కర్నూల్

దోపిడీ కేసులో నిందితురాలి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 25: ఆమె ఒక సాధారణ గృహిణి. వీధిలో అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆమె మాటల వెనుక అంతర్లీనంగా దాగిన అత్యాశ అడ్డదారులు తొక్కించింది. ఆర్థికంగా కష్టాలు రావడంతో గట్టెక్కేందుకు దొంగతనమే మార్గంగా ఎంచుకుంది. చివరకు చంపేందుకు కూడా సాహసించింది. ఈక్రమంలో పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కపెడుతోంది. నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో ఈనెల 22న మహిళలపై దాడికి పాల్పడి నగలు దోపిడీ చేసిన కేసులో నిందితురాలు కంకిపాటి జయలక్ష్మిని 2వ నగర పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నగర డిఎస్పీ వెంకటరామడు విలేఖరుల సమావేశంలో వివరించారు. నెల్లూరు ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన కటకం వెంకట సతీష్ తన భార్య సుభాషిణి, తల్లి ఆదిలక్ష్మితో కలిసి నివసిస్తున్నాడు. వారి సమీప ఇంటిలో కంకిపాటి జయలక్ష్మి కుటుంబం ఉంటోంది. జయలక్ష్మికి సుభాషిణి కుటుంబంతో మంచి పరిచయం ఉంది. తరచూ ఇంటికి వస్తూ వెళుతుంటుంది. ఈ క్రమంలో సతీష్ పనికి వెళ్లడం, వారి కుమారుడు బడికి వెళ్లడంతో ఇంట్లో సుభాషిణితో పాటు అనారోగ్యంతో ఉన్న ఆదిలక్ష్మి మాత్రమే ఉండడంతో జయలక్ష్మికి దుర్భుద్ధి కలిగింది. ఈనెల 22న మధ్యాహ్నం వారి ఇంట్లోకి ప్రవేశించి వంట చేస్తున్న సుభాషిణి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేసింది. ఆమె స్పృహ తప్పడంతో మరణించినట్లు భావించి ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుంది. ఈ అలికిడి పక్క గదిలో ఉన్న ఆదిలక్ష్మి రావడంతో ఆమె తలపై బలంగా బాదడంతో ఆదిలక్ష్మి అచేతనంగా పడిపోయింది. వెంటనే ఆమె ఒంటిపై ఉన్న నగలను కూడా దోచుకుని అక్కడ్నుంచి జారుకుంది. ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ ప్రారంభించారు. వారి విచారణలో జయలక్ష్మి ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమెను సోమవారం అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి సుమారు 20 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వెంకటరాముడు తెలిపారు. కేసును త్వరగా చేధించిన 2వ నగర సిఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై తిరుపతయ్య, ఇతర సిబ్బందిని డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.