కర్నూల్

సంగమేశ్వరంలో ముమ్మరంగా కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, ఏప్రిల్ 30:సప్తనది సంగమేశ్వరం కృష్ణా నదిలో నిర్వహించే పుష్కరాల పనులను శనివారం ఎస్పీ ఆకే రవికృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకూ జరిగే కృష్ణా పుష్కరాలకు ఎలాంటి అంతరా యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో 3 నెలల ముందుగానే పనులను ప్రారంభించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 15 రోజులకోసారి పోలీసు శాఖ తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. అనంతరం పుష్కర ఘాట్, ఎగువ పశ్చిమాన కొత్త స్నాన ఘాట్‌లను పరిశీలించారు. అలాగే కపిలేశ్వరుడు నుంచి సంగమేశ్వరానికి 5 కి.మీ పొడువునా నిర్మిస్తున్న తారు రోడ్డు పనుల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖ మిగిలిన శాఖలతో సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు స్థలాలను పరిశీలించి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీలు దేవదానం, బాబుప్రసాద్, సిఐలు దివాకర్‌రెడ్డి, డేగల ప్రభాకర్, ఎస్‌ఐ శంకర్, తదితరులు ఉన్నారు.