కర్నూల్

2016లోనే పునర్విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవెలకుంట్ల, ఏప్రిల్ 29: 2026 వరకూ పునర్విభజన జరగదని వైకాపా తన దత్తపత్రికలో ప్రచురించిన కథనా లు అవాస్తవమని, 2016లోనే తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన జరుగనుందని మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని వెలగటూరు గ్రామంలో శుక్రవారం చల్లా విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల వైకాపా నుంచి టిడిపిలోకి చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండడంతో ఆ పార్టీ తమ పత్రికలో అసత్య కథనాలు ప్రచురిస్తోందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి రాష్ట్ర వ్యాప్తంగా 50, కర్నూలు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో వారి పార్టీ నుంచి వలసలను ఆపడం చేతకాక చివరకు అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు పునర్విభజన కోసం కేంద్రాన్ని సంప్రదించగా సానుకూల స్పందన లభించిందన్నారు. 2016 ముగిసే నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.
కోవెలకుంట్ల నుంచి పోటీ చేస్తా..
నియోజకవర్గ పునర్విభజన 2016 ముగిసేనాటికి పూర్తయి కోవెలకుంట్ల తిరిగి నియోజకవర్గ కేంద్రంగా స్థానం సంపాదిస్తుందని, టిడిపి నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందుతానని మాజీ ఎమ్మెల్యే చల్లా స్పష్టం చేశా రు. తనను గతంలో ఎమ్మెల్యేగా మూ డు సార్లు గెలిపించిన రేనాటిగడ్డ నుం చి పోటీ చేసి గెలుపొంది ఈ ప్రాం తాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఇటీవల కొందరు నాయకులు తాము కోవెలకుంట్ల నుంచి పోటీ చేస్తామని ప్రకటించుకున్నా ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రకటనలు చేయడం తప్ప వారు చేసేదేమీ లేదని, తానే తిరి గి ఎమ్మెల్యే అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఆయనతో పటు కలుగొట్ల రామేశ్వరరెరడ్డి, టిడిపి నేతలు ఉన్నారు.