కర్నూల్

అహోబిలంలో పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, ఏప్రిల్ 30: పాములేటయ్య (పావన నరసింహస్వామి) వారాల సందర్భంగా అహోబిల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పాములేటయ్యకు వెళ్లాలన్న సంకల్పంతో శుక్రవారం రాత్రి నుండే తమ తమ వాహనాల్లో కొందరు, ఎగువ అహోబిలంకు వెళ్లి కొందరు నడుచుకుంటూ వెళ్లి తెల్లవారుఝాము నుండే భక్తులు పాములేటయ్య స్వామిని దర్శించుకొని తమ మొక్కుడులను తీర్చుకొని తిరిగి ఎగువ అహోబిలం చేరుకొని తమ బంధుమిత్రాదులతో కలిసి ఆరుబయట చెట్ల కింద భోజనాలు చేసి వస్తారు. శనివారం ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవారు, దిగువన వెలసిన శ్రీ ప్రహ్లాద వరద స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.