కర్నూల్

కడప ఉక్కుపై సీఎం రమేష్ దీక్ష బూటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జూన్ 24 : కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కడప నగరంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ చేస్తున్న దీక్షలు దురభిప్రాయంతో సాగుతున్నవని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య ఆ దీక్షలను తప్పుపట్టారు. పట్టణంలోని బీజేపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రమేష్, బీ.టెక్ రవి చేపట్టిన దీక్షా శిబిరం ఫుడ్ కమిటీ ఏర్పాటు చేసి రోజుకు 5 వేల మందికి భోజనాలు పెడుతూ, ఏసీలు వేసుకుని దీక్షలు చేయడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో సీఎం రమేష్ ప్రత్యక్ష సాక్షి అని, అప్పుడు చట్ట సభల్లో ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అప్పుడు ప్రశ్నించడానికి మాటలు రాలేదా అన్నారు. అప్పుడు రెండు కళ్ళ సిద్దాతంతో సీఎం రమేష్ నోరు మెదపలేదన్నారు. హంద్రీనీవా నీటి కాలువలను వెడల్పు చేసి రూ. 650కోట్లను మింగిన ఘనత సీఎం రమేష్‌కు దక్కుంతుందన్నారు. బినామి పేరుతో గాలేర నగరి ప్రాజెక్టు కాంట్రాక్టు తీసుకుని ఎంత వరకు పూర్తి చేశారన్నారు. సీఎం రమేష్ బినామి కంపెనీ రుత్వీక్‌పై మంత్రి ఆదినారాయణరెడ్డి చేత కంపెనీపై దాడి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. గతంలో కర్నాటక నుంచి సారాప్యాకేట్లు తీసుకొచ్చి అమ్ముకున్న పాత చరిత్రను సీఎం రమేష్ మరిచిపోయారని అన్నారు. 10 సంవత్సరాలు రాజ్య సభ సభ్యులుగా సీఎం రమేష్ ఉన్నారని ఒక్క ప్రాజెక్టు అయిన సీమ ప్రాంతానికి తెచ్చిన ఘనత ఉంటే చెప్పాలని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో దీక్షలు చేస్తున్న సీఎం రమేష్‌కు చిత్తశుద్ది ఉంటే ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి దీక్షలు చేయాలని కోరారు. రాయలసీమకు ఎంతో మేలు చేసే సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కేనాల్, తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణం కోసం నిరహార దీక్షలు చేయాలని వారు పేర్కొన్నారు. త్వరలో రాబోయే ఉక్కు ఫ్యాక్టరీ కోసం దొంగ దీక్షలు సీఎం రమేష్ చేపట్టారని ఆయనకు బుద్ది చెప్పాలని కోరారు. ఆయన దీక్షల్లో చిత్తశుద్ది లేదని విమర్శించారు. కాంట్రాక్టర్ పేరుతో కోట్లు వెనుకేసుకున్న సీఎం రమేష్ దీక్షలు చేయడం శోచనీయమన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఏర్పాటుపై మదాని కమిటీ వేశామని నివేదిక కూడా ఇచ్చారని కావున త్వరలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కడపలో సాగుతుందన్నారు. కావున ఆయన చేస్తున్న దీక్షలు అన్ని కూడా దురాలోచనతో సాగుతున్నాయన్నారు.
రాష్టస్థ్రాయి చెస్ పోటీలకు సాయిజయంత్ ఎంపిక
బనగానపల్లె, జూన్ 24:రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు బనగానపల్లెకు చెందిన ఏవీఎస్ సాయిజయంత్ ఎంపికయ్యాడు. అవుకు మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామగోవిందయ్య కుమారుడు సాయిజయంత్ ఆదివారం డోన్ పట్టణంలో జరిగిన జిల్లాస్థాయి చెస్ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచాడు. కర్నూలు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ డోన్‌లోని శ్రీ సుధ స్కూల్‌లో అండర్-25 పోటీలు నిర్వహించారు. దీంతో బనగానపల్లె ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో బీ.కామ్ తృతీయ సంవత్సరం చదుతున్న సాయిజయంత్ ఈ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచాడు. దీంతో జయంత్‌ను నిర్వాహకులు మెడల్‌తో సత్కరించారు. జయంత్ జూలైలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగే రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొంటాడని తండ్రి రామగోవిందయ్య తెలిపారు.
ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్షాలు
బనగానపల్లె, జూన్ 24:రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర, లౌకికవాద పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతాయని సీపీఐ నేతలు తెలిపారు. పట్టణంలోని జీఎం టాకీసు సమీపంలో ఉన్న ఏఐటీయుసీ కార్యాలయంలో ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ సహ కార్యదర్శి శివయ్యయాదవ్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడ్డయ్య, శివయ్య మాట్లాడుతూ సీపీఐ పేదలు, ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తుందని తెలిపారు. రేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, అర్హులకు రుణాలు, తదితర ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. బీజేపీ, టీడీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలాను ఇంతవరకూ అమలు చేయలేదని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన సీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, కడపలో ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, విద్య, వైద్యం, కేంద్ర విశ్వవిద్యాలయాలు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇంతకాలం బీజేపీతో కలిసి ఉండి, ఇప్పుడు విడిపోయి అంతా తామే అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర, లౌకికవాద పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతుందని తెలిపారు. ఇందుకు సీపీఐ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.