కర్నూల్

స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో వైకాపాకు పెరిగిన 38 ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, మార్చి 20:జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు గత ఏడాదితో పోలిస్తే ఈ మారు 38 ఓట్లు అత్యధికంగా రాగా టిడిపికి 46 ఓట్లు తగ్గాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో జిల్లాలో మొత్తం 1,080 ఓట్లు ఉండగా ప్రస్తుతం 1087 ఓట్లు ఉన్నాయి. అందులో గతంలో టిడిపి అభ్యర్థికి 610 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 564 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక వైకాపాకు గతంలో 464 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 502 ఓట్లు వచ్చాయి. అంటే టిడిపి కంటే వైకాపాకు 38 ఓట్లు అధికంగా వచ్చాయి. గతంలో జరిగిన ఎన్నికలో వైకాపా తరఫున 12 మంది ఎమ్మెల్యేలు వుండగా ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో వైకాపాకి ఐదుగురు ఎమ్మెల్యేలు తగ్గినా ఓట్ల శాతం పెరగడం గమనార్హం. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైకాపా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. దీంతో జిల్లాలో టిడిపి బలం పెరిగినప్పటికి స్థానిక సంస్థల ఎన్నికలో గతంలో కంటే 46 ఓట్లు టిడిపి అభ్యర్థికి తక్కువ వచ్చాయి. వైకాపా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరినా గత స్థానిక సంస్థల ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 38 ఓట్లు పెరిగాయి.
టిడిపిలో సంబరాలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో శిల్పా చక్రపాణిరెడ్డి 62 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడంతో జిల్లాలోని టిడిపి కార్యకర్తలు, అభిమానులు సోమవారం కర్నూలు నగరంలో పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. తొలుత కౌంటింగ్ కేంద్రం వద్దకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్‌చార్జిలు, కౌన్సిలర్లు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఫలితం వెలువడగానే అక్కడి నుంచి భారీ ర్యాలీగా టిడిపి కార్యాలయం చేరుకుని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శిల్పా చక్రపాణిరెడ్డి వెంట జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే జయనాగేశ్వరరారెడ్డి, టిడిపి కేంద్రకమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు శిల్పా మోహన్‌రెడ్డి, కెఇ ప్రభాకర్, ఏరాసు ప్రతాపరెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, కెడిసిసి బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, డోన్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు మీనాక్షినాయుడు, తిక్కారెడ్డి, కెఇ ప్రతాప్, కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి బిటి నాయుడు, వీరభద్రగౌడ్, తిక్కారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెపోగు ప్రభాకర్, పలువురు జడ్పీటిసి, ఎంపిటిసి సభ్యులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
నందికొట్కూరు రాజకీయాలను
దిగజార్చారు
* ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి
నందికొట్కూరు, మార్చి 20:ఎంతో ఘన చరిత్ర వున్న నందికొట్కూరు రాజకీయాలను స్వార్థం కోసం కపట నాటకాలు ఆడుతూ దిగజార్చారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది బట్టబయలైందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో సోమవారం బైరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం టిడిపి, వైకాపాలో కొనసాగుతున్న నాయకులు ఒక జేబులో టిడిపి కండువా, మరో జేబులో వైకాపా కండు వా పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆ రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరు పార్టీల నుంచి తామే పోటీ చేసి, చివరి దశలో ఒకరు విరమించుకోవాలని ప్రయత్నించారని, అయితే ఆ పార్టీల అధిష్ఠానాలు గుర్తించి ఒకరికి టికెట్ ఇవ్వకపోవడంతోనే వారి బంఢారం బయటపడిందన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సిఎం చంద్రబాబు ప్రారంభించిన రోజు వేదికపైనున్న వారంతా నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారన్నారు. డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన పదవులు ఎక్కువ రోజులు వుండవని హితవు పలికారు. సమావేశంలో నాయకులు అన్నపూర్ణ సంజీవరెడ్డి, గోవిందరెడ్డి, వెంకటేశ్వర్లు, జబ్బార్, సుబ్బారెడ్డి, సలాం పాల్గొన్నారు.