కర్నూల్

ఆడిట్ కార్యాలయంలో అవినీతి ‘ఇంద్ర’లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 25: జిల్లా ఆడిట్ కార్యాలయంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఇద్దరు సీనియర్ ఆడిటర్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు. వీరి అక్రమాలకు అడ్డుతగిలితే తోటి ఉద్యోగులపై కూడా దాడులకు దిగే స్థాయికి ఎదిగిపోయారు. ఈ క్రమంలో సహ ఉద్యోగినులను కూడా వదలడం లేదు. ఆన్‌లైన్‌లో ఎంప్లాయిమెంట్ డేటాలో కూడా వీరు పేర్లు మార్చగలిగిన నిపుణులు. భర్త పేరు దగ్గర భార్య పేరు, భార్య పేరు ఉండాల్సిన దగ్గర మరో పేరు.. ఇలా పేర్లను మార్చేస్తారు. ఏడ్చి కాళ్లావేళ్లా పడితే లంచాలు తీసుకుని పేర్లు సాధారణ స్థితికి తెస్తారు. ఇలాంటి పనులు సరికాదని ప్రశ్నించిన తమ పైఅధికారిని సైతం బెదిరిస్తున్నారు. వారు పెట్టే బాధలు తట్టుకోలేక తోటి సీనియర్ ఆడిటర్ ఒకరు తనను మానసికంగా వీరిద్దరు ఏవిధంగా వేధిస్తున్నదీ తెలుపుతూ ఒంగోలు డిప్యూటీ డైరెక్టర్‌కు ఈనెల 11న నివేదించారు. తోటి మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా ఎంప్లాయిమెంట్ డేటాను మార్చేయడంతో పాటు, నలుగురిలో అసభ్యంగా మాట్లాడుతూ, వెకిలిచేష్టలు చేస్తూ అవమానిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలావుండగా గతంలో నెల్లూరులో పనిచేస్తున్న వీరిపై పలు ఆరోపణలు రావడంతో గూడూరుకు బదిలీ చేశారు. అయినా వీరు తిరిగి నెల్లూరుకు డిప్యుటేషన్‌పై రావడానికి తమ పలుకుబడిని ఉపయోగించి సఫలీకృతులయ్యారు. గూడూరులో కనీసం మూడేళ్ల కాలం పూర్తికాకుండానే వీరికి నెల్లూరుకు డిప్యుటేషన్‌పై రావడానికి నిబంధనలు ఎలా సహకరించాయో అర్థం కాదు. 2012లో వీరిద్దరి అవినీతి భరించలేక కార్పొరేషన్‌కు చెందిన చిరుద్యోగులు సుబ్బులు, జయరాం మరో మహిళ తమ పింఛనుకు చెందిన ఫైలు విషయంలో వేలాది రూపాయలు లంచంగా అడుగుతున్నారంటూ నేరుగా పత్రికలకు ఎక్కారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు వీరిద్దరినీ గూడూరుకు బదిలీ చేశారు. కేవలం బదిలీతో పైఅధికారులు చేతులు దులుపుకున్నారే తప్ప వీరిపై ఎటువంటి శాఖాపరమైన చర్యలు చేపట్టలేదు. 2014 బదిలీల్లో మరలా నెల్లూరులోని జిల్లా కార్యాలయానికి వచ్చారు. వీరిపై అభియోగాలు ఉన్న దృష్ట్యా ఒకరిని మండల పరిషత్‌కు, మరొకరిని జడ్పీ ఆడిట్ శాఖలో నియమించారు. వీరు వచ్చినప్పటి నుంచి తమ అవినీతితో పాటు తమ మాట వినని సహోద్యోగులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు.
కుర్చీ కోసం కుస్తీ
ఈ ఇద్దరు ‘ఇంద్ర’లు గతంలో తాము పనిచేసే స్థానాలకు రావాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈక్రమంలో ఆయా స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఇతర ఉద్యోగులపై పైఅధికారులకు ఫిర్యాదులు చేయడం వంటి చర్యల ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎలాగైనా తమకు కామధేనువులాంటి తమ పాత స్థానాల్లోకి తిరిగి చేరుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇందుకు అడ్డువస్తున్నారనే నెపంతో మహిళా ఉద్యోగులను సైతం వేధించే స్థాయికి దిగజారారు. తమకు రాజకీయ పలుకుబడి ఉందనీ, తమను ఎవరు ఏమీ చేయలేరని బాహాటంగా పేర్కొంటుంటారు. ఈ అవినీతి అధికారులపై ఎన్నో ఫిర్యాదులు వెళ్లినా ఎలాంటి చర్యలు ఇంతవరకూ తీసుకున్న దాఖాలాలు లేవు. వీరిలో ఒకరిపై సుమారు 40 నుంచి 50 వరకూ ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. దీనినిబట్టే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మూడేళ్లుగా విచారణ సాగుతూనే ఉండడం గమనార్హం. ప్రతి ఏడాది కార్పొరేషన్‌లో ఆడిట్ జరుగుతుంటుంది. గత ఏడాది ఏడుగురు ఉద్యోగులతో ఆడిట్ కమిటీని వేశారు. అయితే కార్పొరేషన్‌లో మిగతా ఆరుగురిని నోరు మెదపకుండా ఆయన ఒక్కడే ఆడిట్ పూర్తిచేశారు. దీనిపై పలు అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఏమీ లేనట్టు చూపించారు. ఈ నివేదికలో లోపాలు ఉన్నాయంటూ డిప్యూటీ డైరెక్టర్ మార్పు చేయాలని ఆదేశిస్తూ ఆడిట్ ఫైల్‌పై సంతకాలు చేయకుండా నిలుపుదల చేయడం విశేషం. చివరకు చిన్నచిన్న సవరణలతో అదే నివేదికను పంపినట్లు తెలిసింది. ప్రస్తుత ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన ఆడిట్‌లో పెద్దమొత్తంలో చేతులు మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరొక అవినీతి ఆడిటర్‌పై కూడా గతంలో విజిలెన్స్ విచారణ జరిగింది. 2015లో నివేదిక డిడికి పంపించడం జరిగింది. అయినా ఆయనపై ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఆయన ప్రస్తుతం జడ్పీలో ఆడిట్ విభాగంలో కీలకంగా మారిపోయారు. ఈ అధికారులపై ఉన్నతాధికారులు విచారణ తగురీతిలో జరిపితే మరిన్ని అవినీతి, అక్రమ భాగోతాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.
డిప్యూటీ డైరెక్టర్ వివరణ
ఆడిట్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఒంగోలు డిప్యూటీ డైరెక్టర్ రాధాకృష్ణను ఫోన్ ద్వారా వివరణ కోరగా ‘కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై అవినీతి ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేననీ పేర్కొన్నారు. వీరిద్దరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మాట నిజమే’నన్నారు. వీరిపై చర్యలు తీసుకునే అధికారం లేదనీ, కేవలం బదిలీ మాత్రమే తాను చేయగలనన్నారు. పైస్థాయి అధికారులకు వీరిపై నివేదిక పంపించినట్లు ఆయన స్పష్టం చేశారు.