కర్నూల్

సీమ సమస్యలపై ఢిల్లీలో గళమెత్తుతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, ఏప్రిల్ 30: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రధాని నరేంద్రమోదీకి వినపడేలా రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ అంశాలను ప్రస్థావిస్తానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాయలసీమ హక్కుల బస్సు చైతన్య యాత్ర 70వ రోజు పర్యటనలో భాగంగా నంద్యాల మండలంలోని కానాల, రైతునగరం, గోస్పాడు మండలంలోని గోస్పాడు, యాళ్లూరు గ్రామాల్లో చైతన్య యాత్రను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం, చైతన్య యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాలు కనపడలేదని విమర్శించారు. ఇటీవల జరుగుతున్న ఫిరాయింపులు ప్రజల్లో చాలా చర్చనీయాంశంగా మారాయన్నారు. రాయలసీమ ఎడారి ప్రాంతం కాకుండ సస్యశ్యామలం కావాలంటే ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికావడమేకాకుండ యువతకు ఉపాధి లభించేలా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరవు కాటకాలతో తల్లడిల్లుతున్న సీమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఏ ఒక్క సమస్యను కూడా అమలు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. సిఎం రాయలసీమ వాసి అయినప్పటికి సీమ సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రవాస భారతీయులకు కూడా సీమవాణి వినిపిస్తానన్నారు. జూన్‌లో కళాశాలలు ప్రారంభమైన వెంటనే రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించి సీమకు జరుగుతున్న అన్యాయం వివరిస్తానన్నారు. ఎక్కడికి వెళ్లినా రాయలసీమ రాష్ట్రం అడుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పిఎస్ నాయకులు కడియం సాంబశివుడు, రోజక్క, రాజునాయుడు, నవీన్‌లతోపాటు వివిధ జిల్లాల నాయకులు పురుషోత్తం రెడ్డి, రాధాకృష్ణ, నాగరాజు, కృష్ణ, ప్రతాప్ పాల్గొన్నారు.