కర్నూల్

క్రిష్ణానగర్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 13: నగరంలో జరుగుతున్న వరుస చోరీలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా నగరంలో ఇంటికి తాళం వేసి వెళ్లాలంటే ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈక్రమంలోనే నగరంలోని క్రిష్ణానగర్‌లో భారీ చోరీ జరిగిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో భద్రపరచిన కిలో బంగారు ఆభరణాలు, రూ. 4లక్షల నగదు దోచుకెళ్లారు. క్రిష్ణానగర్‌కు చెందిన డా. త్యాగరాజు ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో అతడి భార్య శ్రీదేవి పిల్లలతో కలిసి క్రిష్ణానగర్ రైల్వేగేట్ పక్కనే ఉన్న మొదటి రోడ్డులో నివాసం ఉంటోంది. కాగా నెల్లూరులోని తమ బంధువులకు ఆరోగ్యం సరిగా లేదని ఫోన్ రావడంతో శుక్రవారం మధ్యాహ్నం శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరుకు బయల్దేరి వెళ్లింది. శనివారం ఉదయం ఆమె పక్కింటి వాళ్లు మీ ఇంట్లో చోరీ జరిగిందని సమాచారం ఇవ్వడంతో వెంటనే హుటాహుటిన వెనుదిరిగి వచ్చింది. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి శ్రీదేవి అవాక్కయ్యారు. పిల్లల ఫీజుల కోసం దాచుకున్న రూ. 4లక్షలు చోరీకి గురయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కర్నూలు 4వ పట్టణ సీఐ నాగరాజారావు చోరీ జరిగిన ఇంటికి చేరుకుని పరిశీలించారు. అలాగే కొన్ని ఆధారాలు సేకరించారు. శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.