కర్నూల్

పెద్దాసుపత్రి అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 28:ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి ప్రభు త్వం భారీగా నిధులు మంజూరు చే స్తోందని ఇందులో భాగంగానే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చే పనులకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. నగరంలోని ప్రభు త్వ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ, ఆధునిక డ్రైయిన్ నిర్మాణ పనులకు శనివారం కలెక్టర్ భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి వెనుక భాగంలో ముళ్లకంపలు తొలగింపు, డ్రైనేజీ నిర్మాణ పనులు, పారిశుద్ధ్య, ఎలక్ట్రికల్ వైరింగ్, మరమ్మతులు తదితర పనుల కోసం ప్రభుత్వం రూ. 3.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాబోయే 6 నెలల కాలంలో ఆసుపత్రిని పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య కళాశాలకు రూ. 30 కోట్లు, ప్రభుత్వ వైద్యశాలకు రూ. 10 కోట్లు మంజూ రు చేస్తున్నట్లు ప్రభుత్వం జీఓ జారీ చేసిందని తెలిపారు. మెడికల్ కాలేజీలో యుజికి రూ. 3.5 కోట్లు, హాస్టల్స్‌కు రూ. 3 కోట్లు, పిజి సీనియర్స్ రెసిడెన్సియల్స్‌కు రూ. 7 కోట్లు, సి.బ్లాక్‌లో ఐదంతస్థుల భవనానికి రూ. 2.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాయలసీమలో తలమానికంగా ఆసుపత్రి అభివృద్ధి నిర్మాణం చేపడుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పేరొందిన ఆసుపత్రిగా వౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ఆసుపత్రిలో అభివృద్ధి పనులు త్వరితగతిన చేసేందుకు ప్రాధాన్యతనిచ్చి నాణ్యమైన పనులు చేపట్టాలని సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. వచ్చే 3 నెల కాలంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరచి ప్రహరీ చుట్టూ డ్రిప్ ద్వారా మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుని రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఆసుపత్రిలో టాయిలెట్ల్‌కు మరమ్మతులు చేయిస్తామన్నారు. కుటుంబ నియంత్రణ వార్డు సమీపంలో షెడ్డు నిర్మాణానికి రూ. 9 లక్షలు మంజూరు చేసి టెండర్లు పిలిచామన్నారు. ఆసుపత్రి చుట్టూ వున్న చిల్లర దుకాణదారులు ఉపాధి కోల్పోకుండా స్థల సర్దుబాటు చేస్తామరు. వచ్చే 6 నెలల కాలంలో కర్నూలు నగరాన్ని స్మార్ట్‌సిటీగా రూపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రి ఆవరణలో పందుల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా వీరస్వామి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంప్రసాద్, డా. జోజిరెడ్డి పాల్గొన్నారు.
చైన్‌స్నాచర్లు, దొంగలపై గట్టి నిఘా
* పకడ్బందీ గస్తీ:ఎస్పీ
కర్నూరు, నవంబర్ 28:చైన్ స్నాచ ర్లు, ఇంటి కన్నపు నేరస్థులపై గట్టి నిఘా ఉంచాలని ఎస్పీ ఆకే.రవికృష్ణ ఆదేశించారు. గస్తీ తిరిగే పోలీసులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. నేరాలు, చోరీలను అరికట్టేందుకు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దినె్నదేవరపాడు సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో హోంగార్డుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం హోంగార్డులు నిర్వహించిన కవాతును ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్, హోంగార్డు అనే తేడా లేకుండా యూనిఫారం ధరించిన ప్రతి వ్యక్తి క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రాత్రి, పగలు గస్తీ తిరిగే హోంగార్డులు చైన్ స్నాచర్లపై, ఇంటికి కన్నం వేసే నేరస్థులపై గట్టి నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. సిసిఎస్, క్రైం, స్పెషల్‌పార్టీ కానిస్టేబుళ్లను పూర్తిగా రంగంలోకి దించామన్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారన్నారు. అనంతరం పరేడ్‌లో చక్కటి యూనిఫారంతో ప్రతిభ కనబరచిన హోంగార్డులకు ఎస్పీ నగదు రివార్డులు అందజేసి వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ కృష్ణమోహన్, డిటిసి డీఎస్పీ రాజశేఖర్‌రాజు, ఆర్‌ఐ రంగముని, ఆర్‌ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, 270 మంది హోంగార్డులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు
* వచ్చే ఎన్నికల్లో కోట్లకు డిపాజిట్ దక్కదు..
* టిడిపి కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణు
కర్నూలు సిటీ, నవంబర్ 28:ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మాజీ మంత్రి కోట్ల టిడిపిపై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరావుయాదవ్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కోట్ల కేంద్ర మంత్రిగా పనిచేసినా కోడుమూరుకు చేసిందేమీ లేదని విమర్శించారు. గత కొనే్నళ్లుగా కోడుమూరు పట్టణంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండగా టిడిపి అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించామన్నారు. అలాగే సాగునీరు అందించి రైతులకు బాసటగా నిలవాలన్న ఉద్దేశ్యంతో చింతమానుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో నీళ్లు తరలించామన్నారు. కోట్ల ఊరికి కూడా సక్రమంగా రోడ్డులేకపోగా డిప్యూటీ సిఎ కెఇ కృష్ణమూర్తి వేయించారని, ఆ రోడ్డుపైనే కోట్ల తన సొంత ఊరికి వెళ్తున్నారని గుర్తు చేశారు. కెఇ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పత్తికొండ, డోన్, కృష్ణగిరి, ప్యాపిలికి గాజులదినె్న ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి సాగు, తాగు అందించారని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవటమేకాకుండ కోట్లకు డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా కోట్ల టిడిపిని, సిఎం చంద్రబాబును విమర్శించటం మానుకోవాలని హితవు పలికారు.
జాతీయ రహదారి పక్కన
ఇళ్లు ఖాళీ చేయాలి:ఆర్డీఓ
శిరివెళ్ల, నవంబర్ 28: కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి వెంకటాపురం వద్ద రోడ్ల విస్తరణ పనులు చేస్తున్న దృష్ట్యా త్వరలో ఇళ్లను ఖాళీ చేయాలని ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం రహదారిలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం, యర్రగుంట్ల గ్రామాల్లో 74 ఇంటి పట్టాలు పంపిణీ చేశామన్నారు. పంపిణీ చేసిన ఇంటి స్థలాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహీశీల్దార్ నాగేంద్రరావు, విఆర్‌ఓలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పోలీసుల స్వచ్ఛ భారత్
* ఎస్పీ ఆకే.రవికృష్ణ
కర్నూలు, నవంబర్ 28:బడిబాటలో భాగంగా జిల్లా పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్పీ ఆకే.రవికృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 83 పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, 34 మంది సిఐలు ఒకొక్కరు ఒక గ్రామంలోని పాఠశాలను దత్తత తీసుకుని బడిబాటలో భా గంగా శనివారం ఆయా పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ చేపట్టారు. కర్నూలు జిల్లా విద్యపరంగా పూర్తిగా వెనుకబడిందన్నారు. కావున పోలీసులు ఒకొక్కరు ఒక్కో గ్రామంలోని పాఠశాలను దత్తత తీసుకుని ఆ పాఠశాలలో బాల కార్మిక వ్యవస్థ నియంత్రణ, బడి మానేసిన పిల్లలను బడిలో చేర్పించడం, విద్యార్థుల చదువు, బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం తదితర వసతులు కల్పించడానికి కృషి చేస్తారన్నారు. జిల్లాలోని సబ్ డివిజన్లలో ఆళ్ళగడ్డ 16, డోన్ 24, ఆదోని 29, కర్నూలు 35, నంద్యాల 20, ఆత్మకూ రు 17 మొత్తం 141 సమస్యాత్మక గ్రామాలను పోలీసులు దత్తత తీసుకుని ఆయా గ్రామాల్లో వారికి సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తారన్నారు. పోలీసు అధికారులు, పోలీసులు స్వచ్ఛందంగా పాల్గొని పచ్చదనం పరిశుభ్రత, మొక్కలు నాటడం, పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అలాగే వారంలో ఒక రోజు సమస్యాత్మక గ్రామాల్లోని పాఠశాలల సమస్యలపై దృష్టి కేంద్రీకరించి పోలీసులు పాల్గొంటారని ఎస్పీ తెలిపారు.