కర్నూల్

‘శిల్పా’ సోదరులకు గడ్డుకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 25 : కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన శిల్పా సోదరులు ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. నంద్యాల, శ్రీశైలం నియోకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్న వారికి వైకాపా ఎమ్మెల్యేల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆ పార్టీని వీడి టిడిపిలో చేరగా రానున్న రెండు రోజుల్లో శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధికార పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధిపత్యం కొనసాగుతుందని శిల్పా సోదరులకు ప్రాధాన్యత తగ్గుతుందని ఆయా నియోజకవర్గాల్లో చర్చించుకుంటున్నారు. కడప జిల్లాకు చెందిన శిల్పా మోహనరెడ్డి 1999 నుంచి 2003 వరకూ టిడిపిలో కొనసాగారు. ఆ సమయంలో మహానంది వ్యవసాయ కళాశాల పాలక మండలి సభ్యుడిగా ఎంపికైన ఆయన నంద్యాలలో స్థిరపడి సేవా కార్యక్రమాలు ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. నియోజకవర్గంలో పరిచయాలు పెంచుకుంటూ 2004 ఎన్నికల్లో నంద్యాల నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయనకు టికెట్ రాదన్న నిర్ణయంతో దివంగత వైఎస్ ఆశీస్సులతో 2003లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2014 ఎన్నికల నాటికి అనేక మార్పుల కారణంగా కాంగ్రెస్‌ను వీడిన శిల్పా మోహనరెడ్డి టిడిపిలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి వైకాపా అభ్యర్థి భూమా నాగిరెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు. శిల్పా సోదరుడైన చక్రపాణిరెడ్డి అన్నకు తోడుగా నంద్యాలలోనే ఉంటూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో నంద్యాల నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు, మహానంది మండలాలు శ్రీశైలం నియోజకవర్గంలో చేరాయి. దీంతో శిల్పా చక్రపాణిరెడ్డి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే అక్కడ ఏరాసు ప్రతాపరెడ్డి ఉండటంతో సాధ్యం కాలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించి కాంగ్రెస్‌ను వీడి 2012లో వైకాపాలో చేరారు. ఆ తరువాత నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న క్రమంలో 2013లో ఓదార్పు యాత్రకు వచ్చిన జగన్ అకస్మాత్తుగా ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని వైకాపా ఇన్‌చార్జిగా ప్రకటించారు. దాంతో వైకాపాను వీడి టిడిపిలో చేరిన చక్రపాణిరెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ 2015లో ఆయనను జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమించి ఆ తరువాత స్థానిక సంస్థల ప్రతినిధిగా శాసన మండలికి ఎన్నికయ్యేలా చంద్రబాబు సహకరించారు. దాంతో క్రమేణా శిల్పా సోదరులు టిడిపిలో కీలక నేతలుగా మారుతున్న సమయంలో పార్టీ ఫిరాయింపులు ఇబ్బందులు పెడుతున్నాయి. నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే ప్రాధాన్యత తగ్గిందని భావిస్తున్న శిల్పా మోహనరెడ్డి ఆవేదన చెందుతుండగా శ్రీశైలంలో కూడా సోదరుడు చక్రపాణిరెడ్డి పరిస్థితి అదేవిధంగా ఉంటుందని మరింత ఆందోళన చెందుతున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి భవిష్యత్తుపై ఆలోచన, నిర్ణయాలు ఎలా ఉంటాయోనని ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది.