కర్నూల్

నంద్యాల టిడిపిలో బహిర్గతమైన విభేదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 29: నంద్యాల తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు కొద్ది రోజుల్లోనే తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి శిల్పామోహనరెడ్డి వర్గాలు ఇంత కాలం మాటల యుద్ధం చేసినా తాజాగా శిల్పా వర్గీయుడైన న్యాయవాది తులసిరెడ్డిపై దాడి చేయడం, దీని వెనుక భూమా నాగిరెడ్డి హస్తం ఉందని శిల్పా వర్గం ఆరోపణలు చేయడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భూమా నాగిరెడ్డి, శిల్పా మోహనరెడ్డి మధ్య 12 ఏళ్లుగా విభేదాలు నెలకొని ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన శిల్పామోహనరెడ్డి ప్రధానంగా హైదరాబాద్, బెంగుళూరు నగరాలను కేంద్రంగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే రాజకీయాలపై మక్కువతో 2002లో టిడిపిలో చేరారు. దాంతో ఆయనకు మహానంది వ్యవసాయ కళాశాల పాలక మండలి సభ్యత్వం కల్పించడంతో నంద్యాలలో కాలు మోపిన శిల్పామోహనరెడ్డి అక్కడే స్థిరపడ్డారు. శాసనసభకు పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో 2004 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన శిల్పాకు భూమా నాగిరెడ్డి ఆటంకంగా మారారు. అప్పటి నుంచి భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. దివంగత వైఎస్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న శిల్పా మోహనరెడ్డి ఆయన వర్గీయుడిగా ముద్ర వేసుకున్నారు. 2009 ఎన్నికల తరువాత భూమా వర్గం క్రమేణా వైఎస్ రాజశేఖరరెడ్డికి దగ్గరయ్యారు. వైఎస్ మరణానంతరం మారిన రాజకీయాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి జగన్ వెంట నడిచారు. దాంతో శిల్పా మోహనరెడ్డి వైకాపాలో చేరడానికి వెనుకంజ వేసి తన సోదరుడు చక్రపాణిరెడ్డిని ఆ పార్టీలో చేరేలా ప్రోత్సహించారు. ఆయనకు జగన్ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అక్కడ కూడా నాగిరెడ్డి వ్యూహ రచనలో చక్రపాణిరెడ్డికి బదులు బుడ్డా రాజశేఖరరెడ్డికి శ్రీశైలం నియోజకవర్గంలో పార్టీలో ప్రధాన బాధ్యతలు అప్పగించారు. దాంతో ఎన్నికలకు ఏడాది ముందు చక్రపాణిరెడ్డి, నెల రోజుల ముందు మోహనరెడ్డి కూడా అదే పార్టీలో చేరి సోదరులిద్దరూ టిడిపి అభ్యర్థులుగా నంద్యాల, శ్రీశైలం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినా ఎన్నికల తరువాత శాసన మండలి స్థానానికి చక్రపాణిరెడ్డిని ఎంపిక చేయడంతో కాస్త కుదుట పడ్డారు. ఆ ఆనందం పూర్తిగా అనుభవించక ముందే భూమా నాగిరెడ్డి మళ్లీ టిడిపిలో చేరడం శిల్పా సోదరులకు మింగుడు పడలేదు. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దన చంద్రబాబు వద్ద ఎంత మొర పెట్టుకున్నా ఫలితం కనిపించలేదు. ఆ తరువాత మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా శిల్పా వర్గీయుడిపై దాడి జరగడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే భూమాపై చంద్రబాబుకు శిల్పా సోదరులు ఫిర్యాదు చేయగా దాడితో తనకెలాంటి సంబంధం లేదని శిల్పా వర్గం ఆగడాలే కారణమై ఉంటాయని భూమా ప్రత్యారోపణ చేయడమే కాక వారి ఆగడాలపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తాగా ప్రస్తుతం ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి ఉండగా చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే నంద్యాల రాజకీయాలు ఆధారపడి ఉన్నాయని చర్చించుకుంటున్నారు.
అరాచక శక్తుల్ని అణచివేస్తాం
* ఎస్పీ రవికృష్ణ
నంద్యాల, మార్చి 29: జిల్లాలో అరాచకశక్తులను అణచివేసి ప్రజల శాంతిభద్రతలను కట్టుదిట్టంగా అమలుచేస్తామని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలో న్యాయవాది తులసిరెడ్డిపై జరిగిన దాడి వివరాలను తెలుసుకొనేందుకు ఆయన వచ్చారు. తులసిరెడ్డి కార్యాలయాన్ని పరిశీలించి ఆయన సహాయకుడు రమణతో వివరాలు సేకరించారు. అనంతరం తులసిరెడ్డిపై జరిగిన దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడు తూ సోమవారం రాత్రి నంద్యాల పట్టణానికి చెందిన న్యాయవాది తులసిరెడ్డిపై జరిగిన దాడి సంఘటనలో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గాలిస్తున్నట్లు తెలిపారు. డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి దర్యాప్తు చేయిస్తున్నామన్నారు. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో ముందస్తు చర్యలుగా పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎస్పీ నంద్యాల డిఎస్పీ హరినాథరెడ్డి, పోలీస్ అధికారులతో కలిసి కొత్తపల్లె గ్రామాన్ని సందర్శించారు.

వెలుగోడు రిజర్వాయర్ నుంచి
నంద్యాలకు నీరు విడుదల
* మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరావు
నంద్యాల, మార్చి 29: పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాల కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి మంగళవారం ఉదయం నీరు విడుదల చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ వెలుగోడు రిజర్వాయర్ నుంచి నిప్పులవాగు ద్వారా బండిఆత్మకూరు మండలంలోని సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద నుంచి కెసి కెనాల్ ద్వారా నం ద్యాల పట్టణంలోని రెండు ఎస్‌ఎస్ ట్యాంక్‌లను నీటిని నింపేందుకు 5 టీములను ఏర్పాటు చేసి కాల్వల వెంట పర్యవేక్షిస్తున్నామన్నారు. 35 కి.మీ దూరం ప్రయాణించి వెలుగో డు నీరు నంద్యాల ఎస్‌ఎస్ ట్యాంక్‌కు చేరుతుందన్నారు. 2 ఎస్‌ఎస్ ట్యాంక్ లు నింపితే 2 నెలల వరకు నీటి సమ స్య ఉండదన్నారు. వెలుగోడు రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటి నుంచి 0.1 టిఎంసి నీరు విడుదల చేస్తే రెండు ఎస్‌ఎస్ ట్యాంక్‌లు నిండుతాయన్నారు. కాల్వల వెంట స్లూయిస్‌లు మూసివేసి అవసరమైన చోట బండ్స్ వేసి నీటిని సాఫీగా నంద్యాలకు చేరేందుకు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే 8 ట్యాంకర్లతో నీటి సరఫరా సరిగా లేని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామన్నారు. మరో రెండు రోజుల్లో అదనంగా 7 ట్యాంకర్లను తెప్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో అవసరమైన చోట బోర్లు వేసి మోటార్లు బిగించి ప్రజలకు నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఎలాగైనా పట్టణ ప్రజలకు రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వైభవంగా ఉత్తరారాధన వేడుకలు
* ఉత్సవాలకు పూర్ణాహుతి
మంత్రాలయం, మార్చి 29: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వపు పీఠాధిపతి శ్రీ సుయతీంద్ర తీర్థుల ఉత్తర ఆరాధన వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం మఠ ం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మూడురోజులు పాటు జరిగిన మహా సమారాధన వేడుకలకు పూర్ణాహుతి పలికారు. ఉత్తరారాధన వే డుకులను పురస్కరించుకుని శ్రీసుయతీంద్ర తీర్తుల బృందావనాన్నికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. వివిధ రకాల పూలతో బృందావనాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు. అంతక ముందు శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూ జలు చేసి మహా మంగళ హారతి ఇచ్చా రు. అనంతరం శ్రీ మూల రాములు దే వతా మూర్తులకు ప్రత్యేక పూజలు చే సి హారతి ఇచ్చారు. యాగశాలలో మైసూరుకు చెందిన ప్రముఖ విధ్వాన్ డాక్టర్ విజరుూంద్రాచార్య, చెన్నైకు చెందిన విద్వాన్ మురళిధరాచార్ ఉపన్యాసాలు, మహబూబ్‌నగర్‌కు చెందిన గద్వాల్ చంద్ర శేఖర్ రావుచే ఏర్పాటు చేసిన సంగీత కచేరి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారికి పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు శేష వస్త్రం ఫల మంత్రాక్షింతలు జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు. ఈకార్యక్రమంలో రా ష్టప్రతి అవార్డు గ్రహీత విద్వాన్ రాజా ఎస్ గిరియాచార్, ఏకె సుయమీంద్రాచార్ ఏఏఓ మాదవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ప్రిన్పిపల్ వాదిరాజాచార్, ద్వారపాలక అనంత స్వామి, ధార్మిక సిబ్బంది ప్రకాష్‌స్వామి, వ్యాసరాజాచార్, తదితర మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తాగునీటి ఇబ్బందులపై స్పందించాలి
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
కోడుమూరు, మార్చి 29:గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే అధికారులు స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. మండల పరిధిలోని కొత్తపల్లి, గోరంట్ల గ్రామాల్లో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. ఇందులో భాగంగా క్రిష్ణగిరిలోని రిజర్వాయర్ నుంచి మూడు పథకాల కింద గ్రామాలకు తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టే పైపులైన్ల పనులు నత్తనడకన సాగుతుండడంపై కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే క్రిష్ణగిరి రిజర్వాయర్ పరిధిలోని మూడవ పథకం కింద కొత్తపలి, మనె్నగుంట, గోరంట్ల గ్రామాలకు అందించే నీటి వసతులకు సంబంధించిన పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గ్రామాల్లో సందర్శించ లేదని తెలియడంతో వారిపై మండిపడ్డారు. కొత్తపల్లి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ట్యాంకుకు రేపటి లోగా నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి పైపులైన్ల పనులు వేగవంతం చేసేందుకు అధికారులు గస్తీ చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ హరిబాబు, ఇఇ రమణ, బషీర్ అహ్మద్, ఎంపిడిఓ ఆదెయ్య, తహశీల్దార్ నిత్యానందరాజు, తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా తాగునీటి సమస్యలపై కలెక్టర్ ఆకస్మికంగా గ్రామాల్లో పర్యటించడంతో విషయం తెలుసుకున్న మండలస్థాయి అధికారులు ఉరుకులు పరుగులు తీశారు.
వైభవంగా శ్రీలక్ష్మీమాధవుడి రథోత్సవం
కోడుమూరు, మార్చి 29:మండల పరిధిలోని గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీమాధవుడి రథోత్సవ వేడుకలు మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగాయి. రథోత్సవ వేడుకలను ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు సి.బాలు ప్రారంభించారు. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో దేవాదాయ శాఖ అధికారులు లక్ష్మినారాయణ, తహశీల్దార్ నిత్యానందరాజు, మండల మాజీ ఉపాధ్యక్షుడు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, టిడిపి నాయకులు సి.దుబ్బన్న, మద్దిలేటి, మాదన్న, మాజీ ఉపసర్పంచ్ తిరుమలనాయుడు, మధు తదితరులు పాల్గొన్నారు.
సూగూరు సర్పంచ్‌పై అనర్హత వేటు..
మంత్రాలయం, మార్చి 29: మండల పరిధిలోని సూగూరు గ్రామ సర్పంచ్ కె.పద్మావతిపై మంగళవారం అనర్హత వేటుపడినట్లు ఎంపిడిఓ మధుసూదన్ రెడ్డి తెలిపారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో సర్పంచ్‌గా గెలుపొందిన కె.పద్మావతికి అధిక సంతానం ఉందని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణలో అధిక సంతానం వున్నట్లు రుజువు కావడంతో ఆమెపై అనర్హత వేటు పడిందని ఆయన తెలిపారు. పంచాయతికి సంబంధించిన చెక్ పవర్‌ను ఉప సర్పంచ్‌కు కల్పించినట్లు ఎంపిడిఓ తెలిపారు.
కొత్తపల్లెను సందర్శించిన ఎస్పీ
నంద్యాల రూరల్, మార్చి 29: కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్, న్యాయవాది, లీగల్‌సెల్ టిడిపి జిల్లా అధ్యక్షుడు తాతిరెడ్డి తులసిరెడ్డిపై సోమవారం రాత్రి వేటకొడవళ్లతో దాడి చేసిన విషయం విధితమే. కాగా దాడి ఘటనను తెలుసుకున్న ఎస్పీ ఆకె రవికృష్ణ మంగళవారం సర్పంచ్ సొంత గ్రామమైన కొత్తపల్లెను సందర్శించారు. గ్రామంలో పురవీధుల గుండా పర్యటించారు. తులసిరెడ్డి గృహాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో గ్రామస్థులతో విచారించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. పచ్చని గ్రామాల్లో చిచ్చుపెడితే సహించే ప్రసక్తే లేదని పోలీసు చర్యలు తప్పదన్నారు. గ్రామాలు ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్లాలరన్నారు. గ్రామాల్లో ఘర్షణలు జరిగితే 100కు ఫిర్యాదు చేయాలని గ్రామస్థులను కోరారు. ఒకరికొకరు గ్రామాల్లో ప్రేమగుణం కలిగి ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ అధికారుల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్పంచ్ తులసిరెడ్డిపై వేటకొడవళ్లతో దాడిచేయడంతో ముందు జాగ్రత్తగా ప్రత్యేక పోలీసులతో కొత్తపల్లె గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. ఎస్‌ఐలతో పాటు ప్రత్యేక పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. ఎస్పీ వెంట నంద్యాల డిఎస్పీ హరినాథరెడ్డి, సిఐ మురళీధర్‌రెడ్డి, సిఐ ప్రతాపరెడ్డి, ఎస్‌ఐలు గోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
ప్రేమపెళ్లి కోసమే బాలుడి కిడ్నాప్
* కిడ్నాపర్ల అరెస్టు : డీఎస్పీ శ్రీనివాసరావు
ఆదోని, మార్చి 29: ప్రేమ పెళ్లికోసం కైరుప్పుల కార్తీక్‌గౌడ్ అనే యువకుడు తానుప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి డబ్బులు అవసరం కా గా ఏకంగా ముగ్గురు మిత్రులతోకలిసి ఆదోని పట్టణంలోని ఓ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి వెంకటసాయిని ఇంటి నుంచి తీసుకెళ్లి కిడ్నా ప్ చేసిన సంఘటన ఆదోనిలో చోటు చేసుకుంది. కిడ్నాపర్ల నుంచి కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో వెంకటసాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎట్టకేలకు కిడ్నాప్ కేసును ఛేదించి వెంకటసాయిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. డిఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం విలేఖర్ల సమావేశంలో కిడ్నాప్ సంఘటన వివరాలను వివరించారు. ఆదోని బ్రాహ్మణ వీధిలో నివాసముంటున్న మిరియాల మంజూనాథ్, వాసవి కొడుకు వెంకటసాయి. వీరి ఇంటికి ఆదివారం కుటుంబ మిత్రుడైన కార్తీక్‌గౌడ్ వచ్చి వెంకటసాయిని ఇంటి నుంచి తీసుకొని వెళ్ళాడు. మళ్లి తిరిగి వెంకటసాయి రాలేదు. కార్తీక్‌గౌడ్‌కు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ నుంచి కూడా సమాధానం రాలేదు. అయితే అదే రోజు రాత్రి వెంకటసాయి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. మీ కుమారున్ని కిడ్నాప్ చేశామని, రూ.కోటి రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దీంతో బాలుని తల్లిదండ్రులు ఆందోళన చెంది వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు రంగంలో దిగి ఇంటి నుంచి తీసుకెళ్లిన కార్తీక్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా కిడ్నాప్ వ్యవహారం బయట పడిందన్నారు. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లిచేసుకోవడానికి డబ్బు అవసరం కావడంతో వెంకటసాయిని కిడ్నాప్ చేసి కార్తీక్‌గౌడ్ మిత్రుడైన ఢాణాపురం శశికుమార్‌కు ఇచ్చాడని, అతను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మిత్రులైన వీరేష్, వినయ్‌లకు ఆదివారమే వెంకటసాయిని అప్పగించారు. వారు అనంతపురం జిల్లాలోని బోరంపల్లిలో దాచి ఉంచినట్లు తెలిపారు. అనంతరం కార్తీక్‌గౌడ్ నుంచి తన మిత్రులకు ఫోన్ చేయించి బాలుని తరపనుంచి డబ్బు అందిందని, బాలున్ని తీసుకురమ్మనడంతో కిడ్నాప్‌కు సహకరించిన ఢాణాపురం శశికుమర్, కళ్యాణదుర్గంకు చెందిన వీరేష్, వినయ్‌లు బాలున్ని తీసుకొస్తుండగా నిందితులను ఆదోని సమీపంలో అరెస్టు చేసి బాలుడు వెంకటసాయిని తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు తెలిపారు. దీంతో కిడ్నాప్ సంఘటన సుఖాంతమైంది. కిడ్నాప్ సంఘటనతో ఆదోని ప్రజలు ఉలిక్కి పడ్డారు.
మరో 20 ఏళ్లు టిడిపిదే పాలన
* కెఇ ప్రతాప్
కర్నూలు సిటీ, మార్చి 29:రాష్ట్రంలో మరో 20 ఏళ్ల పాటు టిడిపి అధికారంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు కెఇ ప్రతాప్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంళవారం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్ అధ్యక్షతన పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎం.మల్లికార్జునరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధనారెడ్డి, టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యులు ఆకెపోగు ప్రభాకర్, జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కమిటీ సభ్యులు సత్రం రామకృష్ణుడు, మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెఇ ప్రతాప్ మాట్లాడుతూ సిఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, నూతన రాజధాని అమరావతిని కూడా ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా తీర్చిదిదద్దుతారని వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులను, కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టిడిపి జెండా ఎగుర వేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1982లో ఎన్‌టిఆర్ పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించారని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రూ. 2కే కిలో బియ్యం, మండలాల వ్యవస్థ ఏర్పాటు చేయటమే కాకుండా కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. సిఎం చంద్రబాబు కూడా ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీ నేత జగన్ రాష్ట్భ్రావృద్ధికి సహకరించాల్సింది పోయి కేవలం బాబును విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రం విడిపోదని, విడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య మాట తప్పారని విమర్శించారు. అనంతరం పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేసిన కార్యకర్తలను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, తిరుపాల్‌బాబు, బాబురాజ్, మల్లెల పుల్లారెడ్డి, అల్లాబకాష్, పర్వేజ్, నాగేంద్ర, బుగ్గన ప్రసన్నలక్ష్మి, సుభాషిణి, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
ఇసుక నిల్వచేసినా.. అమ్మినా కఠిన చర్యలు
* ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి
నంద్యాల, మార్చి 29: నంద్యాల డివిజన్‌లో ఇసుకను నిల్వ చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి హెచ్చరించా రు. మంగళవారం తన కార్యాలయం లో ఇసుక విధానంపై పలు శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రతి భవన నిర్మాణదారులకు ఉపయోగపడాలన్నారు. ఎవరైనా అధిక మోతాదులో ఇసుక నిల్వ చేసినా, అమ్మినా వారిపై ఐపిసి 379 సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రూ. 2 లక్షల వరకు జరిమానా, రెండేళ్లు జైలుశిక్ష విధిస్తారన్నారు. ఉచిత ఇసుక విధా నం విజయవంతం చేసేందుకు అక్రమ ఇసుక రవాణాను కట్టుదిట్టంగా అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సిఇఓ, జిల్లా పంచాయతీ అధికా రి, జిల్లా ఎస్పీ, మైనింగ్ ఎడిలతో టా స్క్ఫోర్స్ పనిచేస్తుందన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డివిజనల్ పంచాయతీ అధికారి, మైనింగ్ అధికారి, పోలీస్ అధికారి, మండల స్థాయిలో తహశీల్దార్, మండల ఎంపిడిఓ, ఎస్‌ఐలు టాస్క్ఫోర్స్‌లో ఉంటారన్నారు. గ్రామస్థాయిలో విఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, పోలీసు కానిస్టేబుల్‌తో టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి శుక్రవారం మండల స్థాయిలో, ప్రతి శనివారం డివిజన్ స్థా యిలో ఇసుక అక్రమ రవాణాపై సమావేశం నిర్వహిస్తామన్నారు. అక్రమ ఇసుక రవాణా వెలుగులోకి వస్తే రుజువులతో సహా కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేసి ఇసుక కోసం వినియోగించిన వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. సీజ్ చేసిన వాహనాలను వేలం వేస్తారన్నారు. వాహన యజమానికి, వాహనం నడిపే డ్రైవర్‌కు రెండేళ్ళ జైలు కూడా విధించే అవకాశం ఉందన్నారు. ఇసుక వినియోగదారులు ఇసుకను తీసుకొనే సమయంలో జెసిబిలు, ప్రొక్లయిన్‌లు వాడరాదని నిషిద్ధ ప్రదేశాల్లో ఇసుక తవ్వరాదని మొదటి రకం ఇసుకను పునాదుల్లో వేసేందుకు వాడరాదన్నారు. ఇసుకను నిర్ణీత ప్రదేశాలలోనే వినియోగదారులు ఉంచుకోవాలని, నిషిద్ధ ప్రదేశంలో సేకరించరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి పార్వతి, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఎంపిడిఓ సువర్ణలత, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ పుల్ల య్య, పోలీస్ శాఖకు చెందిన సిఐలు, ఎస్‌ఐలు, విఆర్వోలు, 25మంది ఇసుక స్టాక్‌పాయింట్ల యజమానులు పాల్గొన్నారు.