కర్నూల్

లక్ష్యాలను పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 29:గ్రామాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన కార్యక్రమాలను అమలుచేయడంలో ఎంపిడిఓలు కీలకపాత్ర వహించి లక్ష్యాలను త్రికరణశుద్ధితో పూర్తి చేసేందుకు సంసిద్దులు కావాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం ఉపాధి హామీ, వాటర్‌షెడ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో కరవును పారదోలేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. వాటిని అమలుచేయడంలో కర్నూలు జిల్లా ముందుందని, జిల్లా కలెక్టర్ ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంతరం కృషి చేయాలని ఎంపిడిఓలను ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్‌కు ఎంపిడిఓలు పూర్తి సహకారం అందించి ఉపాధిహామీ పనులు, ఇతర అభివృద్ధి పనుల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రజలతో మమేకం కావాలన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోతున్న తరుణంలో కరవును శాశ్వతంగా పారదోలేందుకు పంట సంజీవని కింద ప్రతి పొలంలో ఫారంపాండ్లు తవ్వుకునేందుకు రైతుల్లో ఉత్సాహం నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత తవ్వుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో ఉన్న చెరువుల్లో పూడిక తీయడం, చెరువు లేని గ్రామాల్లో పర్కులేషన్ ట్యాంకులు నిర్మించడం లాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం నాలుగు మొక్కలు పెంచుకోవడంతో పాటు ఇంట్లో వున్న ప్రతి ఒక్కరినీ విద్యావంతులు చేయాలని సూచించారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ ప్రతి అధికారి తన పరిధిలో కష్డపడి పని చేస్తే మార్పు సహజంగా వస్తుందన్నారు. ఆ దిశగా పని చేసి వేసవిలో కూడా తాగునీటి సమస్య లేకుండా చేశామని ఇందుకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చక్కగా పని చేశారన్నారు. గ్రామాభివృద్ధిలో ఎంపిడిఓలు మండలాల్లో పర్యటించేందుకు వాహనాలు లేక ఇబ్బందిపడుతున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వాహనాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో లక్ష ఫారంపాండ్స్, లక్ష ఇంకుడు గుంతలు, 25 వేల బోర్లకు రీచార్జి స్ట్రక్చర్లు, ఉపాధి హామీ పనుల కింద చేపట్టేందుకు నిర్ధేశించామన్నారు. వచ్చే రెండు నెలల కాలంలో పూర్తిస్థాయిలో అధిగమించేందుకు విశేష కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వున్న వాగుల్లో పూడిక తొలగించడంతో పాటు చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే అన్నింటినీ మంజూరు చేస్తామన్నారు. తాగునీటి సమస్య వున్న ప్రాంతాల్లో నీటి వనరులు లభ్యం కాని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సిఇఓ ఈశ్వర్, డ్వామా పిడి పుల్లారెడ్డి, అన్ని మండలాల ఎంపిడిఓలు, ఇఓఆర్‌డిలు పాల్గొన్నారు.