కర్నూల్

హంద్రీనీవా నీరు కల్లూరు చెరువులకు చేరేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జనవరి 13 : హంద్రీనీవా కాలువ ద్వారా కల్లూరు మండలంలోని చెరువులకు నీరు నింపేది ఎన్నడు, ప్రజలకు సాగు, తాగునీరు అందేదెప్పుడు అని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లోని ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా ద్వారా నీరందిస్తున్నారు. ఈ నీటితో హంద్రీనీవా కాలువ మండలంలోని వామసముద్రం, తడకపనపల్లి, చిన్నటేకూరు, పెద్దటేకూరు, చెట్లమల్లాపురం, ఉలిందకొండ, బస్తిపాడు, రేమడూరు, బొల్లవరం, పుసులూరు, నాయకల్లు గ్రామ పొలిమేరలలో నిండుకుండలా ప్రవహిస్తోంది. అయితే మండలానికి మాత్రం ఆ నీరు అందని ద్రాక్షలా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నిర్మాణంలో భాగంగా అనేక సారవంతమైన వ్యవసాయ పొలాలను కోల్పోయామని, రైతాంగానికి సాగు, తాగునీరు అందుతుందని ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నామని, ప్రజల కోరిక తీరేది ఎన్నడు అని రైతులు మదన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న చెరువులను హంద్రీనీవా నీటితో నింపుతామని హామీల వర్షం కురిపిస్తుండడంతో రైతుల ఆశలు మరింత బలపడ్డాయి. రానున్నది వేసవి కాలం కావడంతో ముందే మండలంలోని చెరువులను హంద్రీనీవా నీటితో నింపితే మండల రైతాంగానికి, ప్రజలకు నీటి కొరత తీరనుంది. మండలంలోని కొల్లంపల్లి, యాపర్లపాడు, ఎర్రకత్వ, పర్ల, పెద్దపాడు, సల్కాపురం, మార్కాపురం, పెద్దకొట్టాల, పందిపాడు తదితర గ్రామాల్లో గత ఏడాది తాగునీరు కొరత ఏర్పడటంతో అధికార యంత్రాంగం ట్యాంకర్లతో ఇతర ప్రాంతాల నుంచి నీరు సరఫరా చేసి ప్రజల దాహార్తి తీర్చారు. కనీసం ఈ ఏడాదైనా హంద్రీనీవా కాలువ ద్వారా మండలంలోని చెరువులను నీటితో నింపి సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.