కర్నూల్

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడబూరు, ఏప్రిల్ 29: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి, వాటిని పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తున్నామని డిఐజి రమణకుమార్ వెల్లడించారు. శుక్రవారం పెద్దకడబూరులోని పోలీసు స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, క్రైం రేటుపై ఆరాతీశారు. అనంతరం డిఐజి విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. గ్రామాల్లో ఫ్యాక్ష నిజానికి పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి కౌనె్సలింగ్ నిర్వహించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. కప్పట్రాళ్ళ, గోస్పాడు, మరి కొన్ని ప్రాంతాలపై పోలీసు నిఘా ఉంచినట్లు తెలిపారు. మట్కా, పేకాట, మహిళలపై దాడులు, నాటుసారా తయారీ, విక్రయాలు వంటి వాటిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఇటీవల మండల పరిధిలోని నౌలేకల్లు గ్రామ శివారులో తాటి వనంలో జరిగిన మహిళ దారుణ హత్యను స్థానిక పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేయడంపై కోసిగి సిఐ, స్థానిక ఎస్‌ఐ, పోలీసులను డిఐజి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేయడంపై కోసిగి సిఐ కంబగిరి రాముడు, స్థానిక ఎస్‌ఐ నాగరాజు, హెడ్‌కానిస్టేబుల్ జగదీష్‌కుమార్, కానిస్టేబుళ్ళు శేకన్న, మద్దిలేటి, దాసప్ప, శ్రీనివాసులకు రివార్డులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆదోని డివిజన్ పరిధిలో మట్కాబీటర్లను అరెస్టు చేయడంలోను పోలీసులు ముందు ఉన్నారని, మట్కా పూర్తిగా నిర్మూలిస్తామని వెల్లడించారు. పోలీసులు ప్రజా సేవకు అంకితం కావాలన్నారు. ఈకార్యక్రమంలో సిఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు శంకరయ్య, నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.