కర్నూల్

వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, ఏప్రిల్ 29: రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్న 67 వేల ఎకరాల భూమిని, ఇతర ఆస్తులను, స్థలాలను పరీరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అక్రమంగా అనుభవిస్తున్న వారిపై చట్ట పరమైన అన్ని విదాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైనార్టీ కమిషనర్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సిఎఓ షేక్‌మహ్మద్ ఇగ్బాల్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆదోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆదోని డిఎస్‌పి శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ప్‌బోర్డ్భుములు 67 వేల ఎకరాలకుగాను 16వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, అనేక మంది అక్రమంగా భూములను ఆక్రమించుకొని అనుభవిస్తున్నారన్నారు. ఈ మొత్తం 67 వేల ఎకరాల భూములను వక్ప్‌బోర్డు స్వాదీనం చేసుకొని దాని ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వక్ప్ చట్టం మార్పుల కోసం కేంద్రానికి లేఖ రాశామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వక్ప్‌భూముల పరిరక్షణకు ముస్లిం మైనార్టీల సామాజిక, సాధికారికత, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, విధిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో ఉన్న చట్టాలను వక్ప్‌బోర్డులో అమలు చేసి అక్రమార్పులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదుల, దర్గాల ఆస్తుల ఆదాయంపై ప్రతి పైసా లెక్క చెప్పాల్సి ఉంటుందని, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని, అంతా దేవుడి ఆస్తి అని అన్నారు. ముతవల్లిలు, దర్గాల ముజవర్లు కేవలం నిర్వాహకులేనని, వారికి ఎలాంటి హక్కు లేదన్నారు. జిల్లాలోని ఎల్తారి దర్గా ఆదాయాన్ని గత ఎన్నో ఏళ్ళుగా అనుభవించిన ముజావర్‌పై అవినీతి నిరోదక చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. గతంలో క్రిమినల్ చర్యలు లేకపోవడం వల్లే వక్ప్‌బోర్డు ఆస్తులను వారి సొంత ఆస్తులుగా అనుభవిస్తున్నారని, అందువల్ల ముఖ్యమంత్రి రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో ఆస్తుల పరీరక్షణకు చర్యలు తీసుకున్నారన్నారు. దేశ వ్యాప్తంగా సైతం ఉన్న వక్ప్‌బోర్డు భూముల ద్వారా సరైన క్రమంలో వినియోగిస్తే రూ.64వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన స్పష్టం చేశారు. వక్ప్‌బోర్డు ఆదాయంతో ముస్లిం మైనార్టీ అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముస్లింలకు విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం, రుణ సహాయం అందిచేందుకు ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు. మైనార్టీ కార్పొరేషన్ పథకాల్లో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని, బ్యాంకర్ల ప్రమేయం లేకుండా రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మసీదుల్లో పని చేస్తున్న వౌజన్లు, పేష్‌మాంల జీతాల కోసం మొదటి విడతగా 2500 మసీదులకుగాను రూ.28 కోట్లు కేటాయించామని, త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఆదోనిలోని షాహిజామియా మసీదును వక్ప్‌బోర్డు స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈమసీదుకు 2వేల ఎకరాల భూమి, 173 దుకాణాలు ఉన్నా కూడా ఎలాంటి ఆదాయం చూపడం లేదన్నారు. అందువల్ల దీనిపై దృష్టి పెట్టామన్నారు. ఎల్లార్తి దర్గాలో భక్తుల కోసం మరుగదొడ్లు నిర్మాణానికి రూ.16లక్షలు మంజూరు చేశామని, అలాగే దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, కులమతాలకు అతీతంగా ఉన్న ఎల్లార్తి దర్గా అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈసమావేశంలో వక్ప్‌బోర్డు సిఇఓ అబ్దుల్‌ఖాదీర్, ఇన్‌స్పెక్టర్లు అల్త్ఫాహుసేన్, ఇనాయత్, జలాల్‌డోంగ్రి దర్గా ధర్మకర్త సయ్యద్ జూబేర్‌సాహెబ్, టిడిపి నాయకులు ఫకృద్దీన్, ముక్తార్‌అహ్మద్, పట్టణ ఖాతిబ్‌సాబ్ అలీహాస్మి, పట్టణ నాయకులు గౌస్‌మోదీన్, ఎంఐఎం నాయకులు జూనేద్, బందెనవాజ్ పాల్గొన్నారు.