల్

మిగిలింది 40 రోజులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 19 : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల కావచ్చని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఇదే జరిగితే పాలనకు, అనుమతుల మంజూరుకు, పూర్తయిన పనుల ప్రారంభానికి కేవలం 40 రోజులే మిగిలి ఉందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ నేతలను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం చంద్రబాబు తరచూ పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రానున్న 20రోజుల్లో బీసీ సదస్సులు పూర్తి చేయాలని, ఆ తర్వాత డిసెంబర్ 2వ వారంలో రాష్ట్ర వ్యాప్త సదస్సును నిర్వహిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదరణ పథకం కింద కుల వృత్తిదారులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అందరికీ పనిముట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్త ఎన్నికలకు సిద్ధమవుతుందని, ఇందులో భాగంగా డిసెంబర్ చివర, జనవరి మొదటి వారంలో షెడ్యూల్ జారీ చేస్తుందన్న సంకేతాలు అందుతున్నట్లు చంద్రబాబు తెలిపారని ఆ పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. దీంతో కొత్తగా ప్రజల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి వీలైనంత త్వరితగతిన మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారని వారు పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన, పూర్తి కావచ్చిన పనుల ప్రారంభానికి కూడా సిద్ధం కావాలన్నట్లు వెల్లడవుతోంది. ధర్మ పోరాట దీక్ష సభలను కూడా డిసెంబర్ 22వ తేదీతో ముగించనున్నామని అంతకంటే రెండు, మూడు రోజుల ముందే దేశంలోని బీజేపీ వ్యతిరేక పక్షాల నాయకులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించి వారందరినీ అమరావతికి ఆహ్వానించనున్నట్లు చంద్రబాబు వెల్లడించినట్లు నాయకులు తెలిపారు. పార్టీ నాయకులకు అధినేత సూచించిన విధంగా ఎన్నికలకు సిద్ధం కావడానికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వేగంగా పూర్తి చేసేందుకు ఉరకలు వేయాల్సిందేనని వారన్నారు.
ఝూన్సీ లక్ష్మీభాయి జీవితమే
మహిళలకు ఆదర్శం
* వీహెచ్‌పీ మాతృశక్తి తెలంగాణ రాష్ట్ర సంయోజిక పావని
కర్నూలు ఓల్డ్‌సిటీ, నవంబర్ 19:రాణి ఝూన్సీ లక్ష్మీభాయి జీవితమే మహిళలకు ఆదర్శమని వీహెచ్‌పీ మాతృశక్తి తెలంగాణ రాష్ట్ర సంయోజిక పావని పేర్కొన్నారు. రాణి ఝూన్సీ లక్ష్మీభాయి జయంతి సందర్భంగా సోమవారం విశ్వహిందూ పరిషత్, దుర్గా వాహిని మాతృశక్తి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మహిళల స్కూటర్ ర్యాలీని స్థానిక జిల్లా పరిషత్ వద్ద దుర్గా వాహిని నాయకురాలు లక్కిరెడ్డి అరుణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పరిషత్ నుంచి వౌర్యఇన్, ఐదు రోడ్ల కూడలి, ఎస్‌బీఐ సర్కిల్, ఘంటసాల రహదారి, కోట్ల సర్కిల్ మీదుగా కొండారెడ్డి బురుజు, పెద్ద మార్కెట్ మీదుగా వాసవీ మహిళా కళాశాల వరకూ కొనసాగింది. అనంతరం కళాశాలలో ప్రిన్సిపాల్ పార్వతీ అధ్యక్షతన ఝూన్సీ లక్ష్మీభాయి జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పావని మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీర వనితల్లో అగ్రగణ్యురాలు రాణి ఝూన్సీ లక్ష్మీభాయి అన్నారు. ఆమె పేరు వింటేనే చచ్చుబడిన మనిషి శరీరంలో కూడా రక్తం ఉత్తేజం పొందుతుందన్నారు. ఆమె మహారాష్టల్రోని సతారాలో సంప్రదాయ కర్హాడి బ్రాహ్మణ వంశంలో 1835 నవంబర్ 19వ తేదీ జన్మించిందన్నారు. భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మొదటి స్ర్తి ఆమె అని తెలిపారు. నేటి సమాజంలో హిందూ స్ర్తిలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షురాలు నీరజ మాట్లాడుతూ ఈ సృష్టిలో స్ర్తి ఒక అపురూపమైన వరమన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా ఉంటూ అన్ని బాధ్యతలు నిర్వహిస్తుందని తెలిపారు. దుర్గావాహిని మాతృశక్తి సంస్థ లాంటి స్ర్తి సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తు, హిందూ స్ర్తిల సమస్యలపై పోరాడుతుందని వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షురాలు పార్వతమ్మ పేర్కొన్నారు