కర్నూల్

ఎన్‌టిఆర్ హయాంలోనే సీమ ప్రాజెక్టులకు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, జనవరి 9:దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ హయాంలోనే సీమ ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగిందని, ఇది తెలియని వైకాపా అధినేత జగన్ అనాగరికంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి విరుచుకుపడ్డారు. పట్టణంలోని 20వ వార్డులో సోమవారం లక్ష్మీవేంకటేశ్వర కల్యాణ మండపంలో జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సిఎం కెఇ మాట్లాడుతూ సిఎం చంద్రబాబు దేశంలోనే ప్రప్రథమంగా నదుల అనుసంధానం చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకుంటున్నారన్నారు. ఇంకా ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే జగన్ ప్రాజెక్టుల నిర్మాణాలపై కూడా రాజకీయం చేయడం తగదన్నారు. పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం అడ్డుకునేందుకు ప్రయత్నించి వైకాపా నాయకులు చరిత్రహీనులయ్యారన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభించి కెసి రైతులను ఆదుకున్న ఘనత టిడిపికే దక్కిందన్నారు. రాష్ట్రంలోని అధిక శాతం రైతులు చుక్కల భూములతో చాలా ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యను పరిష్కరించేందుకు పలు దఫాలుగా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. పదేళ్లు అనుభవంలో వుంటే చుక్కల భూములపై సంబంధిత రైతులకు సర్వహక్కులు వుండేలా నిర్ణయించామని, ఆ భూములు రిజిస్ట్రేషన్ కూడా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం వినూత్న పద్ధతిలో చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా బాలికల కళాశాలల్లోనే వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 22 మిలియన్ల విద్యుత్ లోటు వుండగా నేటికి మిగులు విద్యుత్ సాధించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో రూపొందుతుందని, ఇందులో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఓర్వకల్లును పారిశ్రామికవాడగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి మహిళ స్వశక్తితో నెలకు రూ. 10 వేలు సంపాదించాలనే ఉద్దేశంతో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. ఇందుకోసం పొదుపు మహిళలకు రుణాలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తడకనపల్లి గ్రామంలో పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం పశువసతి గృహం ప్రారంభించామన్నారు. గ్రామీణ యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నెలకు రూ. 149కే ఫైబర్‌గ్రిడ్‌ను ప్రారంభించిందన్నారు. ఈ ఏడాది చివరిలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ మున్సిపాలిటీని మాండ్ర దత్తత తీసుకుని మున్సిపాలిటీని అన్నివిధాలా అభివృద్ధి చేయడం హర్షణీయమన్నారు. జిల్లాలో 6,500 కి.మీ సిసి రోడ్లు ఏర్పాటు చేశామన్నారు. టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు మున్సిపాలిటీకి ఎస్‌ఎస్ ట్యాంకు, వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయించాలని విన్నవించగా అందుకు కృషి చేస్తానని కెఇ హామీ ఇచ్చారు. జెసి హరికిరణ్ మాట్లాడుతూ అభివృద్ధిలో దేశంలోనే ఏపిని 5వ స్థానంలో నిలిపిన ఘనత ప్రభుత్వానికే దక్కిందన్నారు. సభలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మినారాయణరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు కాతా రమేష్‌రెడ్డి, తహశీల్దార్ రమణారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మునాఫ్, కౌన్సిలర్లు సుమలత, శ్రీనివాసరెడ్డి, ముర్తుజావలి, దేశెట్టి శ్రీనివాసులు, భాస్కరరెడ్డి, టిడిపి నాయకులు వేణు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* జన్మభూమి సభలో మంత్రి అచ్చెన్నాయుడు
కర్నూలు, జనవరి 9:రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పేదల సంక్షే మం కోసం సిఎం చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారని కార్మికశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నగరంలోని బుధవారపేటలో ఉన్న ముబారక్‌నగర్‌లో సోమవారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆనందమయ జీవితం గడిపి కుటుంబ వికాసం చెందితేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జన్మభూమిలో భాగంగా అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు, చంద్రన్నబీమా, విద్యుత్, విద్య, ఉపా ధి, తదితర అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అలాగే పట్టణంలోని మురికివాడలో అపార్టుమెంట్లు నిర్మించి అందులో అర్హులకు ఇళ్లు ఇచ్చేందుకు జిల్లాకు 10వేల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఉత్తరాంధ్రలో 3, రాయలసీమలో 4 జిల్లాలకు సాగునీరందించి 2 పంటలు వేసుకునేలా ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. బుడగ జంగాల సమస్యపై సిఎం చంద్రబాబు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ కమిషన్ నుంచి నివేదిక అందగానే సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా తయారు చేసేందుకు సిఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. సీమ హక్కు ల్లో భాగంగా సిఎం అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించారని, అలాగే జిల్లాను రెండవ రాజధానిగా, రెండవ హైకోర్టు ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఇప్పటికే కర్నూలును సుందర నగరంగా తీర్చిద్దిదామని, మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రూ. 400 కోట్లతో కర్నూలు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం అర్హులకు రేషన్‌కార్డులు, చంద్రన్న కానుక పంపిణీ చేశారు.
కుటుంబ వికాసం కోసం
సిఎం చంద్రబాబు కృషి
* జగన్ అబద్దాల కోరు
* జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు
నంద్యాల, జనవరి 9: రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేందుకు, కుటుంబ వికాసం కోసం ముఖ్యమంత్రి 15 సూత్రాల పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెంనాయుడు అన్నారు. సోమవారం మహానంది మండలంలోని గాజులపల్లె గ్రామంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ వికాసం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పేద కుటుంబాలను ఆదుకొనేందుకు రేషన్‌కార్డులు మంజూరు చేయడంతోపాటు అర్హులైనవారందరికి పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. జన్మభూమి గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి ప్రణాళికను రూపొందించేందుకు జన్మభూమి కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం పేదలకు వరంలాంటిదన్నారు. ఈ పథకంలో రూ.15లు ఖర్చుచేసి చేరితే ప్రమాద వశాత్తు, సహజ మరణానికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. ముఖ్యమంత్రి గ్రామాల్లో విద్యాభివృద్ధికి, క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే దిశలో ముందుకు పోతున్నారన్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని ప్రతి గ్రామానికి ఫైబర్ నెట్ కనెక్షన్ల ద్వారా రూ.149లకే మూడు సేవలు అందించే పథకం అమలులోకి వచ్చిందన్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నగదు రహిత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతంలో డీలర్లకు ఆదాయం వచ్చేవిధంగా పథకం రూపొందించామన్నారు. జగన్ ఏమాత్రం రాజకీయ అవగాహన లేకుండా నోరు విప్పితే అబద్ధాలు తప్ప మరేమి మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి మోసగాడని పదేపదే విమర్శించడం సరికాదని, గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలే ఆయనను నిలదీయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రైతు భరోసా యాత్ర తలపెట్టి పార్టీని కాపాడుకోవడంతోపాటు తెలుగుదేశం పార్టీపై బురదచల్లే పనిని చేపట్టారన్నారు. జగన్ తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతే ఆయన కుమారుడిగా పర్సెంటేజీలు దండుకొని కోట్లు కూడబెట్టుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. జగన్ తండ్రి శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిధులు కేటాయిస్తూ ఒక్కొక్క పథకాన్ని పూర్తి చేస్తూ రైతాంగానికి రెండుకార్లు నీరు ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోనే కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. కలెక్టర్ విజయమోహన్ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లపై మాట్లాడుతూ మహానంది మండలం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు చేసే పని తమ పరిధిలోనే ఉందని, అందరితో చర్చించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తూ గ్రామీణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షులు పిపి నాగిరెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రైతులకు అండగా ఉంటాం
* వైకాపా అధినేత వైఎస్ జగన్
మహానంది, జనవరి 9: రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంటబానికి వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి మండలంలోని పుట్టుపల్లి, అబ్బిపురం, తిమ్మాపురం గ్రామాల్లో రైతు ఓదార్పు యాత్రను నిర్వహించారు. శ్రీశైల నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఓదార్పు యాత్ర ప్రజల నీరాజనాల మధ్య కొనసాగింది. అయితే ఎక్కడా ప్రజలనుద్దేశించి మాట్లాడకపోవడంతో ప్రజలు నిరాశచెందారు. తిమ్మాపురం గ్రామంలో కౌలురైతు చిన్నస్వామి కుటుంబాన్ని ఆయన పరామర్శించి భార్య నూర్జహాన్, కొడుకు శివసాయి, కూతురు ఉమేరాలతోమాట్లాడుతూ మీకుటుంబానికి వైఎస్సార్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించారు. ఆయన వెంట ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపి అనంతవెంకట్రామిరెడ్డి, రోడ్‌షో ఇన్‌చార్జి ఈశ్వర్‌రెడ్డి, ఎన్‌శివరామిరెడ్డి, తదితరులు ఉన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..
* వైకాపా అధినేత జగన్‌కు ఎమ్మెల్సీ శిల్పా సవాల్
ఆత్మకూరు, జనవరి 9:కర్నూలు జిల్లాలో టిడిపి హయంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఎమ్మెల్సీ శిల్పా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతు భరోసాయాత్ర పేరిట జగన్ ఆత్మకూరుకు వచ్చినప్పుడు కర్నూలు జిల్లాలో అభివృద్ధి జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే జగన్ కానీ ఎవరైనా ఆ పార్టీ ఎమ్మెల్యే కానీ జిల్లాలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రజల్లో సిఎం చంద్రబాబుకు లభిస్తున్న ఆదరణను సహించలేక జగన్ టిడిపిపై బురదజల్లే కార్యక్రమాలు పెట్టుకున్నారని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రాయలసీమ రైతులకు సాగునీరు అందించేందుకు అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవనాడి అన్నారు. శ్రీశైలం జలాశయంలో డెడ్ స్టోరేజీ ఉన్నా మనం ముచ్చుమర్రి ఎత్తపోతల నుంచి కెసి కెనాల్‌కు నీరు విడుదల చేసుకోవచ్చున్నారు. సిఎం చంద్రబాబు గాలేరు, తెలుగుగంగ, కెసి కెనాల్‌ను అనుసంధానం చేస్తూ ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రైతులకు సాగునీరు అందించే బృహత్తర పథకాన్ని అమలు చేయబోతున్నారన్నారు. మార్చి 10వ తేదీ లోపు సిద్దాపురం ఎత్తిపోతల పథకానికి సిఎం చేత ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. దీంతో దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే జిల్లాలోని పులికనుమ, కులకుర్తి, గురురాఘవేంద్ర, ముచ్చుమర్రి 3వ పంపు, తదితర ఎత్తిపోతలు పథకాలను మార్చి నెల లోపు పూర్తి చేయాలన్న సంకల్పంతో సిఎం చంద్రబాబు అధికారులను పురుగులు పెట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక ఈ నెలలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, జైన్ ఇరిగేషన్ పనులు పూర్తవుతాయన్నారు. దీంతో నందికొట్కూరు, ఆత్మకూరు, పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. జిల్లాలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే జగన్ మాత్రం అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎస్‌సి సబ్ ప్లాన్ కింద శ్రీశైలం నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ. 7.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే వడ్ల రామాపురానికి రూ. 1.35 కోట్లు, సున్నిపెంటకు రూ. 1.5 కోట్లు, అబ్దుల్లాపురానికి రూ. 1.5కోట్లు, బోయిరేవులకు రూ. 95లక్షలు, తమ్ముడపల్లెకు రూ. 75లక్షలు. మసీదుపురానికి రూ. 1.2 కోట్లు, నందిపల్లెకు రూ. 64 లక్షలు, బోయిలకుంట్లమెట్టకు రూ. 27 లక్షలు, ఆర్‌ఎస్ గాజులపల్లెకు రూ. 35 లక్షలు, కుట్టుపల్లెకు రూ. 20 లక్షలు మంజూరయ్యాయన్నారు.
మోదీ, బాబులను
గద్దె దించే దాకా పోరాటం
* జిల్లా మహిళా కాంగ్రెస్ ధర్నా
కర్నూలు సిటీ, జనవరి 9:ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులను గద్దె దించే దాకా మహిళా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని జిల్లా కాంగ్రెస్‌పార్టీ మహిళా అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు ఎన్నికలకు ముందు పేద ప్రజలకు అండగా ఉంటామని వాగ్దానాలు చేసి అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారని ధ్వజమెత్తారు. బ్లాక్‌మనీ బయటకు తీస్తానన్న చెప్పి పెద్దనోట్లను రద్దు చేసిన మోదీ 60రోజులు అవుతున్నా ఎన్ని కోట్ల బ్లాక్‌మనీ బయటకు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మోదీ తన తల్లిని బ్యాంక్ దగ్గర క్యూలో నిలబెట్టగలిగారు కానీ బడాబాబులను నిలబెట్టలేక పోయారని విమర్శించారు. బడాబాబుల మొండి బకాయిలు సుమారు రూ. 1.14కోట్లు రద్దు చేశామని సాక్షాత్తుగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని, ఆ డబ్బు ప్రజలది కాదా అని ప్రశ్నించారు. నల్లకుబేరుల కొమ్ముకాస్తూ పేదలు, రైతులు, మహిళలను బ్యాంక్‌ల దగ్గర పడిగాపులు పడేటట్లు చేసిన మోదీని, ఆయనకు మద్దతుగా నోట్ల రద్దుకు వంత పాడుతున్న సిఎం చంద్రబాబులను గద్దె దించే దాకా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి దాకా ఎన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేశారో శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళా సాధికారతే ధ్యేయమని కేకలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళా అధికారులపై దాడులకు దిగడం, వేధించడం సిగ్గు చేటన్నారు. పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ, బడా బాబులకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను వ్యతిరేకిస్తూ, మోదీ, చంద్రబాబులను గద్దె దించటమే మహిళా కాంగ్రెస్ ధ్యేయమన్నారు. ధర్నాలో కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లు సారమ్మ, సూర్యకాంతమ్మ, రాజేశ్వరి, ఎల్లమ్మ, మద్దమ్మ, విజయలక్ష్మి, సుమలత, తదితరులు పాల్గొన్నారు.
ఓంకారంలో జగన్ ప్రత్యేక పూజలు
బండిఆత్మకూరు, జనవరి 9: మండల పరిధిలోని ఓంకార క్షేత్రంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర చేపడుతున్న వైఎస్ జగన్ లింగాపురం గ్రామం నుంచి నేరుగా ఓంకార క్షేత్రం చేరుకోవడంతో ఆలయ అధికారి వీరయ్యతోపాటు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగన్‌తోపాటు శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డిని శాలువాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు, ఆలయ అభివృద్ధికి అటవీ అధికారుల జోక్యంతో అడ్డంకులుగా మారుతున్నాయని ఆయనకు విన్నవించడంతో ఆయన దీనిపై పునరాలోచించి పార్టీపరంగా కృషి చేస్తానని తెలిపారు. వీరి వెంట డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, మురళీ కృష్ణ, పత్తికొండ వైసిపి ఇన్‌చార్జి నారాయణరెడ్డి, మండల నాయకులు ఈశ్వర్‌రెడ్డి, పుల్లారెడ్డి, మహేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, ధరిణిరెడ్డిలు పాల్గొన్నారు.
రేపు మల్లన్నకు వార్షిక ఆరుద్రోత్సవం
శ్రీశైలం, జనవరి 9: శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారికి ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని 11వ తేదీన స్వామి వారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించనున్నట్లు ఇఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తారని, కాని ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం స్వామి వారికి వార్షిక ఆరుద్రోత్సవం ఎంతో వైభవంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారన్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని 11వ తేదీన స్వామి వారికి మహన్యాసపూర్వక లింగోద్భావకాల రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహిస్తారు. 12న తెల్లవారుజామున ప్రాతఃకాల పూజల అనంతరం స్వామి వారికి ఉత్తరద్వార దర్శనం నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు. రాత్రి 10 గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వీగ్నంగా జరగాలని మహాగణపతి పూజ, లోక కల్యాణం కోసం ఆలయ అర్చక వేదపండితులు సంకల్పం పటిస్తారు. అనంతరం మహాన్యాసం జరిపి స్వామి వారికి లింగోద్భవ రుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకాన్ని పంచామృతాల తోను, పలు రకాల ఫలోదకాలతోను ఆలయ ప్రాంగణంలోని మల్లికా గుండం నందు గల పుణ్యజలంతోను అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా ఏకకాలంలో 11 మంది ఆలయ అర్చక వేదపండితులు రుద్ర మంత్రాలను పఠిస్తూ అభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారికి అన్నాభిషేకం, పలు రకాల పూలతో, బిల్వదలాలతో స్వామివారికి విశేష పూజలు జరిపించనున్నారు. 12వ తేదీ ఉదయం మంగళవాయిద్యాల అనంతరం స్వామి వార్లకు ప్రాతఃకాల పూజలు జరిపించిన తరువాత ఉత్సవ మూర్తులను ఉత్తర ముఖంగా వేంచింపచేయించి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అనుమతిస్తారన్నారు. ఉత్తర ద్వార దర్శనం కారణంగా సుప్రభాత సేవ, మహా మంగళ హారతులు ఏకాంతంగా నిర్వహిస్తారని, అనంతరం ఉదయం 6.30 గంటల తరువాత భక్తులను సర్వదర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతిస్తారన్నారు.
వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
* వైకుంఠ ద్వారం ప్రారంభించిన పీఠాధిపతి
మంత్రాలయం, జనవరి 9: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ముందుగా సాక్షాత్తు శ్రీరాఘవేంద్ర స్వామిచే ప్రతిష్ఠించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు అశేష పండితుల వేదమంత్రాల మధ్య ముక్కోటి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని వైకుంఠ ద్వారంను ప్రారంభించారు. భక్తులు వైకుంఠ ద్వారం గుండా వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రాథమిక విద్యను
మాతృభాషలోనే బోధించాలి
* ఆపస్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్
కర్నూలు సిటీ, జనవరి 9:ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని ఏపి ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే జరిపితే విద్యార్థులకు పూర్తిగా అర్థమవుతుందని యునిసెఫ్ సైతం సూచిస్తోందన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవటం శోచనీయం అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు వల్ల పాఠశాలలకు లాభం లేదని కావున ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టుల స్థాయి పెంపునకు విడుదల చేసిన ఉత్తర్వులు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని విమర్శించారు. అలాగే సిపిఎస్ విధానం రద్దు, పాఠశాలల్లో కనీస వౌలిక వసతుల కల్పన, ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎంపి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరోగ్య కార్డులు ఆసుపత్రుల్లో చెల్లుబాటు కావటం లేదని, 10వ పిఆర్‌సి వేతన సవరణ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ లేక పదోన్నతులు నిలిచిపోయాయని, రూ. 398 వేతనంతో పని చేసిన ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ధర్నాలో ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కృష్ణార్జునరెడ్డి, రంగస్వామి, తాయప్ప, భైరప్ప, తిమ్మారెడ్డి, వీరారెడ్డి, రమేష్, శంకర్, బజారి, నరసప్ప, తదితరులు పాల్గొన్నారు.
కలియుగ దానకర్ణుడు జువ్వాజి
* జయంతి సభలో డిప్యూటీ సిఎం కెఇ
నందికొట్కూరు, జనవరి 9:కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలు, పొ లాలను పట్టణ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చిన జువ్వాజి సుంకన్నగౌడ్ కలియుగ దానకర్ణుడని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి కొనియాడారు. జువ్వా జి జయంతి సందర్భంగా సోమవారం జువ్వాజి సేవా సమితి అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వున్న జువ్వాజి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి సభ లో కెఇతో పాటు, జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఐజయ్య, టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు ప్రథమ సర్పంచ్‌గా పనిచేసిన జువ్వాజి విరాళంగా ఇచ్చిన స్థలాల్లో నేడు ప్రభుత్వ బాలు ర, బాలికోన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల, మున్సిపల్ కార్యాలయం, వసతి గృహాలు, కల్యాణ మండపం, సంతమార్కెట్ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, డీఎస్పీ సుప్రజ, సిఐ శ్రీనాథరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మినారాయణరెడ్డి, డిఇ నాగభూషణంరెడ్డి, జువ్వాజి సేవా సమితి సభ్యులు లక్ష్మినారాయణగౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రైతు ఇంట ఆనందమే చంద్రన్న లక్ష్యం
మహానంది, జనవరి 9: ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రైతు ఇంట ఆనందం చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని, రైతు శ్రేయస్సుకు రాయలసీమలో చెరువులు నింపేందుకు రూ.750 కో ట్లు ఖర్చు చేస్తున్నారని, రెండుకార్లకు సాగునీరు అందిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గాజులపల్లె గ్రామంలో 4వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రితోపాటు కలెక్టర్ విజయమోహన్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో వీరికి ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్టాల్స్ పరిశీలించి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అన్నప్రాసన, సీమంతాలు కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ చావిడి వద్ద సర్పంచ్ వెంకటలక్ష్మి, ప్రత్యేక అధికారి సత్యంలు అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ పేదవాడి ఇంట ఆహార భద్రతే చంద్రన్న లక్ష్యమని, ప్రజల సమస్యలు ప్రజల మధ్య పరిష్కరించేందుకు ఈ జన్మభూమి కార్యక్రమం తీసుకువచ్చారన్నారు. 4వ విడత జన్మభూమి 15 సూత్రాలతో ప్రజల ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిన పేదల అభ్యున్నతికి ఎన్నో పథకాలు తీసుకువచ్చారన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రజా పాలన చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంటే ప్రతిపక్ష నేత అబద్దాల మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెన్షన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500 కోట్ల ఖర్చు చేస్తూ కేవలం రూ.200 మాత్రమే అందించేదన్నారు. ప్రస్తుతం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తూ 44 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్న ఘనత టిడిపిదేనన్నారు. శ్రీశైల నియోజకవర్గానికి 2 వేలు మంజూరయ్యాయని తెలిపారు. ఆహారభద్రతలో భాగంగా ప్రతి పేదవాడికి రేషన్‌కార్డు అందించడం జరుగుతుందన్నారు. వేలిముద్రలు పడని వారికి అధికారులు చొరవ చూపి వారికి అందించాలన్నారు. పర్వదినాల సమయంలో పేదవాడు కూడా మధురమైన భోజనం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రన్న కానుకలు అందజేస్తున్నారన్నారు. చంద్రన్న బీమా ప్రతి పేదవాడు పొందాలన్నారు. కుటుంబ భద్రతకు ఈ బీమా ఉపయోగపడుతుందన్నారు. 2017 జూన్ 31 నాటికి ప్రతి పేదవాడి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. తెలుగుగంగ ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందంటే ఆ ఘనత ఎన్‌టిఆర్‌దే అన్నారు. 48 లక్షల గృహాలు మంజూరు చేస్తే అందులో 18 లక్షల ఇళ్లకు ఊరు, పేరు లేవన్నారు. 9 వేల కోట్లు దోపిడీకి గురయ్యాయన్నారు. మార్చి 31 తరువాత జరిగే బడ్జెట్ సమావేశాల్లో గృహ నిర్మాణాలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ఎన్‌టిఆర్ ఆరోగ్యరక్షను అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గాజులపల్లెలో షాదీఖానా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహానంది మండలాన్ని మార్పు చేయడం ఇంకా తమ పరిధిలోనే ఉందని, దీన్ని ఆపే యత్నం చేస్తామన్నారు. గ్రామాల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ఇందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ శిల్పా, ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ మండలంలో మేదరులకు అధికంగా సమస్యలు ఉన్నాయని, ఫారెస్టు అధికారులు అడవికి వెళ్లనీయకుండ అడ్డుకుంటున్నారని, వీరికి అనుమతులు ఇప్పించాలని కోరారు. మహానంది మండలాన్ని ఆత్మకూరు రెవెన్యూకు మార్పు చేయకుండా అడ్డుకోవాలన్నారు. మండలంలో చెరువుల సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. ఆర్‌ఓ ప్లాంట్లు మంజూరు చేయాలని కోరారు. మండల సమస్యలపై వారు మంత్రికి వివరించారు. ఈ కా ర్యక్రమంలో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్ రామకృష్ణుడు, పిపి నాగిరెడ్డి, కొండారెడ్డి, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఎంపిటిసి సాలమ్మ, వెంకటరమణ, ఇఇ సుధాకర్‌రెడ్డి, డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే జన్మభూమి
కోవెలకుంట్ల, జనవరి 9:రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని అధికారుల సమక్షంలో పరిష్కరించడానికే ప్రభుత్వం జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తోందని ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పొట్టిపాడు గ్రామంలో సోమవారం జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బిసి రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం అధికారులతో కలిసి జన్మభూమి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులను తీసుకొచ్చి గ్రామంలో నెలకొన్న సమస్యలకు వారి ద్వారానే పరిష్కారం చూపేందుకు ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని విమర్శించారు. రైతులకు సకాలంలో కుందూ నది, ఎస్‌ఆర్‌బిసి కాలువల ద్వారా నీరందక ఇబ్బందుల పడుతున్న సమయంలో కలెక్టర్ ద్వారా సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సాగునీరు విడుదల చేయించానన్నారు. సభలో ఎంపిపి చెన్నకృష్ణమ్మ, ప్రత్యేకాధికారి శ్రీహరి, తహశీల్దార్ రామచంద్రారెడ్డి, ఎంపిడిఓ రామకృష్ణ, అన్ని శాఖల అధికారులు, పొట్టిపాడు సర్పంచ్ గువ్వల సులోచనమ్మ, ప్రజలు పాల్గొన్నారు.
వలసెళ్తున్న కూలీలు...
కోసిగి, జనవరి 9: కోసిగిలో దాపు 60 కుటుంబాలు గ్రామం వదలి గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్, బళ్ళారి, రాయచూరు నగరాలకు వలస బాటబట్టారు. పిల్లలతో ఇంటి వద్ద వృద్ధులను వదలి సోమవారం ఉదయం రైలు ఎక్కి వలస బాట పట్టారు. ఈ సంవత్సరం తగిన పంటలు రాకపోవడంతో తుంగభద్ర దిగువ కాలువకు నీరు సరఫరా నిలిచిపోవడంతో వేసుకున్న పంటలు పూర్తిగా నష్టం జరిగింది. ప్రారంభం దశలోనే వ్యవసాయ కూలీలకు, సన్న, చిన్న కారు రైతులకు పనులు లేకపోవడంతో చేసిన అప్పులు ఎక్కువ అవ్వడంతో బతుకు దెరురువు కోసం పట్టణాలకు వలబాట పట్టడం జరిగింది. గ్రామాల్లో ఉపాధి పనులు జరగకపోవడంతో పూట జరగడం కష్టంగా మారిందని కోసిగి, చింతకుంట, పల్లెపాడు, తదితర గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం కూలీలకు ఉపాధి పనులు కల్పించకపోవడంతో రూ.500లు, రూ.1000నోట్లు రద్దు చేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పనులు లేక వలసలు వెళ్ళిన ప్రాంతాల్లో పత్తి, మిరప పంటలు తీయడానికి ఉపాధి కోసం వెళ్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ పనులు కల్పిస్తే వలసలు వెళ్లమని కూలీలు స్పష్టం చేశారు.
పెద్దకడబూరులో...
పెద్దకడబూరు: గ్రామాల్లో ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళ్తున్నారు. సోమవారం పెద్దకడబూరులోని ఎస్సీ కాలనీ నుంచి 100 మంది లారీలో వలస బాట పట్టారు. గుంటూరు సమీపంలోని రాయల్ గ్రామానికి పిల్లలతో వలస వెళ్లారు. అక్కడ మిరప పంట తీయడానికి మంచి వేతనం ఉండడంతో వలస పోతున్నట్లు కూలీలు చెప్పారు. గ్రామంలో పనులు కరవైయ్యాయని, జీవనోపాధి లేక వలసలు పోతున్నామని, ఇళ్ల ముందు తమ పిల్లలను చూసుకునే వారు లేక పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వలసలు వెళ్లవద్దని ఉపాధి పనులను చేపడుతామని చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. దీంతో జీవనోపాధి కరవై గ్రామాల నుంచి వలసలు పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వలసల నివారణ కోసం ఉపాధి పనులను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చిరంజీవి, బాలకృష్ణ సినిమాల
రీలీజ్‌పై ప్రత్యేక చర్యలు
ఆదోనిటౌన్, జనవరి 9: చిరంజీవి, బాలకృష్ణ నటించిన రెండు చిత్రాలు విడుదల సందర్భంగా అభిమానులు ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా ముందు జాగ్రతగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టూటౌన్ సిఐ గంటాసుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం చిరంజీవి, బాలకృష్ణ అభిమాన సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సత్యం, రాజశ్రీ సీనికాంప్లెక్స్‌లో సినిమాలు విడదల అవుతున్నాయని ఒకే చోట రెండు కాంప్లెక్ ఉండడంతో అభిమానులు ఎలాంటి ఘర్షణలకు పాల్పాడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులు చేసిన సూచన మేరకు వాహనాల పార్కింగ్‌ను నిర్మాల్ థియేటర్‌లో ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు మల్లప్ప, బ