కర్నూల్

మఠం ధార్మిక అధికారిగా శ్రీపతాచార్ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఏప్రిల్ 29: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ధార్మిక అధికారిగా శుక్రవారం గుంజల్లి శ్రీపతాచార్ పదవి బాధ్యతలు చేపట్టినట్లు మఠం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో మఠం మేనేజర్‌గా, జోనల్ మేనేజర్‌గా పనిచేసిన శ్రీపతాచార్ కొద్ది కాలం క్రితం పదవీ విరమణ పొందారు. అయితే మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆదేశానుశారం ఒప్పందం ఉద్యోగిగా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
మఠం సన్నిధిలో మాజీ మంత్రి టిజి వెంకటేష్..
పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం శుక్రవారం మాజీ మంత్రి, పారిశ్రామిక వేత్త టిజి వెంకటేష్ వచ్చారు. ఆయనకు మఠం అధికారులు పూలమాలతో స్వాగతం పలికారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని శ్రీరాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మఠంపీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల మంత్రాక్షితలు జ్ఞపిక ఇచ్చి ఆశీర్వదించారు. ఈకార్యక్రమంలో మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.