కర్నూల్

కాలం చెల్లిన వాహనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జనవరి 13:నగరంలో కాలం చెల్లిన వాహనాలు రాకపోకలు సాగిస్తూ పెద్దఎత్తున పొగ వెదజల్లుతుండడంతో అటు వాహనదారులు, ఇటు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు అర్బన్ పరిధిలోని చెన్నసర్కిల్, బళ్లారి చౌరస్తా, కల్లూరు, సీ.క్యాంప్, నంద్యాల చెక్‌పోస్టు, బిర్లాగేట్ ప్రాంతాల్లో పాత వాహనాలు వందల సంఖ్యలో తిరుగుతున్నాయి. ఆయా వాహనాల నుంచి పెద్దఎత్తున పొగ వస్తుండడంతో వాహనం వెనుక వస్తున్న ఇతర వాహనదారులు, పాదచారులకు రోడ్డు కూడా కనపడని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు కొందరు యువకులు తమ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్‌ను ఓపెన్ చేసి భారీ శబ్ధంతో రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల పెద్ద శబ్ధం రావడమే కాకుండా వాటినుండి పొగ కూడా వెదజల్లుతోంది. వీటి వల్ల కల్లూరు అర్బన్ ప్రాంతాల్లో రోడ్డు ఎక్కాలంటేనే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కాలం చెల్లిన వాహనాలపై అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అహోబిలంలో వైభవంగా
గోదాదేవి, ప్రహ్లాదవరదస్వామి కల్యాణం
ఆళ్లగడ్డ, జనవరి 13: పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శనివారం రాత్రి ఆలయ ఈఓ కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో గోదాదేవి, శ్రీ ప్రహ్లాద వరద స్వాముల భోగి కల్యాణోత్సవం చూడముచ్చటగా జరిగింది. గత నెల 16 నుండి అహోబిలంలో గోదాదేవి అమ్మవారికి జరుగుతున్న ధనుర్మాస పూజల్లో భాగంగా ప్రతిరోజు వేకువఝామునే అమ్మవారికి పాశురాలు వళ్లించారు. నెల రోజుల ధనుర్మాస పూజలనంతరం గోదాదేవి అమ్మవారికి, శ్రీ ప్రహ్లాద వరద స్వామిలకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఉదయం ఉత్పమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి, గోదాదేవి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఉత్సవమూర్తులైన స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ఎదురుకోళ్ల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ భక్తుల సమక్షంలో స్వామి వారికి జిలకరా బెల్లం, కంకణధారణ, మాంగళ్యధారణ కార్యక్రమాలను జరిపించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అనేక మంది భక్తులు తరలివచ్చారు.